Site icon Prime9

Mahindra Thar Sales: మహీంద్రా థార్ ‘రాక్స్’‌తో మార్కెట్ షేక్.. సేల్స్‌లో సెన్సేషన్.. ఏం కొంటున్నారా సామీ..!

Mahindra Thar Sales

Mahindra Thar Sales

Mahindra Thar Sales: డాషింగ్ ఆఫ్ రోడింగ్ ఎస్‌యూవీ మహీంద్రా థార్ లాంచ్ అయినప్పటి నుంచి భారతీయ కస్టమర్లలో చాలా ప్రజాదరణ పొందింది. దేశీయ విపణిలో మహీంద్రా థార్ 2 లక్షల యూనిట్ల అమ్మకాల సంఖ్యను అధిగమించిందనే వాస్తవం నుంచి దీనిని అంచనా వేయొచ్చు. ఇంటర్నెట్‌లోని సమాచారం ప్రకారం ఈ సేల్‌లో  తాజాగా విడుదల చేసిన 5 డోర్ల థార్ కార్స్ కూడా ఉంది. అక్టోబర్ చివరి నాటికి మహీంద్రా థార్, థార్ రాక్స్ రెండు కలిసి మొత్తం 2,07,110 యూనిట్ల ఎస్‌యూవీలను విక్రయించింది.

2021 ఆర్థిక సంవత్సరంలో మహీంద్రా థార్ మొత్తం 14,186 యూనిట్ల SUVలను విక్రయించింది. 2022 ఆర్థిక సంవత్సరంలో మహీంద్రా థార్ మొత్తం 37,844 మంది కస్టమర్లను దక్కించుకున్నారు. 2023 ఆర్థిక సంవత్సరంలో మహీంద్రా థార్ మొత్తం 47,108 యూనిట్ల SUVలను విక్రయించింది. అదే సమయంలో 2024 ఆర్థిక సంవత్సరంలో మహీంద్రా థార్ మొత్తం 65,246 మంది కొత్త కస్టమర్లను పొందారు. మరోవైపు 2025 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుండి అక్టోబర్ వరకు మహీంద్రా థార్, థార్ రాక్స్ ఇప్పటివరకు 42,726 మంది కస్టమర్‌లను పొందాయి.

మహీంద్రా థార్ దేశంలో 2 వేరియంట్‌లు, 5 కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది. ఫీచర్ల గురించి మాట్లాడితే మహీంద్రా థార్‌లో 7.0-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీ, ఆటోమేటిక్ ఎసి, క్రూయిజ్ కంట్రోల్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఉన్నాయి. ఇది కాకుండా కారులో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, వెనుక పార్కింగ్ సెన్సార్, భద్రత కోసం ఫ్రంట్ సీట్ బెల్ట్ రిమైండర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. భారతీయ మార్కెట్లో మహీంద్రా థార్ ఫోర్స్ గూర్ఖా, మారుతి సుజుకి జిమ్నీతో పోటీ పడుతుంది.

థార్ పవర్‌ట్రెయిన్ గురించి మాట్లాడినట్లయితే కారు 3 ఇంజన్ల ఆప్షన్లలో ఉంది. మొదటిది 2.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌. ఇది గరిష్టంగా 150బీహెచ్‌పీ హార్స్ పవర్, 320 ఎన్ఎమ్ పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. రెండవది 2.2-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో ఉంటుంది. ఇది గరిష్టంగా 130బీహెచ్‌పీ పవర్,  300ఎన్ఎమ్ పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఇది కాకుండా కారులో మూడవ 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ కూడా ఉంది, ఇది గరిష్టంగా 118బీహెచ్‌పీ పవర్, 300ఎన్ఎమ్ పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. భారత మార్కెట్లో మహీంద్రా థార్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర టాప్ మోడల్ కోసం రూ. 11.35 లక్షల నుండి రూ. 17.60 లక్షల వరకు ఉంటుంది.

Exit mobile version