Site icon Prime9

Maruti Suzuki E Vitara: నడుస్తూనే ఉంటుంది.. మారుతి సుజుకి నుంచి మొదటి ఎలక్ట్రిక్ కార్.. రాకకు ముహూర్తం ఫిక్స్..!

Maruti Suzuki E Vitara

Maruti Suzuki E Vitara

Maruti Suzuki E Vitara: ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. ముఖ్యంగా దేశంలో  పెరుగుతున్న పెట్రోల్ ధరల దెబ్బకు ఈవీ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు.ఈ సెగ్మెంట్‌లో టాటా నెక్సాన్ EV, పంచ్ EV, టియాగో EV, టిగోర్ EV, తాజాగా విడుదల చేసిన టాటా కర్వ్ EV కూడా ఈ విభాగంలో బాగా ప్రాచుర్యం పొందాయి. ఈ విభాగంలో పెరుగుతున్న డిమాండ్‌ను చూసి దేశంలోనే అతిపెద్ద కార్లను విక్రయిస్తున్న మారుతి సుజుకి తన మొదటి ఎలక్ట్రిక్ కారును కూడా విడుదల చేయబోతోంది. కంపెనీ రాబోయే ఎలక్ట్రిక్ కారు మారుతి సుజుకి ఇ విటారా ఇటలీలోని మిలాన్ నగరంలో ఆవిష్కరించింది.

జనవరి 2025లో న్యూఢిల్లీలో జరగనున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో మారుతి సుజుకి ఇ విటారా భారత్‌లోకి ప్రవేశిస్తుంది. అయితే కంపెనీ దీనిని మార్చి 2025 ప్రారంభంలో భారత మార్కెట్లో లాంచ్ చేయవచ్చు. మరోవైపు కంపెనీ దీనిని 2025 మధ్యలో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.

ఈ కారు ఫీచర్ల గురించి మాట్లాడినట్లయితే రాబోయే మారుతి సుజుకి E Vitaraలో వినియోగదారులు డ్యూయల్ డిజిటల్ స్క్రీన్, లేటెస్ట్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్,  360 డిగ్రీ కెమెరాలు ఉన్నాయి.

ఈ కారు పవర్‌ట్రెయిన్ విషయానికి వస్తే ఇది ఒకే ఛార్జ్‌తో 500 కిమీ కంటే ఎక్కువ దూరం నడుస్తుంది. రాబోయే మారుతి సుజుకి ఇ వితారాలో వినియోగదారులు 49kWh, 61kWh 2 బ్యాటరీ ప్యాక్‌లను పొందవచ్చు. 61kWh వేరియంట్‌లో వినియోగదారులు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్‌ను పొందవచ్చని అనేక మీడియా నివేదికలు పేర్కొన్నాయి. మరోవైపు 49kWh వేరియంట్  ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 20 లక్షలు. 61kWh ఇ విటారా ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 25 లక్షలుగా ఉండవచ్చు.

e Vitara 2025 మధ్యలో ప్రారంభించిన తర్వాత గట్టి పోటీని ఎదుర్కొంటుంది. హ్యుందాయ్  క్రెటా EV ప్రస్తుత ప్రత్యర్థులైన Tata Curvv EV, MG ZS EV, BYD Atto 3, మహీంద్రా XEV 9e, BE 6e మోడళ్లతో పోటీపడుతుంది. మారుతి సుజుకి ఇ విటారా ధరల విషయానికి వస్తే.. రూ. 20 లక్షల నుంచి రూ. టాప్ AWD వేరియంట్‌ల కోసం 30 లక్షలు వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Exit mobile version