Site icon Prime9

Bajaj Freedom 125: అయ్యారే.. ఏమి డిమాండ్ రా స్వామి.. భారీగా పెరిగిన బజాజ్ ఫ్రీడమ్ 125 సేల్స్!

Bajaj Freedom 125

Bajaj Freedom 125

Bajaj Freedom 125: బజాజ్ ఆటో మొదటి సీఎన్‌జీ బైక్ డిమాండ్ నిరంతరం పెరుగుతుంది. కొన్న నెలల క్రితం మార్కెట్‌లోకి వచ్చిన ఈ బైక్ విక్రయాలు సరికొత్త రికార్డ్ సృష్టించాయి. సెప్టెంబర్ సేల్స్ డేటాను పరిశీలిస్తే.. బజాజ్ ఫ్రీడమ్ 125 అమ్మకాలు 113 శాతం పెరిగాయి. దీని ఆధారంగా అంచనా వేయచ్చు, బైక్‌కు ఏ రేంజ్‌తో డిమాండ్ ఉందనేది. బజాజ్ ఆటో కూడా ఈ బైక్‌ను సులభంగా కొనుగోలు చేసే వీలు కల్పిస్తుంది. అనేక ప్రదేశాలకు విస్తరిస్తోంది. బజాజ్ ఫ్రీడమ్ 125 సేల్స్ రిపోర్ట్ గురించి విరంగా తెలుసుకుందాం.

బజాజ్ ఫ్రీడమ్ అమ్మకాల గురించి మాట్లాడితే గత నెలలో కంపెనీ 19639 యూనిట్లను విక్రయించగా, అదే ఆగస్టులో ఈ బైక్  9215 యూనిట్లు సేల్ అయ్యీయి. ఈసారి అమ్మకాల్లో 113 శాతం విపరీతమైన వృద్ధి కనిపించింది. బజాజ్ ఆటో కొన్ని నెలల క్రితం ఈ బైక్‌ను విడుదల చేసింది. నేడు ఇది దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న 7వ బైక్‌గా నిలిచింది.

బజాజ్ ఫ్రీడమ్ CNG బైక్ 3 వేరియంట్లలో లభ్యం కానుంది. దీని కరీబియన్ బ్లూ, సైబర్ వైట్, ఎబోనీ బ్లాక్/గ్రే, రేసింగ్ రెడ్ కలర్ ఆప్షన్‌లు అందుబాటులో ఉన్నాయి.

ఫ్రీడమ్ 125 డ్రమ్: రూ. 95,000

ఫ్రీడమ్ 125 డ్రమ్ LED: రూ. 1.05 లక్షలు

ఫ్రీడమ్ 125 డిస్క్ LED: రూ. 1.10 లక్షలు

బజాజ్ ఫ్రీడమ్ 125cc ఇంజన్ కలిగి ఉంది. ఇది 9.5 PS పవర్, 9.7 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 5 స్పీడ్ గేర్‌బాక్స్ సౌకర్యం ఉంది. CNG+ పెట్రోల్‌తో పనిచేసే 125cc ఇంజిన్ ఇదే. బజాజ్ ఫ్రీడమ్ 125 కేవలం 2 కిలోల CNG సిలిండర్‌ను కలిగి ఉంది. ఇది ఫుల్ ట్యాంక్‌తో 200 కిలోమీటర్లు నడుస్తుంది.

ఇందులో 2 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ మాత్రమే అందుబాటులో ఉంటుంది. దీని కారణంగా ఈ బైక్ 130 కిలోమీటర్ల వరకు నడుస్తుంది. మొత్తంమీద ఈ బైక్ 330 కిలోమీటర్ల (CNG + పెట్రోల్) వరకు నడుస్తుంది. ఈ బైక్‌లో ఫీచర్లకు ఎలాంటి లోటు లేదు. రైడర్ల సౌలభ్యం కోసం, ఇది బ్లూటూత్ కనెక్టివిటీ, డిజిటల్ స్పీడోమీటర్, హ్యాండిల్‌బార్‌పై CNG, పెట్రోల్ షిఫ్ట్ బటన్, USB పోర్ట్, పొడవైన సీటు, గేర్ షిఫ్ట్ ఇండికేటర్ వంటి ఫీచర్లు ఉంటాయి.

బజాజ్ ఈ బైక్  ఫ్యూయల్ ట్యాంక్‌ను చాలా బలంగా తయారు చేసింది.  దాని చుట్టూ బలమైన ఫ్రేమ్‌ను కూడా ఇచ్చింది. ఢీకొన్న తర్వాత కూడా CNG ట్యాంక్‌కు ఎటువంటి డ్యామేజ్ కాదు. ఇది మాత్రమే కాదు CNG గ్యాస్ లీక్ అవ్వదు, అంటే ఇది రైడర్‌కు పూర్తిగా సురక్షితం. బైక్ ముందు టైర్లలో డిస్క్ బ్రేక్, వెనుక టైర్లో డ్రమ్ బ్రేక్ ఉన్నాయి.

Exit mobile version