Site icon Prime9

Maruti e Vitara: అందరూ వెయిటింగ్.. మారుతి సుజికి ఇ వితారా.. సింగిల్ ఛార్జ్‌పై 400 కిమీ రేంజ్..!

Maruti e Vitara

Maruti e Vitara: మారుతి సుజికి తన కొత్త ఇ వితారాను భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో విడుదల చేయబోతోంది. దీని ప్రత్యక్షపోటీ నేరుగా హ్యాందాయ్ క్రెటా ఎలక్ట్రిక్‌తో ఉంటుంది. సంస్థ ఇప్పటికే దాని టీజర్‌ను విడుదల చేసింది. గత సంవత్సరం ఇటలీలోని మిలన్ నగరరంలో జరిగిన మోటర్ షోలో ఇ విటారాను తీసుకొస్తున్నట్లు వెల్లడించింది. మారుతి సుజికి ఇప్పటికే భారతదేశంలోని ఆటో ఎక్స్‌పోలో తన ప్రొడక్షన్ స్పెక్ వెర్షన్ eVX కాన్సెప్ట్‌ను పరిచయం చేసింది. కారు పొడవు 4-మీటర్ల కంటే తక్కువగా ఉంటుంది.

కొత్త e వితారా 49 కెడబ్ల్యూహెచ్, 61 కెడబ్ల్యూహెచ్, రెండు బ్యాటరీ ప్యాక్ ఎంపికలను కలిగి ఉంటుంది. దీని 49 కెడబ్ల్యూహెచ్, బ్యాటరీ ప్యాక్ 142 బిహెచ్‌పి, 189 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీని రేంజ్ 390 కిమీ నుండి 400 కిమీ వరకు ఉంటుంది. ఇది కాకుండా, e వితారా 61 కెడబ్ల్యూహెచ్ పెద్ద బ్యాటరీ ప్యాక్‌ను పొందుతుంది, అలానే 180 బిహెచ్‌పి, 300 ఎన్ఎమ్ టార్క్‌ను ఇస్తుంది. సమాచారం ప్రకారం పెద్ద బ్యాటరీ ప్యాక్‌తో దాని రేంజ్ 500-560 కిలోమీటర్ల వరకు ఉంటుంది.

ప్రస్తుతం ఉన్న గ్రాండ్ విటారాతో పోలిస్తే కొత్త ఇ విటారా డిజైన్ కొద్దిగా భిన్నంగా ఉంటుంది. దీని ముందు, వెనుక భాగంలో కొన్ని మార్పులు కనిపించవచ్చు. ఇది 2700 mm వీల్ బేస్ కలిగి ఉంటుంది. ఇ విటారాను హార్ట్‌టెక్ ఇ-ప్లాట్‌ఫామ్‌ తయారు చేస్తున్నారు. దీని ముందు భాగంలో చాలా పదునైన ఎల్ఈడీ డీఆర్ఎల్ మాత్రమే కాకుండా, 19-అంగుళాల అల్లాయ్ వీల్స్ దాని టాప్-ఎండ్ వెర్షన్‌లో అందుబాటులో ఉంటాయి.

కొత్త ఇ వితారా లోపలి భాగంలో అధునాతన ఫీచర్లు ఉంటాయి. మంచి స్పేస్ కూడా ఉంటుంది. ఎలక్ట్రిక్ విటారా కూడా ‘ALLGRIP-e’ అనే ఎలక్ట్రిక్ 4WD సిస్టమ్‌తో రానుంది. ఇది ఆఫ్-రోడ్ సామర్థ్యాలను ఇస్తుంది. ఇది కాకుండా, ఈ మోడల్‌లో కొత్త 2-స్పోక్ స్టీరింగ్ వీల్ ఉంది. ట్విన్ స్క్రీన్ లేఅవుట్,  కొత్త డ్రైవ్ సెలెక్టర్ కూడా అందించారు.

మారుతి ఇ విటారా వచ్చే ఏడాది (2025)లో సుజుకి మోటార్ గుజరాత్‌లో ఉత్పత్తి చేయనుంది. ఈ వాహనాన్ని నెక్సా షోరూమ్‌ల ద్వారా సేల్ చేసే అవకాశాలు ఉన్నాయి. భారతదేశంలో, ఇది టాటా కర్వ్ EV, హ్యుందాయ్ క్రెటా EVలతో పోటీపడుతుంది.

Exit mobile version