Site icon Prime9

Top Selling SUVs: మనల్నెవడ్రా ఆపేది.. సేల్స్‌లో దూసుకుపోతున్న మారుతి బ్రెజ్జా.. ఆ తర్వాత రేస్‌లో!

Top Selling SUVs

Top Selling SUVs

Top Selling SUVs: దేశంలోని కార్ల మార్కెట్‌లో గత కొన్ని సంవత్సరాలుగా ఎస్‌యూవీ సెగ్మెంట్ వాహనాలకు డిమాండ్ వేగంగా పెరుగుతుంది. 2024 మొదటి త్రైమాసికంలో మొత్తం కార్ల అమ్మకాల్లో ఎస్‌యూవీ విభాగం మాత్రమే 52 శాతం వాటాను కలిగి ఉంది. దీనిని బట్టే ఈ వాహనాలను వినియోగదారులు ఏ రేంజ్‌లో కొనుగోలు చేస్తున్నారో అంచనా వేయవచ్చు. ఈ నేపథ్యంలో గత నెల సెప్టెంబర్ కార్ల సేల్స్ గురించి మాట్లాడితే హ్యుందాయ్ క్రెటా అగ్రస్థానంలో నిలిచింది.

కాంపాక్ట్ ఎస్‌యూవీ విషయానికి వస్తే మారుతి సుజికి బ్రెజ్జా ముందంజలో ఉంది. బ్రెజ్జా గత నెలలో 2 శాతం వార్షిక పెరుగుదలతో మొత్తం 15,322 యూనిట్ల ఎస్‌యూవీలను సేల్ చేసింది. అయితే సరిగ్గా 1 సంవత్సరం క్రితం అంటే సెప్టెంబర్, 2023లో మారుతి బ్రెజ్జా మొత్తం 15,001 మంది ఇళ్లకు చేరింది. ఇప్పుడు గత నెలలో అత్యధికంగా అమ్ముడైన 8 కాంపాక్ట్ ఎస్‌యూవీలపై ఓ లుక్కేద్దాం.

Tata Nexon
ఈ సేల్స్ జాబితాలో మారుతి సుజుకి ఫ్రంట్ రెండో స్థానంలో ఉంది. మారుతి సుజుకి సుజుకి 21 శాతం వార్షిక పెరుగుదలతో మొత్తం 13,874 యూనిట్ల SUVలను విక్రయించింది. సరిగ్గా ఒక సంవత్సరం క్రితం అంటే సెప్టెంబర్ 2023లో ఫ్రంట్ మొత్తం 11,455 మంది కొన్నారు. కాగా, జాబితాలో టాటా పంచ్ మూడో స్థానంలో ఉంది. టాటా పంచ్ గత నెలలో 5 శాతం వార్షిక పెరుగుదలతో మొత్తం 13,711 యూనిట్ల ఎస్‌యూవీలను విక్రయించింది. అదే సమయంలో ఈ జాబితాలో టాటా నెక్సాన్ నాల్గవ స్థానంలో ఉంది. టాటా నెక్సాన్ గత నెలలో 25 శాతం వార్షిక క్షీణతతో మొత్తం 11,470 యూనిట్ల ఎస్‌యూవీలను సేల్ చేసింది.

Kia Sonet
మరోవైపు సేల్స్ జాబితాలో కియా సోనెట్ ఐదవ స్థానంలో ఉంది. కంపెనీ గత నెలలో 107 శాతం వార్షిక పెరుగుదలతో మొత్తం 10,335 యూనిట్ల ఎస్‌యూవీలను విక్రయించింది. హ్యుందాయ్ వెన్యూ ఆరో స్థానంలో ఉంది. హ్యుందాయ్ వెన్యూ గత నెలలో 16 శాతం వార్షిక క్షీణతతో మొత్తం 10,259 యూనిట్ల ఎస్‌యూవీలను విక్రయించింది. ఇది కాకుండా ఈ జాబితాలో మహీంద్రా XUV 3X0 ఏడవ స్థానంలో ఉంది. మహీంద్రా XUV 3X0 గత నెలలో 81 శాతం వార్షిక పెరుగుదలతో మొత్తం 9,000 యూనిట్ల ఎస్‌యూవీలను విక్రయించింది. ఈ జాబితాలో హ్యుందాయ్ ఎక్సెటర్ ఎనిమిదో స్థానంలో నిలిచింది. హ్యుందాయ్ ఎక్సెటర్ గత నెలలో 20 శాతం వార్షిక పెరుగుదలతో మొత్తం 6,908 యూనిట్ల ఎస్‌యూవీలను సేల్ చేసింది.

Exit mobile version
Skip to toolbar