Site icon Prime9

LML Star Electric Scooter: పాత రోజులు మళ్లీ వస్తున్నాయ్.. LML ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌పై 203 కిమీ నడుస్తుంది..!

LML Star Electric Scooter

LML Star Electric Scooter

LML Star Electric Scooter: భారతదేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల సెగ్మెంట్‌లో తిరిగిరావడానికి ‘LML’ సిద్ధమవుతుంది. త్వరలో స్టార్ ఈవీని విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ స్కూటర్‌ను మొదటిసారిగా 2023లో జరిగిన ఆటో ఎక్స్‌పోలో తొలిసారిగా ప్రదర్శించారు. ఇది ఈ ఏడాది  లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. ఎల్ఎమ్ఎల్ నుంచి వచ్చే మూడు ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఈ స్టార్ మొదటిది, ఇది రాబోయే రోజుల్లో విడుదల కానుంది. దీని పూర్తి వివరాలు తెలుసుకుందాం.

LML Star ముఖ్యమైన స్పెసిఫికేషన్ల గురించి మాట్లాడితే.. ఈ స్కూటర్ సింగిల్ ఛార్జ్‌పై 203 కిమీ రేంజ్ అందిస్తుంది. ఎలక్ట్రిక్ స్కూటర్ స్టార్‌లో రెండు రిమూవ్‌బుల్ బ్యాటరీ ప్యాక్‌లు ఉంటాయి. అయితే, బ్యాటరీ ఖచ్చితమైన సామర్థ్యం ఇంకా వెల్లడి కాలేదు. స్కూటర్ గరిష్టంగా 7.8బిహెచ్‌పి పవర్‌ని ఉత్పత్తి చేసే ఎలక్ట్రిక్ మోటారును కలిగి ఉంటుంది. ఇది గరిష్టంగా గంటకు 90 కి.మీ.

ఇది ఫ్యూచరిస్టిక్ లుక్‌తో సరికొత్త సాంకేతికతను కలిగి ఉంటుంది. బ్లాక్, వైట్, రెడ్ కలర్స్‌తో కూడిన డ్యూయల్-టోన్ బాడీ కలర్‌తో ఫ్యూచరిస్టిక్‌గా ఉంటుంది. ఇందులో ఎల్‌ఈడీ డిఆర్ఎల్, ప్రొజెక్టర్ హెడ్‌లైట్లు ఉన్నాయి. ఫీచర్ల గురించి చెప్పాలంటే డిజిటల్ డిస్‌ప్లే, వైర్‌లెస్ ఛార్జర్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, హిల్ హోల్డ్ అసిస్ట్, రివర్స్ మోడ్, ఏబీఎస్ వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి. ఈ స్కూటర్‌లో 14-అంగుళాల వీల్స్ ఉన్నాయి, దీని కారణంగా దాని గ్రిప్, బ్యాలెన్సింగ్ అద్భుతంగా ఉంటుంది.

డుకాటీ, ఫెరారీ, యమహా, కవాసకి వంటి గ్లోబల్ బ్రాండ్‌ల డిజైనర్లు ఎల్‌ఎమ్‌ఎల్ స్టార్ తయారీకి సహకరించారు. ఇది కాకుండా ఎల్ఎమ్ఎల్ ఈ స్కూటర్ కోసం సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్ (CMVR) సర్టిఫికేట్ కూడా పొందింది. ఈ సర్టిఫికేట్ ఈ స్కూటర్ ప్రభుత్వం నిర్దేశించిన నాణ్యత, భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉందని చూపిస్తుంది. భారత మార్కెట్లో, ఎల్ఎమ్ఎల్ స్టార్ ఓలా S1 ప్రో, ఏథర్ 450X, టీవీఎస్ ఐక్యూబ్, చేతక్ ఎలక్ట్రిక్ వంటి ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్లతో పోటీపడుతుంది.

Exit mobile version