Kia Syros SUV: కియా నుంచి సరికొత్త కార్.. అదరగొడుతున్న లుక్.. దీన్ని సొంతం చేసుకుంటే అదృష్టవంతులే..!

Kia Syros SUV: కియా మోటార్స్ తన సరికొత్త సిరోస్ ఎస్‌యూవీని డిసెంబర్ 19న ఆవిష్కరించబోతోంది. లాంచ్‌కు ముందు కంపెనీ తన 5వ టీజర్‌ను విడుదల చేసింది. ఈ కొత్త టీజర్‌లో కారు అవుట్ లుక్‌ను చూపించారు. సన్‌రూఫ్, అల్లాయ్, ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు వంటి కొన్ని ప్రత్యేక ఫీచర్లను కారులో చూడవచ్చు. కొన్ని నివేదికల ప్రకారం.. కంపెనీ డీలర్లు దాని అనధికారిక బుకింగ్‌ను కూడా ప్రారంభించారు. ఇందుకోసం రూ.21వేలు టోకెన్‌గా వసూలు చేస్తున్నారు. కంపెనీ సిరోస్‌ను 6 వేరియంట్‌లలో అందించవచ్చు. ఇందులో HTK, HTK (O), HTK Plus, HTX, HTX Plus, HTX Plus (O) ఉండవచ్చు.  ఈ కారు మారుతి బ్రెజ్జా, టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూ వంటి మోడళ్లతో పోటీపడుతుంది.

సిరోస్ మల్టీ వేరియంట్లలో వస్తుంది. దీని బేస్ వేరియంట్ 15-అంగుళాల స్టీల్ వీల్స్, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ ఉంటుంది. మిడ్ వేరియంట్‌లో 16-అంగుళాల అల్లాయ్ వీల్స్, సింగిల్ పేన్ సన్‌రూఫ్ ఉంటాయి. అదే సమయంలో టాప్ వేరియంట్‌లో 17-అంగుళాల అల్లాయ్ వీల్స్, పనోరమిక్ సన్‌రూఫ్, లెవెల్-2 అడాస్ వంటి ఫీచర్లు లభిస్తాయి. బంపర్ దిగువన సెంట్రల్ ఎయిర్ వెంట్‌తో క్లోజ్డ్ సెక్షన్, ఇంటిగ్రేటెడ్ డీఆర్ఎల్‌లతో హెడ్‌ల్యాంప్‌లు, బంపర్‌పై సిల్వర్ స్కిడ్ ప్లేట్, వీల్ ఆర్చ్‌ల చుట్టూ క్లాడింగ్, ఫ్లష్ సిట్టింగ్ రూఫ్ రెయిల్‌లను కలిగి ఉంటుందని దీని టీజర్ వెల్లడించింది.

సిరోస్ ఇంజన్ ఆప్షన్ల గురించి మాట్లాడితే ఇందులో 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్‌ ఉంటుంది. ఇది భారతదేశంలోని అనేక కియా, హ్యుందాయ్ మోడళ్లలో ఉంటుంది. ఈ ఇంజన్ 115హెచ్‌పి పవర్, 250ఎన్ఎమ్ పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలను పొందుతుంది. మరొక ఎంపిక 1.0-లీటర్, టర్బో పెట్రోల్ ఇంజన్.. ఇది 120హెచ్‌పి పవర్చ, 172ఎన్ఎమ్ పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది మాన్యువల్‌తో పాటు 7-స్పీడ్ DCT ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తుంది.

సిరోస్ ప్రీమియం ఫీచర్లతో రానుంది. ఇందులో 10.25-అంగుళాల సెల్టోస్ లాంటి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ డిస్‌ప్లే,పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్ ఉన్నాయి. ఈ కారులో వెంటిలేటెడ్, పవర్డ్ ఫ్రంట్ సీట్లు, డ్రైవ్ మోడ్, ట్రాక్షన్ మోడ్, క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్, లెథెరెట్ అప్హోల్స్టరీ, బోస్ ఆడియో సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లు ఉంటాయి. మునుపటి స్పై షాట్‌ల ఆధారంగా సైరస్ B-SUV లోపలి భాగంలో పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, డ్యూయల్-టోన్ అప్హోల్స్టరీ, 360-డిగ్రీ కెమెరా, ADAS సూట్ ఉన్నాయి.