Site icon Prime9

Ligier Mini EV: లక్ష రూపాయలకే ఈవీ.. సింగిల్ ఛార్జ్‌పై 192 కిమీ పరుగులు.. ఈ బుజ్జి కార్ లాంచ్ ఎప్పుడంటే..?

Ligier Mini EV

Ligier Mini EV: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు పెద్ద సంఖ్యలో విడుదల కానున్నాయి. కొత్త మోడల్స్ కార్ మార్కెట్లో దూసుకుపోతున్నాయి. అలానే కార్ల కంపెనీలు బడ్జెట్ ఫ్రెండ్లీ  ఈవీలపై పనిచేస్తున్నాయి. దీని ద్వారా ప్రతి ఎలక్ట్రిక్ కార్లను కొనే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు లిజియర్ చౌకైన ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. దేశీయ, విదేశీ కార్ల కంపెనీలు తక్కువ ధర కలిగిన ఎలక్ట్రిక్ కార్లపై వేగంగా పని చేస్తున్నాయి.

లిజియర్ మినీ ఎలక్ట్రిక్ కారు భారతదేశంలో టెస్టింగ్ సమయంలో కనిపించింది. యూరోపియన్ మోడల్ ఆధారంగా ఈ 2 సీటర్ మినీ EV వేర్వేరు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లను కలిగి ఉంటుంది.ఈ మినీ ఈవీ సింగిల్ ఛార్జ్‌పై 63 కిమీ నుంచి 192 కిమీ వరకు దూసుకుపోతుంది. నివేదికల ప్రకారం ఈ కారును భారతదేశంలో రూ. 1 లక్ష ధరతో విడుదల చేయచ్చు. సరసమైన ఎలక్ట్రిక్ కారు కోసం చూస్తున్న వారికి ఇది గొప్ప ఎంపిక.

లిజియర్ మినీని G.OOD, I.DEAL, E.PIC, R.EBEL అనే 4 విభిన్న వేరియంట్‌లలో లాంచ్ చేయనుంది. 4.14 kWh, 8.2 kWh, 12.42 kWh కెన్‌తో సహా 3 బ్యాటరీ ప్యాక్ ఎంపికలు లభిస్తాయి. బ్యాటరీ రేంజ్ గురించి చెప్పాలంటే.. దీన్ని ఒక్కసారి ఛార్జింగ్‌ చేస్తే 63 కిమీ, 123 కిమీ, 192 కిమీ పరిధిని అందించగలదు. కానీ భారతదేశంలో దాని లాంచ్ గురించి పెద్దగా సమాచారం లేదు. అయితే ఈ కొత్త మోడల్‌కు సంబంధించిన అధికారిక అప్‌డేట్‌లు రాబోయే రోజుల్లో రావచ్చని ఆటో నిపుణులు భావిస్తున్నారు.

డిజైన్ పరంగా కొత్త లిజియర్ మినీ ఎలక్ట్రిక్ కారు చిన్నదిగా ఉంటుంది, ఇది మోపెడ్ డిజైన్‌లో రావచ్చు. కొలతల గురించి చెప్పాలంటే ఈ EV  పొడవు 2958mm, వెడల్పు 1499mm, ఎత్తు 1541mm. యూరోపియన్ మోడల్ ఆధారంగా, ఈ EVలో కేవలం రెండు డోర్లు మాత్రమే కనిపిస్తాయి. ఇందులో 12 నుంచి 13 అంగుళాల వీల్స్ ఉంటాయి. ఎల్‌ఈడీ డీఆర్ఎల్, రౌండ్ హెడ్‌లైట్‌లు దాని ముందు భాగంలో స్లిమ్ గ్రిల్‌తో కనిపిస్తాయి. దీనితో పాటు, వెనుక భాగంలో పెద్ద గ్లాస్‌తో టెయిల్‌గేట్ ఉంటుంది. ఎల్‌ఈడీ టెయిల్‌లైట్‌లను రౌండ్ స్టైల్‌లో ఇక్కడ చూడచ్చు. సైడ్ లుక్ కొంచెం స్పోర్టీగా అనిపిస్తుంది.ఇది కారుకు సైడ్ బాడీ క్లాడింగ్ రగ్డ్ లుక్ ఇస్తుంది.

లిజియర్ మినీ ఈవీ లోపలి భాగం స్పోర్టీగా ఉంటుంది. 10-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్, పవర్ స్టీరింగ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ విత్ హీటెడ్ డ్రైవర్ సీట్, కార్నర్ ఏసీ వెంట్ వంటి ఫీచర్లను ఇందులో చూడచ్చు. ఈ ఏడాది ఆటో ఎక్స్‌పోలో కంపెనీ ఈ కారును ప్రదర్శించనుంది.

Exit mobile version