Site icon Prime9

Maruti Suzuki Ignis: మారుతి సుజుకి ఇగ్నిస్.. కారుపై రూ.56 వేల డిస్కౌంట్.. లీటర్‌కు 20.89 కిమీ మైలేజ్!

Maruti Suzuki Ignis

Maruti Suzuki Ignis

Maruti Suzuki Ignis: మారుతి సుజుకి ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీగా గుర్తింపు దక్కించుకుంది. కంపెనీకి చెందిన ఇగ్నిస్ ఒక ప్రసిద్ధ హ్యాచ్‌బ్యాక్ వెహికల్. దీనికి డిమాండ్ భారీ సంఖ్యలో ఉంది. దేశీయ మార్కెట్‌లో నెక్సా డీలర్‌షిప్‌ల ద్వారా అమ్ముడవుతోంది. అయితే దీపావళి సందర్భంగా ఈ నెలలో ఈ కారుపై భారీ ఆఫర్ ప్రకటించింది. రండి దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం.

మారుతి సుజుకి ఇగ్నిస్ హ్యాచ్‌బ్యాక్ సిగ్మా ఎమ్‌టి (మాన్యువల్ ట్రాన్స్‌మిషన్) వేరియంట్‌పై రూ.56,100 వరకు తగ్గింపు లభిస్తుంది. ఇందులో రూ.35,000 యూజర్ డిస్కౌంట్, రూ.15,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌తో సహా అనేక ఆర్థిక ప్రయోజనాలను అందిస్తోంది.

సిగ్మా మినహా ఈ ఇగ్నిస్ అన్ని MT (మాన్యువల్ ట్రాన్స్‌మిషన్) వేరియంట్‌లు రూ.46,100 వరకు తగ్గింపు పొందాయి. ఇది రూ.25,000 కస్టమర్ ఆఫర్ లేదా నగదు తగ్గింపు, రూ.15,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌తో సహా అనేక ఆర్థిక ప్రయోజనాలను కూడా కలిగి ఉంది.

అదే మారుతి ఇగ్నిస్ హ్యాచ్‌బ్యాక్ అన్ని AMT (ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్) వేరియంట్లు మొత్తం రూ.51,100 తగ్గింపును కలిగి ఉన్నాయి. ఇది రూ.30,000 కస్టమర్ బోనస్, రూ.15,000 ఎక్స్చేంజ్ బోనస్‌తో సహా వివి ఆర్థిక ప్రయోజనాలను కగి ఉంది. గత నెల 2,514 యూనిట్ల ఇగ్నిస్ కార్లు అమ్ముడయ్యాయి. ఆగస్టులో విక్రయించిన 2,464 యూనిట్లతో పోలిస్తే నెలవారీ వృద్ధి 1.99 శాతం.

ప్రస్తుతం దేశీయ వినియోగదారుల కోసం అందుబాటులో ఉన్న మారుతి సుజుకి ఇగ్నిస్ హ్యాచ్‌బ్యాక్ ధర రూ. 5.49 నుండి రూ. 8.06 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది నెక్సా బ్లూ, లూసెంట్ ఆరెంజ్, సిల్కీ సిల్వర్, గ్లిస్టెనింగ్ గ్రే వంటి డజన్ల కొద్దీ ఆకర్షణీయమైన కలర్ ఎంపికలలో కూడా అందుబాటులో ఉంది.

ఇగ్నిస్ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఇది 20.89 kmpl వరకు మైలేజీని ఇస్తుంది. ఇందులో 5 మంది వ్యక్తులు సులభంగా కూర్చోవచ్చు. ట్రిప్ సమయంలో ఎక్కువ లగేజీని తీసుకువెళ్లడానికి 260 లీటర్ల సామర్థ్యం గల బూట్ స్పేస్‌ కూడా ఉంది.

కొత్త మారుతి సుజుకి ఇగ్నిస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, (7-అంగుళాల), ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్‌తో సహా పలు ఫీచర్లతో వస్తుంది. ఇందులో భద్రత కోసం ముందు డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ABS (యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్), EBD (ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్) ఉన్నాయి.

Exit mobile version