Site icon Prime9

Maruti Suzuki Fronx: రికార్డుల రారాజు.. అదరగొట్టిన మారుతి సుజుకి ఫ్రాంక్స్ సేల్స్.. కొనేందుకు క్యూ కడుతున్నారు..!

Maruti Suzuki Fronx

Maruti Suzuki Fronx

Maruti Suzuki Fronx: మారుతి సుజుకి ఫ్రాంక్స్ అనేది భారతీయ మార్కెట్లో ఒక ప్రసిద్ధ సబ్ కాంపాక్ట్ క్రాస్ఓవర్ ఎస్‌యూవీ. సరసమైన ధరతో పాటు హైటెక్ ఫీచర్లు, ప్రీమియం లుక్స్‌తో దేశీయ విపణిలో ఇది సూపర్ హిట్ కార్ మోడల్. అందువల్ల ఇది భారతీయ మార్కెట్‌లో బాగా అమ్ముడవుతోంది. ఇటీవల మారుతీ సుజుకి అక్టోబర్ 2024కి సంబంధించిన ఫ్రాంటెక్స్ సేల్స్ రిపోర్ట్ విడుదల చేసింది.

అక్టోబర్ 2024 నెలలో మారుతి సుజుకి ఫ్రాంక్స్ అమ్మకాల గణాంకాలు వెల్లడయ్యాయి. గత నెలలో విక్రయాల్లో అద్భుతమైన వృద్ధిని సాధించగలిగింది. అక్టోబర్ 2024లో మారుతి సుజుకి ఫ్రంట్  16,419 యూనిట్లు అమ్ముడయ్యాయి. అక్టోబర్ 2023లో 11,357 యూనిట్లు అమ్ముడయ్యాయి.

మారుతి సుజుకి ఫ్రాంక్స్ పవర్‌ట్రెయిన్ విషయానికి వస్తే ఇందులో రెండు ఇంజన్ ఎంపికలు ఉన్నాయి. వాటిలో మొదటిది అత్యంత శక్తివంతమైన టర్బోచార్జ్డ్ 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్. ఇది 5,500rpm వద్ద 98.7 bhp పవర్,  2,000 నుండి 4,500rpm వద్ద 147.6 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్‌తో అందించారు.

మరో 1.2 లీటర్ నాచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ కూడా ఉంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్ లేదా 5-స్పీడ్ AMT గేర్‌బాక్స్‌తో జతై ఉంటుంది. ఈ నాచురల్ ఇంజన్ 6,000rpm వద్ద 88.5 bhp, 4,400rpm వద్ద 113 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఎస్‌యూవీ ఉత్తమైన భాగం దాని మైలేజీ. దీని మైలేజీ గురించి మాట్లాడినట్లయితే దాని మాన్యువల్ వేరియంట్ లీటర్‌కు 21.50 కిమీ, ఆటోమేటిక్ వేరియంట్ లీటర్‌కు 20.10 కిమీ మైలేజీని ఇస్తుంది.

ఇది మాత్రమే కాదు మారుతి సుజుకి ఫ్రాంక్స్ సీఎన్‌జీ ఎంపికలో కూడా అమ్మకానికి అందుబాటులో ఉంది. ఇది 1.2-లీటర్ న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఇందులో 5 స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ మాత్రమే ఉంది. CNGతో నడిచే ఈ ఇంజన్ కిలోగ్రాముకు 28.51 కిలోమీటర్ల వరకు మైలేజీని ఇస్తుంది.

మారుతి సుజుకి ఫ్రాంక్స్ తొమ్మిది రంగులలో అందుబాటులో ఉంది, ఇందులో ఆర్కిటిక్ వైట్, గ్రాండ్యుర్ గ్రే, ఎర్టెన్ బ్రౌన్, స్ప్లెండిడ్ సిల్వర్, ఓపులెంట్ రెడ్ ఇతర డ్యూయల్ టోన్ ఆప్షన్‌లు ఉన్నాయి. ఈ ఎస్‌యూవీ 6 వేరియంట్లలో లభిస్తుంది. దీని ధర గురించి మాట్లాడినట్లయితే బేస్ మోడల్ ఎక్స్-షోరూమ్ ధర రూ.7.51 లక్షలు. దాని టాప్ వేరియంట్ఎక్స్-షోరూమ్ ధర రూ. 12.87 లక్షలు. తక్కువ ధరకు అధిక మైలేజీని ఇచ్చే కార్లలో ఇది ఒకటి కాబట్టి చాలా మంది ఈ 5-సీటర్ కారును కొనుగోలు చేస్తారు.

Exit mobile version