Site icon Prime9

Maruti Baleno Regal Edition: బాలెనో కొత్త ఎడిషన్ లాంచ్.. ఫీచర్లు భలేగా ఉన్నాయ్ బాసూ!

Maruti Baleno Regal Edition

Maruti Baleno Regal Edition

Maruti Baleno Regal Edition: మారుతి బాలెనో దేశంలోని ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో అగ్రస్థానంలో ఉంది. పండుగ సీజన్‌లో సేల్స్ పెంచడానికి కంపెనీ తన కొత్త రీగల్ ఎడిషన్‌ను విడుదల చేసింది. దీన్ని లిమిటెడ్ ఎడిషన్ మాత్రమే విడుదల చేసింది. అడిషనల్ కంఫర్ట్, స్టైలింగ్ ఫీచర్లు దాని అన్ని వేరియంట్లలో అందుబాటులో ఉంటాయి. ఇది ఆటోమేటిక్, సిఎన్‌జి ఆప్షన్లలో ఉంటుంది. మీరు దాని కొత్త రీగల్ ఎడిషన్ ఇంటికి తీసుకెళ్లాలంటే దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

బాలెనో రీగల్ ఎడిషన్ ఎక్ట్సీరియర్ గురించి చెప్పాలంటే ఇందులో కొత్త గ్రిల్ అప్పర్ గార్నిష్, ఫ్రంట్, రియర్ అండర్ బాడీ స్పాయిలర్, ఫాగ్ ల్యాంప్ గార్నిష్, బాడీ సైడ్ మోల్డింగ్ ఉన్నాయి. లోపలి భాగంలో క్యాబిన్ అప్‌డేట్ చేయబడిన సీట్ కవర్‌లు, కొత్త ఇంటీరియర్ స్టైలింగ్ కిట్, విండో కర్టెన్‌లు, ఆల్ వెదర్ 3D మ్యాట్‌లు వంటి టచ్‌లను కలిగి ఉంటుంది.

ఫీచర్ల గురించి మాట్లాడితే రీగల్ ఎడిషన్ 360 డిగ్రీ కెమెరా, కలర్ హెడ్ అప్ డిస్‌ప్లే, ఎ‌డీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, ఆటో డిమ్మింగ్ రియర్‌వ్యూ మిర్రర్, 22.86 సెం.మీ డిస్‌ప్లేతో కూడిన స్మార్ట్‌ప్లే ప్రో+ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ ఉంటుంది. అదనంగా వెహికల్ NEXA సేఫ్టీ షీల్డ్‌తో అమర్చబడి ఉంది. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ESP, హిల్ హోల్డ్ అసిస్ట్, EBDతో కూడిన ABS, 40కి పైగా స్మార్ట్ ఫీచర్‌లతో సుజుకి కనెక్ట్ టెలిమాటిక్స్ ఉన్నాయి.

కారు ఇంజన్ గురించి చెప్పాలంటే ఇది 1197cc, 4 సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలిగి ఉంది. ఇది 6000 RPM వద్ద 88.5 BHP పవర్, 4400 RPM వద్ద 113 Nm టార్క్‌ను రిలీజ్ చేస్తుంది. ఈ ఇంజన్ 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లేదా 5 స్పీడ్ AMTతో ఉంటుంది. సాధారణ ఆల్ఫా వేరియంట్‌తో పోలిస్తే బాలెనో రీగల్ ఎడిషన్ కోసం వినియోగదారులు రూ. 45,892 నుండి రూ. 60,199 (సిగ్మా వేరియంట్) ఎక్కువగా ఖర్చు చేయాల్సి ఉంటుంది.

మారుతీ సుజుకి ఇండియా లిమిటెడ్‌లో మార్కెటింగ్, సేల్స్‌ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ, బాలెనో రీగల్ రిసెప్షన్ గురించి మాట్లాడుతూ.. బాలెనో ఎల్లప్పుడూ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో అగ్రగామిగా ఉంటుంది. కస్టమర్ అంచనాలను నిలకడగా అధిగమిస్తుంది. కొత్త బాలెనో రీగల్ ఎడిషన్‌తో ఈ పండుగ సీజన్‌లో మా కస్టమర్‌లకు ఉత్సాహం, ఆనందాన్ని ఇవ్వాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము. 2015లో అరంగేట్రం చేసినప్పటి నుంచి బాలెనో భారతదేశంలోని 1.5 మిలియన్లకు పైగా కుటుంబాల వద్దకు చేరింది.

Exit mobile version