Site icon Prime9

Kia India Discount: ఆఫర్ల జోరు.. కియా సెల్టోస్‌పై రూ. 2.21 లక్షల డిస్కౌంట్.. చాలా చవక..!

Kia India Discount

Kia India Discount

Kia India Discount: 2024 ముగిసే సమయం దగ్గరపడింది. అన్ని కంపెనీలు తమ పాత స్టాక్‌ను క్లియర్ చేసే పనిలోపడ్డాయి. ఇందులో భాగంగానే ప్రస్తుతం కియా తన సెల్టోస్‌పై మంచి తగ్గింపును అందిస్తోంది. మీరు డిసెంబర్ 31 లోపు ఈ కారును కొనుగోలు చేస్తే, కంపెనీ ఈ కారుపై రూ. 2.21 లక్షల వరకు తగ్గింపును ఇస్తోంది. కానీ ఈ తగ్గింపు వివిధ భాగాలలో అందుబాటులో ఉంటుంది. ఈ కారుపై అందుబాటులో ఉన్న ఆఫర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.

ఇంటర్నెట్‌లోని సమాచారం ప్రకారం కియా సెల్టోస్‌పై రూ. 2.21 లక్షల వరకు తగ్గింపు ఇస్తుంది. కానీ ఈ తగ్గింపు వివిధ భాగాలుగా విభజించారు. ఈ తగ్గింపులో రూ. 80,000 వరకు నగదు తగ్గింపు, పొడిగించిన వారంటీపై 5 శాతం తగ్గింపు (MRPపై), యాక్సెసరీలపై 10 శాతం ప్రయోజనం (MRPపై) ఇస్తున్నారు. ఇది కాకుండా, మేనెజ్మెంట్ ప్యాకేజీపై 5 శాతం ప్రయోజనం కూడా ఉంటుంది.రూ.60,000 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఇవ్వబడుతోంది. ఈ డిస్కౌంట్‌లన్నింటినీ కలుపుకుని రూ. 2.21 లక్షలు సమకూరుతోంది. ఈ ఆఫర్ గురించి మరింత సమాచారం కోసం కియా డీలర్‌షిప్‌ను సంప్రదించవచ్చు.

కియా సెల్టోస్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 10.89 లక్షల నుండి రూ. 20.45 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. మీరు ఈ వాహనంపై ఆఫర్ ప్రయోజనాన్ని డిసెంబర్ 31 వరకు మాత్రమే పొందచ్చు. ఫీచర్ల గురించి మాట్లాడితే ఈ కారు 10.25 అంగుళాల డిజిటల్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, 8-స్పీకర్ బోస్ సౌండ్ సిస్టమ్‌తో ఉంది. ఇది కాకుండా పవర్ స్టీరింగ్, సన్‌రూఫ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, హైట్ అడ్జస్ట్ చేయగల డ్రైవర్ సీటు,  ADAS వంటి అధునాతన ఫీచర్లు ఈ వాహనంలో అందించారు.

ఈ వాహనంలో స్థల కొరత లేదు. ఇందులో 433 లీటర్ల బూట్ స్పేస్ ఉంది. అందులో 5 మంది సులభంగా కూర్చోవచ్చు. ఈ కారులో 18-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి, ఇవి గ్లోసీ బ్లాక్‌లో ఉన్నాయి, ఈ వాహనంలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 3 పాయింట్ సీట్ బెల్ట్, యాంటీ-లాక్‌బ్రేక్ సిస్టమ్, బ్రేక్ ఫోర్స్ అసిస్ట్ సిస్టమ్, ఆల్ వీల్ డిస్క్ ఉన్నాయి. ఇది కాకుండా, ADAS 2.0తో కూడిన కొత్త సెల్టోస్‌లో 17 అడాప్టివ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్‌లు కూడా ఉన్నాయి.

ఇంజన్ గురించి మాట్లాడితే సెల్టోస్ 1.5L పెట్రోల్‌ను పొందుతుంది, ఇది 114.41 bhp పవర్‌, 250 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 7 స్పీడ్ DCT, మాన్యువల్ గేర్‌బాక్స్ ఎంపికను కలిగి ఉంది. ఇది మాత్రమే కాకుండా ఈ వాహనంలో 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ అందుబాటులో ఉంటుంది. ఇది 19.1 kmpl మైలేజీని అందిస్తుందని కంపెనీ పేర్కొంది. భారతదేశంలో, ఇది హ్యుందాయ్ క్రెటా, మారుతి గ్రాండ్ విటారా, హోండా ఎలివేట్‌లతో నేరుగా పోటీపడుతుంది.

Exit mobile version
Skip to toolbar