Site icon Prime9

Next Gen Maruti Dzire: కొత్త డిజైర్‌ వచ్చేస్తోందోచ్‌.. 32 కిమీ మైలేజ్.. ధర ఎంతంటే?

Next Gen Maruti Dzire

Next Gen Maruti Dzire

Next Gen Maruti Dzire: ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ మారుతి సుజికి తన కాంపాక్ట్ సెడాన్ డిజైర్ నెక్స్ట్ జనరేషన్ మోడల్‌ను త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇంటర్నెట్‌లోని సమచారం ప్రకారం.. దీపావళి తర్వాత కొత్త మోడల్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. కొత్త అప్‌గ్రేడ్ డిజైర్‌లో అనేక కొత్త ఫీచర్లు కనిపిస్తాయి. ఈ సెగ్మెంట్‌లో ఇతర కంపెనీ కార్లకు గట్టి పోటినిస్తుంది. ఇది మాత్రమే కాదు, భద్రతకు సంబంధించి కూడా మంచి ఫీచర్లను చూస్తారు. దీని గురించి పూర్తి సమచారం తెలుసుకుందాం.

ఇంటర్నెట్‌లోని సమాచారం ప్రకారం.. మారుతి సుజికి కొత్త జెన్ డిజైర్ ఫేస్‌లిఫ్ట్ నవంబర్ 11న భారతీయ రోడ్లపైకి వచ్చే అవకాశం ఉంది. అయితే గతంలో నవంబర్ 4న విడుదలవుతాయనే వార్తలు వచ్చాయి. ఈ కొత్త మోడల్ గురించి ఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే ఉన్నాయి. లక్షలాది మంది డిజైర్ ప్రేమికులు దీని కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఈసారి ఫస్ట్ ఫీచర్లు కొత్త డిజైర్‌లో రానున్నాయి.

బెస్ట్ పర్ఫామెన్స్, మైలేజ్ కోసం కొత్త డిజైర్‌లో కొత్త Z-సిరీస్ 3 సిలిండర్ ఇంజన్‌ ఉంటుంది. ఇది 82 బిహె‌చ్‌పి పవర్, 112 ఎన్ఎమ్ టార్క్‌ను రిలీజ్ చేస్తుంది. ఈ ఇంజన్ 5 స్పీడ్ మాన్యువల్, 5 స్పీడ్ ఏఎమ్‌టీ గేర్‌బాక్స్‌తో లింకై ఉంటుంది. అదే ఇంజన్ ప్రస్తుతం ఉన్న స్విఫ్ట్‌కు కూడా ఉంది. మెరుగైన మైలేజ్, పటిష్టమైన పనితీరు కోసం కంపెనీ ప్రత్యేకంగా ఈ ఇంజన్‌ను డిజైన్ చేసింది .

ఈ Z సిరీస్ ఇంజన్ స్విఫ్ట్‌లో కూడా ఇన్‌స్టాల్ చేశారు. ఈ ఇంజన్ 26 కిమీ మైలేజీని ఆఫర్ చేస్తుంది. కాబట్టి డిజైర్‌లో ఈ ఇంజన్‌ను ఇన్‌స్టాల్ చేసిన తర్వాత, ఇది సుమారుగా 25కిమీ నుండి 27కిమీ మైలేజీని అందించగలదని భావిస్తున్నారు.కొత్త డిజైర్ CNG వెర్షన్ కూడా భారతదేశంలోనే తయారవుతుంది.  కొత్త డిజైర్ CNG మోడ్‌లో 30-32 కిమీ/కేజీ వరకు మైలేజీని అందించే అవకాశం ఉంది. అయితే టాటా తన కార్లలో ట్విన్ సిఎన్‌జి ట్యాంకులను అందజేస్తుండగా, మారుతి సుజుకి ఇప్పటికీ తన కార్లలో పెద్ద సిఎన్‌జి ట్యాంక్‌ను ఇస్తుంది.

కొత్త డిజైర్‌‌లో ట్విన్ సిఎన్‌జి ట్యాంక్‌ కూడా ఉంటుందని భావిస్తున్నారు. ఈసారి కొత్త డిజైర్‌ భద్రతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. డిజైర్‌లో తొలిసారిగా 6 ఎయిర్‌బ్యాగ్‌లు కనిపించనున్నాయి. ఇది మాత్రమే కాదు, అడ్వాన్స్‌డ్ డ్రైవింగ్ అసిస్టెన్స్ సిస్టమ్స్ ఇందులో సేఫ్టీ ఫీచర్లను పొందవచ్చు. హైబ్రిడ్ టెక్నాలజీని మొదటిసారిగా చేర్చవచ్చు. కొత్త మోడల్‌లో సన్‌రూఫ్ కూడా ఉండొచ్చు.

ప్రస్తుతం డిజైర్ ఎక్స్-షోరూమ్ ధర రూ.6.56 లక్షల నుండి ప్రారంభమవుతుంది. కానీ ఇప్పుడు కొత్త మోడల్‌లో అనేక సేఫ్టీ ఫీచర్లు అదనంగా తీసుకొస్తున్నారు. దీని కారణంగా వాహనం ధర పెరుగుతుంది. కొత్త మోడల్ ధర రూ. 6.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. కొత్త మోడల్‌లో అదనపు, అధునాతన ఫీచర్లు ఉన్నందున  కొత్త మోడల్ ధర కొంచెం ఎక్కువగా ఉండచ్చు. భారతదేశంలో ఈ కారు నేరుగా హోండా అమేజ్, హ్యుందాయ్ ఆరాతో పోటీపడుతుంది.

Exit mobile version