Next Gen Maruti Dzire: అంచనాలు పెంచేస్తున్న కొత్త డిజైర్.. లీటర్‌కు 32 కిమీ మైలేజ్.. సేల్ ఎప్పుడంటే?

Next Gen Maruti Dzire: దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఫేస్‌లిఫ్ట్ డిజైర్ వచ్చే నెల 11వ తేదీన విడుదల కానుంది. ప్రస్తుతం డీలర్‌షిప్‌లు ఈ కారు చేరుకుంటుంది. అలానే కొత్త కార్ల కోసం అనధికారిక బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. అదనంగాఈ డిజైర్ సెడాన్ దాదాపు ‘స్విఫ్ట్’ హ్యాచ్‌బ్యాక్‌కి సమానమైన డిజైన్, ఫీచర్లను కలిగి ఉండే అవకాశం ఉంది. దీనిలో 5 అద్భుతమైన ఫీచర్లు ఉంటాయి. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

కొత్త 2024 మారుతి సుజుకి డిజైర్ సెడాన్ అధునాతన ఎక్స్‌టీరియర్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఇందులో పెద్ద గ్రిల్, ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, ఎల్‌ఈడీ ఫాగ్ లైట్లు,  డిఫరెంట్ టెయిల్‌గేట్ ఉన్నాయి. దీనిలో ఎక్కువ బూట్ స్పెయిన్‌ ఉంటుంది. కొత్త కలర్ ఆప్షన్లు కూడా అందుబాటులోకి రానున్నాయి.

కొత్త డిజైర్ కారు యాపిల్ కార్‌ప్లే, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్, సింగిల్-పేన్ సన్‌రూఫ్, 6 ఎయిర్‌బ్యాగ్‌లు,  360 డిగ్రీ కెమెరా, పెద్ద 9 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఆండ్రాయిడ్ ఆటో వంటి ఫీచర్లు ఉంటాయి.  ఈ సెడాన్ ‘స్విఫ్ట్’ హ్యాచ్‌బ్యాక్ మాదిరిగానే పెట్రోల్, సీఎన్‌జీ పవర్‌ట్రెయిన్‌‌లో వస్తుంది. ప్రస్తుతంఅందుబాటులో ఉన్న స్విఫ్ట్ 1.2లీటర్ 3 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఇది 82 పీఎస్ హార్స్ పవర్, 112 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

స్విఫ్ట్ సీఎన్‌జీ పవర్డ్ వేరియంట్‌లో అదే ఇంజన్ ఉంటుంది. అయితే ఇది 69 పీఎస్ హార్స్ పవర్, 102 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది.  వేరియంట్‌లను బట్టి 5 స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఉంటుంది. ఇది 24.80 నుండి 32.85 కిమీ మైలేజీని ఇస్తుంది.

కొత్త మారుతి సుజుకి డిజైర్ సెడాన్ అతి తక్కువ ధరకే మార్కెట్‌లోకి రానుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.6.70 లక్షలుగా ఉంది. హోండా అమేజ్, హ్యుందాయ్ ఆరా, టాటా టిగుర్ ఈ కారుకు బలమైన ప్రత్యర్థులుగా నిలుస్తాయి.

మొత్తానికి మరికొద్ది రోజుల్లో సేల్‌కి రానున్న ‘డిజైర్’ కారుపై కస్టమర్ల అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఈ కారు ఆకర్షణీయమైన డిజైన్, ఫీచర్లను కలిగి ఉండటం దాదాపు ఖాయం. ఇది అమ్మకానికి వచ్చిన తర్వాత డిమాండ్ ఎలా పెరుగుతుందో చూడాలి.