2025 Electric Cars: కొత్త సంవత్సరం 2025 రాబోతుంది. కొత్త సంవత్సరం మొదటి నెలలో ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో జనవరి 17 నుండి 22 వరకు న్యూఢిల్లీలో నిర్వహించనున్నారు. ఈ దృష్ట్యా, అనేక ప్రముఖ కార్ల తయారీదారులు ఈ ఈవెంట్‌లో తమ అనేక కొత్త మోడళ్లను ఆవిష్కరించబోతున్నారు. అనేక ఎలక్ట్రిక్ మోడళ్లు కూడా వీటిలో ప్రవేశించడం ఖాయం. జనవరి 2025లో ప్రవేశానికి సిద్ధమవుతున్న అటువంటి 5 మోస్ట్ అవైటెడ్ EVల గురించి వివరంగా తెలుసుకుందాం.
Hyundai Creta EV
హ్యుందాయ్ తన బెస్ట్ సెల్లింగ్ కార్ క్రెటా ఎలక్ట్రిక్ వేరియంట్‌ను జనవరి 17, 2025న విడుదల చేయబోతోంది. క్రెటా EV క్వాడ్ డాట్స్ లోగోతో కూడిన కొత్త స్టీరింగ్, స్టీరింగ్-మౌంటెడ్ గేర్ సెలెక్టర్‌తో సహా లోపల, వెలుపల కొన్ని విలక్షణమైన డిజైన్ అంశాలను కలిగి ఉంటుంది. క్రెటా EV ఒక్కసారి ఛార్జ్ చేస్తే 400 కిమీ కంటే ఎక్కువ రేంజ్‌ను అందించగలదని అనేక మీడియా నివేదికలలో క్లెయిమ్ చేస్తున్నారు.
TATA Harrier EV, Safari EV
టాటా మోటార్స్ తన పాపులర్ ఎస్‌యూవీలు హ్యారియర్, సఫారీలలో ఎలక్ట్రిక్ వేరియంట్‌లను మార్కెట్లోకి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ ఎస్‌యూవీల టెస్టింగ్ చాలా కాలంగా జరుగుతోంది. ఇవి జనవరి 2025లో లాంచ్ అవుతాయి. ఇంటర్నెట్‌లోని సమాచారం ప్రకారం డ్యూయల్ మోటార్ AWD లేఅవుట్ ఎంపిక హారియర్,సఫారి EVలలో ఉంటుందని భావిస్తున్నారు.
MG Cyberster
MG మోటార్ జనవరి 2025లో మోస్ట్ అవైటెడ్ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్‌కార్ సైబర్‌స్టార్‌ను విడుదల చేయవచ్చు. కంపెనీ ప్రీమియం ఉత్పత్తుల కోసం ఏర్పాటు చేసిన ‘MG సెలెక్ట్’ డీలర్‌షిప్ ద్వారా ఇది విక్రయిస్తుంది. ఈ EVకి పవర్‌ట్రెయిన్‌గా 2 ఎలక్ట్రిక్ మోటార్లు అందిస్తారు.
Maruti Suzuki E Vitara
మారుతి సుజుకీ తొలిసారిగా EV రంగంలోకి ప్రవేశిస్తోంది. కంపెనీ రాబోయే EV మారుతి సుజుకి E-Vitara. వచ్చే నెల 2025 భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో ఆవిష్కరించనున్నారు. ఇప్పటికే దీని అనేక స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు వెల్లడయ్యాయి. E Vitara వినియోగదారులకు ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 500 కి.మీ కంటే ఎక్కువ దూరాన్ని అందించగలదని అనేక మీడియా నివేదికలు పేర్కొన్నాయి.