Site icon Prime9

Best Selling 7 Seater Car: ఈ 7 సీటర్ కారంటే ప్రజలకు పిచ్చి.. మోజుపడి కొంటున్నారు.. ఎందుకో తెలుసా?

Best Selling 7 Seater Car

Best Selling 7 Seater Car

Best Selling 7 Seater Car: ఇప్పుడు 7 సీటర్ కార్ల యుగం కనిపిస్తోంది. ప్రజలు కుటుంబం ప్రయాణాలకు సౌకర్యవంతంగా ఉంటే కార్ల కోసం చూస్తున్నారు. ఈ మాటలను సేల్స్ రిపోర్టులో చెబుతున్నాయి. ప్రస్తుతం మారుతీ సుజికీ ఎర్టిగా, కియా కారెన్స్, టయోటా ఇన్నోవా క్రిస్టా, రెనాల్ట్ ట్రైబర్ వంటి ఏడు సీట్ల కార్లు మార్కెట్‌లో అమ్ముడువుతున్నాయి. అయితే మారుతీ సుజికీ ఎర్టిగాను వీటన్నికంటే  కంటే కాస్త ఎక్కువగానే కొనుగోలు చేస్తున్నారు. నివేదికల ప్రకారం గత నెలలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 కార్ల గురించి తెలుసుకుందాం.

మారుతీ ఎర్టిగా గత నెలలో 18,785 యూనిట్లను విక్రయించింది. దాని మార్కెట్ వాటాను 11.51 శాతం తీసుకొచ్చింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఈ వాహనం 17,441 యూనిట్లను విక్రయించింది. ఇది మాత్రమే కాదు, ఈ సంవత్సరం ఆగస్టులో కంపెనీలో 18,580 యూనిట్ల ఎర్టిగా అమ్మకాలు జరిపింది. ఎర్టిగా ఇన్నోవా, బొలెరో, కియా కారెన్స్, రెనాల్ట్ ట్రైబర్, హ్యుందాయ్ క్రెటా,  మహీంద్రా స్కార్పియోలను కూడా వెనుకకు నెట్టింది.

మారుతి స్విఫ్ట్ 17,539 యూనిట్ల అమ్మకాలతో రెండవ స్థానంలో నిలవగా, హ్యుందాయ్ క్రెటా 17,497 యూనిట్ల అమ్మకాలతో మూడవ బెస్ట్ సెల్లింగ్ కారుగా అవతరించింది. కానీ కియా కేరెన్స్, రెనాల్ట్ ట్రైబర్ టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ కార్ల లిస్ట్‌లో లేవు, అవి అమ్మకాల పరంగా బలహీనంగా ఉన్నాయి. గత 6 నెలల (మే-అక్టోబర్ 2024) విక్రయాలను పరిశీలిస్తే.. 96,045 యూనిట్ల ఎర్టిగా అమ్ముడైంది. ఈ కారును కొనుగోలు చేసే వారి సంఖ్య నిరంతరం పెరుగుతోంది.

ఇంజన్ గురించి మాట్లాడితే ఎర్టిగాలో 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది 102 బీహెచ్‌పీ హార్స్ పవర్, 137ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5 స్పీడ్ మ్యాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో  ఉంటుంది. ఇందులో సీఎన్‌జీ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. పెట్రోల్ మోడ్‌లో ఇది 20.51 కిమీ మైలేజీని ఇస్తుంది. సీఎన్‌జీలో ఇది 26 కిమీ మైలేజీని ఇస్తుంది. ఎర్టిగా ధర రూ.8.69 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

మారుతి ఎర్టిగా అమ్మకాల పరంగా  అగ్రస్థానంలో ఉంది, కానీ భద్రత పరంగా  చాలా బలహీనంగా ఉంది. గ్లోబల్ NCAP టెస్ట్‌లో ఎర్టిగా కేవలం వన్-స్టార్ రేటింగ్ మాత్రమే పొందింది. ఈ టెస్ట్‌లో ఎర్టిగా పెద్దల భద్రతకు 1 స్టార్, పిల్లల భద్రత కోసం 2 స్టార్ రేటింగ్‌ను పొందింది. భద్రత కోస  ఈ కారులో రెండు ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, సీట్ బెల్ట్ రిమైండర్, సీట్ బెల్ట్ ప్రీ-టెన్షనర్, లోడ్ లిమిటర్, వెనుక పార్కింగ్ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి.

Exit mobile version