Site icon Prime9

Upcoming Kia Electric Cars: కియా నుంచి మూడు అద్భుతమైన కార్లు.. 650 కిమీ రేంజ్ మార్కెట్ షేక్ అవ్వడం పక్కా..!

Upcoming Kia Electric Cars

Upcoming Kia Electric Cars

Upcoming Kia Electric Cars: కియా తన 3 ఎలక్ట్రిక్ కార్లను భారతదేశంలో విడుదల చేయబోతోంది. ఈవీ సెగ్మెంట్‌లో కంపెనీ తన పట్టును పటిష్టం చేసుకోవాలనుకుంటోంది. కంపెనీ మొదట ఫేస్‌లిఫ్టెడ్ EV6ని రాబోయే కొద్ది రోజుల్లో లాంచ్ చేస్తుంది. ఆ తర్వాత మరో రెండు మోడల్‌లు వచ్చే 12 నుంచి 18 నెలల్లో భారత్‌లోకి రానున్నాయి. డిజైన్ పరంగా కియా కార్లు ఇప్పుడు అంత బాగా లేవు. కంపెనీ మొదట డిజైన్‌పై పని చేయాలి. మీరు కూడా కియా ఈవీని కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే రండి.. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Kia Syros EV
కియా తన ప్రస్తుత ఎస్‌యూవీ సైరోస్ ఎలక్ట్రిక్ అవతార్‌ను భారతదేశంలో తీసుకువస్తోంది. కంపెనీ దాని డిజైన్, ఇంటీరియర్‌లో చాలా మార్పులు చేయాల్సి ఉంది. డిజైన్ పరంగా సైరోస్ కంపెనీ చెత్తగా కనిపించే వాహనం. నివేదికల ప్రకారం ఈ వాహనం పరిధి 450 కిలోమీటర్ల వరకు వెళ్లగలదు. భారతదేశంలో టాటా పంచ్ ఈవీ, నెక్సాన్ ఈవీలతో పోటీపడుతుంది. భద్రత కోసం, ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఈబీడీతో పాటు యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. సైరోస్ ఈవీ ధర దాదాపు రూ. 10 లక్షలు ఉండచ్చు.

Kia EV6 Facelift
కియా తన లగ్జరీ ఎలక్ట్రిక్ కారు EV6 ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను ఈ నెలలో భారతదేశంలో విడుదల చేయగలదు. ఇందులో ఎన్నో కొత్త మార్పులు కనిపిస్తున్నాయి. కొత్త ఈవీ6 84 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఇది 650 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్‌ను అందించగలదు. ఈ కారు అంచనా ధర రూ. 63 లక్షల ఎక్స్-షోరూమ్ నుంచి ప్రారంభం కావచ్చు. ఈ కారులో కొత్త LED హెడ్‌లైట్లు, అల్లాయ్ వీల్స్ ఉంటాయి. దీని ఇంటీరియర్‌లో టూ-స్పోక్ స్టీరింగ్ వీల్, అప్‌డేట్ చేసిన సెంటర్ కన్సోల్ ఉన్నాయి. కొత్త ఈవీ6 ప్రీమియం కారుగా వస్తుంది.

Kia Carens EV
ఈ సంవత్సరం కొత్త కేరెన్స్ ఈవీని కూడా విడుదల చేయవచ్చని భావిస్తున్నారు. కొత్త కియా కేరెన్స్ ఈవీ అనేక సార్లు టెస్టింగ్ సమయంలో కనిపించింది. పెట్రోల్ మోడల్‌తో పోలిస్తే దీని డిజైన్‌లో చాలా మార్పులు కనిపిస్తాయి. సమాచారం ప్రకారం ఒక పెద్ద బ్యాటరీ ప్యాక్ ఇందులో చూడచ్చు.

ఇది ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 500 కిలోమీటర్ల పరిధిని అందించగలదని అంచనా. ఇది డీసీ ఫాస్ట్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ ఇస్తుందని భావిస్తున్నారు. భద్రతకు సంబంధించి, కొత్త కేరెన్స్ ఈవీలో లెవల్ 2 అడాస్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, బ్రేక్ అసిస్ట్, 3 పాయింట్ సీట్ బెల్ట్ ఉంటాయి. దీని ఖరీదు దాదాపు రూ. 20 లక్షల వరకు ఉండచ్చు.

Exit mobile version
Skip to toolbar