Site icon Prime9

Maruti Suzuki Wagon R Facelift: ఎగిరి గంతేసే న్యూస్.. అప్‌డేటెడ్ వ్యాగన్ ఆర్ వచ్చేస్తోంది.. దీని మైలేజ్ ఎవరూ ఆపలేరు..!

Maruti Suzuki Wagon R Facelift

Maruti Suzuki Wagon R Facelift

Maruti Suzuki Wagon R Facelift: దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజికి నిరంతరం మార్కెట్లోకి కొత్త మోడళ్లను విడుదల చేస్తుంది. కంపెనీ తన కొత్త డిజైర్‌ను నవంబర్ 11న విడుదల చేయనుంది. అయితే ఇంతలో మారుతి కొత్త వ్యాగన్‌ ఆర్‌పై పనిచేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంటే మీరు త్వరలో ఫేస్‌లిఫ్టెడ్ వ్యాగన్‌ఆర్‌ను చూడగలరు. వ్యాగన్ ఆర్ దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న హ్యాచ్‌బ్యాక్ కారు. ఈసారి ఈ కారులో ప్రత్యేకంగా ఏముంటుంది? తదితర వివరాలు తెలుసుకుందాం.

ఇంటర్నెట్‌లోని సమాచారం ప్రకారం..  మారుతి సుజుకి ఇప్పుడు అత్యంత ప్రజాదరణ పొందిన హ్యాచ్‌బ్యాక్ కారు వ్యాగన్-ఆర్‌ను అప్‌డేట్ చేస్తుంది. అయితే దీనికి సంబంధించి కంపెనీ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం వెల్లడించలేదు. అయితే ఈ ఏడాది చివరికల్లా దీన్ని లాంచ్ చేయవచ్చని భావిస్తున్నారు. అంటే వచ్చే ఏడాది ప్రారంభంలో మార్కెట్‌లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

కొత్త వ్యాగన్ ఆర్‌లో కొత్త ఇంజన్ ఇవ్వచ్చు. దీనితో పాటు హైబ్రిడ్ టెక్నాలజీని కూడా ఇందులోకి తీసుకురావచ్చు. సుజుకి దీనిని హైబ్రిడ్ టెక్నాలజీతో జపాన్‌లో పరిచయం చేయనుంది. ఇందులో 0.66 లీటర్ కెపాసిటీ గల హైబ్రిడ్ ఇంజన్ అందించారు. దీనితో eCVT ట్రాన్స్‌మిషన్ కూడా ఇచ్చారు. ఇది కాకుండా కొత్త వ్యాగన్ ఆర్ డిజైన్ కూడా అప్‌డేట్ అవుతుంది.

అలానే కారులో స్లైడింగ్ డోర్స్, వాహనం ముందు భాగం, సైడ్ లుక్, వెనుక భాగంలో కొన్ని మార్పులు చూడచ్చు. కానీ దాని పొడవైన కారు ఇమేజ్ కొత్త జనరేషన్‌లోకి తీసుకెళుతుంది. మీరు దాని ఇంటీరియర్‌లో కూడా కొత్తదనాన్ని చూడచ్చు. ఇప్పుడు మీరు దానిలో కొత్త ఫీచర్లను పొందుతారు.

మారుతి సుజుకి ఇప్పుడు హైబ్రిడ్ కార్లపై వేగంగా పని చేస్తోంది. టయోటా సహకారంతో కంపెనీ త్వరలో హైబ్రిడ్‌తో కూడిన అనేక కొత్త మోడళ్లను మార్కెట్లోకి తీసుకువస్తోంది. ఇది మాత్రమే కాకుండా మారుతి తన హైబ్రిడ్ మోడళ్లపై కూడా పనిచేస్తోంది. తద్వారా వాటిని మరింత మెరుగైన, ఫైనాన్సియల్ ఫార్మాట్‌లో మార్కెట్లోకి తీసుకురావచ్చు. త్వరలో మారుతీ ఫ్రంట్‌ఎక్స్, స్విఫ్ట్, డిజైర్, ఎర్టిగాలను హైబ్రిడ్ టెక్నాలజీతో మార్కెట్‌లోకి ప్రవేశపెట్టవచ్చు.

Exit mobile version
Skip to toolbar