Mahindra XUV400: మార్కెట్లోకి మహీంద్రా ఎలక్ట్రిక్ ఎస్ యూవీ.. తొలి 5వేల మందికే ఆ ధర

Mahindra XUV400: దిగ్గజ కార్ల కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రాకు చెందిన సరికొత్త ఎలక్ట్రిక్ కారు SUV XUV400 భారత మార్కెట్ లో ప్రవేశించింది. మహీంద్రా నుంచి వచ్చిన తొలి ఎలక్ట్రిక్ ఎస్ యూవీ ఇది. రెండు వేరియంట్లతో విడుదలైన ఈ కారు బుకింగ్స్ జనవరి 26 నుంచి ప్రారంభం కానున్నాయి.

XUV400 ధర

మహీంద్రా ఎక్స్ యూవీ 400 (Mahindra XUV400) రెండు వేరియంట్లలో లభించనుంది. ఇందులో ఎక్స్ యూవీ 400 ఈసీ మోడల్( 3.3 కిలోవాట్ ఛార్జర్) ధర రూ. 15.99 లక్షలు

కాగా, ఇందులోనే (7.2 కిలోవాట్ ఛార్జర్) 16.49 రూ. లక్షలుగా కంపెనీ ప్రకటించింది. ఈ మోడల్ లో 34.5 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 375 కిలో మీటర్లు ప్రయాణించవచ్చు.

మరో వేరియంట్ ఎక్స్ యూవీ 400 ఈఎల్ మోడల్ (7.2 కిలోవాట్ ఛార్జర్) ధర రూ. 18.99 లక్షలు. ఈ మోడల్ లో 39.4 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 456 కిలో మీటర్లు ప్రయాణించవచ్చు.

ముందు బుక్ చేసుకున్న 5 వేల మంది కస్టమర్లకు మాత్రమే ఈ ధర వర్తిస్తుందని కంపెనీ ప్రకటించింది. తొలి ఏడాదిలో 20 వేల ఎక్స్ యూవీ 400 లను విక్రయించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

ఫీచర్లు ఇలా..

ఈ కారులో ప్రయాణికుల భద్రతను ద్రుష్టిలో పెట్టుకుని 6 ఎయిర్ బ్యాగులను ఇస్తున్నారు. 7 అంగుళాల ఇన్ఫోటైన్ మెంట్ టచ్ స్క్రీన్ , స్మార్ట్ వాచ్ కనెక్టివిటీ, సన్ రూఫ్ , రియర్ పార్కింగ్ కెమెరా, కీ లెస్ ఎంట్రీ, పుష్ బటన్ స్టార్ట్ లాంటి ఫీచర్లు ఉన్నాయి.

ఈ రెండు వేరియంట్లలో ఎలక్ట్రిక్ మోటార్ 100 కిలోవాట్ శక్తిని, 310 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.

150 కిలో మీటర్ల వేగంతో కేవలం 8.3 సెకన్లలో 0-100 కిలో మీటర్ల వేగాన్ని అందుకుంటుందని కంపెనీ తెలిపింది.

ఎక్స్ యూవీ 400 ఈఎల్ డెలివరీలు మార్చిలో ప్రారంభం కానున్నాయి. ఎక్స్ యూవీ 400 ఈసీ మాత్రం దీపావళికి డెలివరీ కానున్నాయి.

మొదటి దశలో దేశంలోని 34 నగరాల్లో ఈ కార్లు అందుబాటులో ఉంటాయి.

ఆర్కిటిక్ బ్లూ, ఎవరెస్ట్ వైట్, ఇన్ఫినిటీ బ్లూ, నాపోలి బ్లాక్, గెలాక్సీ గ్రే వంటి 5 రంగుల్లో లభ్యమవుతుంది. అయితే ఈఎల్ వేరియంట్ లో పైన డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్ ఉంది.

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/