Site icon Prime9

Maruti Suzuki Dzire Sedan: మైలేజ్ రారాజు.. డిజైర్ సెడాన్‌ వచ్చేస్తోంది.. 32 కిమీ మైలేజ్ ఇస్తోంది!

Maruti Suzuki Dzire Sedan

Maruti Suzuki Dzire Sedan

Maruti Suzuki Dzire Sedan: మారుతి సుజికి ఇండియా కార్ల తయారీలో నంబర్ 1 కంపెనీ. దేశీయ మార్కెట్‌లో సరికొత్త ఫెస్‌లిఫ్టెడ్ డిజైర్ సెడాన్ విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఈ కొత్త కారు నవంబర్ 4న గ్రాండ్‌గా లాంచ్ కానుంది. ఈ సెడాన్‌ను బడ్జెట్ ధరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. దీనిలో ఐదుగురు హాయిగా ప్రయాణించచ్చు. దీని గురించి మరింత సమాచారం తెలుసుకుందాం.

ఈ మారుతి సుజుకి డిజైర్ సెడాన్  ఎక్ట్సీరియర్ అద్భుతమైన డిజైన్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. ముందు భాగంలో కొత్త గ్రిల్, బంపర్, మెరుగైన ఎల్ఈడీ హెడ్‌లైట్లు, ఫాగ్ లైట్లు, ఎల్‌ఈడీ డీఆర్ఎల్ ఉంటాయి. ఇది అల్లాయ్ వీల్స్‌, వెనుక రీ డిజైన్ చేయబడిన ఎల్‌ఈడీ టెయిల్‌లైట్ సెటప్‌ ఉండిచ్చని భావిస్తున్నారు.

కొత్త కారు‌లో అద్భుతమైన ఇంటీరియర్ డిజైన్‌ ఉంటుంది. డిజైర్  5 సీట్ల వేరియంట్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది.  ఆర్కిటిక్ వైట్, షేర్‌వుడ్ బ్రౌన్, ఫీనిక్స్ రెడ్, బ్లష్ బ్లాక్, మాగ్మా గ్రే, స్ప్లెండిడ్ సిల్వర్ వంటి అనేక రకాల ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్‌లను కలిగి ఉన్నట్లు తెలిసింది.

ఈ సరికొత్త డిజైర్ సెడాన్ శక్తివంతమైన 1.2 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌తో 82 బీహెచ్‌పి పవర్, 108 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను రిలీజ్ చేస్తుంది. కారు 5-స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడే అవకాశం ఉంది. దీనిలో CNG పవర్‌ట్రెయిన్ కూడా ఉంటుంది. ఇది దాదాపు 32 కెఎంపిఎల్ మైలేజీని ఇవ్వగలదని అంటున్నారు.

ఈ మారుతి సుజుకి డిజైర్ కారు అనేక ఆకర్షణీయమైన ఫీచర్లను కలిగి ఉండవచ్చని భావిస్తున్నారు. టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ (9-అంగుళాల), ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, టైప్ సి ఛార్జింగ్ పోర్ట్, సన్‌రూఫ్, రేర్ ఏసీ వెంట్స్ వంటి వివిధ ఫీచర్లు ఉన్నాయి.

కొత్త డిజైర్ సెడాన్ దాని సేఫెస్ట్ ఫీచర్లకు ప్రసిద్ధి చెందింది. ప్రయాణీకుల రక్షణ కోసం  6 ఎయిర్‌బ్యాగ్‌లు,  యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, వెనుక పార్కింగ్ సెన్సార్లు, 3 పాయింట్,  360 డిగ్రీ కెమెరాలను పొందే అవకాశం ఉంది.

ఈ కారు చాలా తక్కువ ధరకు అందుబాటులోకి రానుంది. దీని ప్రారంభ ధర రూ.6.70 లక్షలు (ఎక్స్-షోరూమ్). డిజైర్ సెడాన్‌కు హోండా అమేజ్, హ్యుందాయ్ ఆరా,  టాటా టిగుర్‌లకు గట్టి పోటినిస్తుందని విశ్లేషిస్తున్నారు. మొత్తంమీద మారుతి సుజుకి డిజైర్ సెడాన్ చిన్న కుటుంబాలకు గొప్ప కారుగా మారుతుంది. ఈ కారు లాంచ్ అయ్యాక దేశీయ కస్టమర్ల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.

Exit mobile version