Site icon Prime9

Maruti Suzuki e Vitara Bookings: మారుతి ఫస్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ.. బడ్జెట్ ధరలో వచ్చేస్తోంది.. రూ.25 వేలకే మీ సొంతం..!

Maruti Suzuki e Vitara

Maruti Suzuki e Vitara Bookings: మారుతి సుజుకి తన ఫస్ట్ ఫ్యూర్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఇ విటారాను ఆటోఎక్స్‌పో 2025లో పరిచయం చేసింది. ఈ కారు డిజైన్ పరంగా పెద్దగా ఆకట్టుకోకపోవచ్చు, కానీ ఫీచర్లు,  రేంజ్ ఈ కారు ప్రజల హృదయాలను గెలుచుకుంది. ఈ కారును కొనేందుకు కూడా ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కంపెనీ ఇ విటారాలో అనేక అద్భుతమైన ఫీచర్లను చేర్చింది. ఈ కారు ఫీచర్లు, ధర తదితర వివరాలు తెలుసుకుందాం.

ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ ఏడాది మే చవరి నాటికి కొత్త ఇ విటారాను ఇండియా మార్కెట్లో విడుదల చేయచ్చు. ఈ కారు ధర రూ. 16-17 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇ విటారా అనఫిషియల్ బుకింగ్స్ మొదలైనట్లు వార్తలు వస్తున్నాయి. వినియోగదారులు రూ. 25,000 టోకెన్ అమోంట్ చెల్లించి బుక్ చేసుకోవచ్చు. కానీ బుకింగ్ డీలర్‌షిప్ స్థాయిలో మాత్రమే జరుగుతోంది. దేశీయ మాార్కెట్లో ఈ కారు,  టాటా నెక్సాన్ ఈవీ, హ్యుందాయ్ క్రెటా ఈవీ , మహీంద్రా BE6 లతో పోటీపడుతుంది. కొత్త ఇ విటారా మార్కెట్లో హిట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

కొత్త ఇ విటారాను స్వచ్ఛమైన ఎలక్ట్రిక్ ప్లాట్‌ఫామ్‌పై తయారుచేశారు. ఈవీలో 49కిలోవాట్, 61కిలోవాట్ బ్యాటరీ ప్యాక్‌లు ఉన్నాయి. ఈ బ్యాటరీలను ఫుల్ ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్ల అందిస్తాయని కంపెనీ చెబుతుంది. ఇ విటారా‌ను గుజరాత్ ప్లాంట్‌లో తయారుచేస్తున్నారు. అక్కడి నుంచి జపాన్, యూరప్‌లకు ఎగుమతి చేస్తున్నారు. అలానే ఈ కారును నెక్సా అవుట్‌లెట్ల ద్వారా విక్రయించనుంది.

కారు కొలతల గురించి చెప్పాలంటే.. దీని పొడవు 4,275మీమీ, వెడల్పు 1,800మీమీ, ఎత్తు 1,635మీమీ, వీల్‌బేస్ 2,700మీమీ, గ్రౌండ్ క్లియరెన్స్ 180మీమీ. ఇ విటారా‌లో 3-పాయింట్ మ్యాట్రిక్స్ ఎల్‌ఈడీ డీఆర్ఎల్‌లు, ముందు భాగంలో వెనుక ల్యాంప్‌లు, అడ్జస్ట్‌బుల్ డ్రైవర్ సీటు ఉన్నాయి. భద్రత కోసం.. కారులో 7 ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరాలు, లెవల్-2 అడాస్, ప్యాడిల్ డ్రైవింగ్ మోడ్, ఫిక్స్‌డ్ గ్లాస్ సన్‌రూఫ్ ఉన్నాయి.

Exit mobile version