Site icon Prime9

Maruti Suzuki Eeco: మారుతి సుజుకి ఈకో.. అసలు ఎందుకు కొంటున్నారో తెలుసా..?

Maruti Suzuki Eeco

Maruti Suzuki Eeco

Maruti Suzuki Eeco: భారతదేశంలో చాలా మంది కార్ల కొనుగోలు కలను సాకారం చేస్తూ.. మారుతి సుజుకి దాని సరసమైన కార్లను అందించడం ద్వారా నంబర్ 1 కార్ల కంపెనీగా కొనసాగుతోంది. కంపెనీ అందించే అత్యుత్తమ ఫ్యామిలీ కార్లలో మారుతి సుజుకి ఈకో 2010లో ప్రారంభించింది. దాని విశాలమైన 7-సీట్ డిజైన్, సరసమైన ధర, అద్భుతమైన మైలేజీకి ప్రసిద్ధి చెందింది. పెట్రోల్, CNG ఎంపికలలో అందుబాటులో ఉన్న ఈ కారు కుటుంబ, వాణిజ్య కార్యకలాపాలకు అనుకూలంగా ఉంటుంది.

మారుతి సుజుకి ఈకో అనేది దాని విశాలమైన ఇంటీరియర్, సౌకర్యవంతమైన 7-ప్యాసింజర్ ప్రయాణానికి అనుగుణంగా డిజైన్ చేసిన కారు. అలాగే, దాని CNG వెర్షన్ 27 kmpl మైలేజీని అందించడం ద్వారా భారతీయ కొనుగోలుదారుల హృదయాలను గెలుచుకుంది. కుటుంబ కారుగా, స్కూల్ వ్యాన్‌గా ప్రజాదరణ పొందడమే కాకుండా స్థోమత కారణంగా మధ్యతరగతి వారికి కూడా ఇది ఇష్టమైనది.

మారుతి ఎకో ఎక్స్-షోరూమ్ బేస్ వేరియంట్ ధర రూ. 5.32 లక్షలు మొదలుకొని రూ. 6.58 లక్షలు. ఇది 5 – సీటర్ స్టాండర్డ్ (O), 5 – సీటర్ AC (O), 5 – సీటర్ AC CNG (O), 7 – సీటర్ స్టాండర్డ్ (O) అనే నాలుగు వేరియంట్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.ఇది మెటాలిక్ గ్లిస్టెనింగ్ గ్రే, బ్లూయిష్ బ్లాక్, మెటాలిక్ బ్రిస్క్ బ్లూ, మెటాలిక్ సిల్కీ సిల్వర్, సాలిడ్ వైట్ వంటి మోనోటోన్ కలర్ ఆప్షన్‌లలో వస్తుంది.

మారుతి సుజుకి Eeco ప్రస్తుతం దాని సెగ్మెంట్‌లో ప్రత్యక్ష పోటీదారులు లేరు కాబట్టి, సరసమైన ధర, ఇంధన సామర్థ్యం, అనేక అవసరాల కోసం చూస్తున్న వారికి మారుతి సుజుకి ఈకో అనువైనది.ఫీచర్ల విషయానికి వస్తే.. సెమీ-డిజిటల్ స్పీడోమీటర్, రిక్లైనింగ్ ఫ్రంట్ సీట్లు, మాన్యువల్ AC,  12V ఛార్జింగ్ సాకెట్ మెయిన్ ఫీచర్లు. భద్రతా విషయానికి వస్తే, ఇందులో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఫ్రంట్ సీట్ బెల్ట్ రిమైండర్, స్పీడ్ అలర్ట్, రియర్ పార్కింగ్ సెన్సార్లు ఉన్నాయి.

ఇందులో 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ 81బిహెచ్‌పి పవర్, 104.4ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. మారుతి ఎకో సిఎన్‌జి వెర్షన్ ఇంజన్ 72 బిహెచ్‌పి పవర్, 95 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. మారుతి ఎకో కారు మైలేజీ విషయానికి వస్తే ఇది పెట్రోల్ ఇంజన్‌లో 20-కిమీ, సిఎన్‌జిలో 27-కిమీ మైలేజీని ఇస్తుంది. మారుతి సుజుకి ఎకో  ప్రాక్టికాలిటీ వ్యక్తిగత, వాణిజ్య వినియోగానికి సరిపోతుంది. ఇది నమ్మదగిన, ఆర్థికపరమైన ఎంపిక. వీకెండ్, హాలిడే ట్రిప్‌లకు వెళ్లేటప్పుడు ఎక్కువ లగేజీని తీసుకెళ్లేందుకు 275 నుంచి 540 లీటర్ల సామర్థ్యం గల బూట్ స్పేస్ కూడా లభిస్తుంది.

Exit mobile version