Site icon Prime9

Kia EV6 Recall: కియా కీలక నిర్ణయం.. వందలాది EV6 కార్లు వెనక్కి.. ఎందుకో తెలుసా..?

Kia EV6 Recall

Kia EV6 Recall: కియా ఇండియా ఈ సంవత్సరం ఆటో ఎక్స్‌పో 2025లో తన ప్రీమియం ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కియా EV6 ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను విడుదల చేసింది. దీనిలో అనేక అప్‌గ్రేడ్లు ఉన్నాయి. కానీ ఈ వాహనం డిజైన్ ఆకట్టుకోలేకపోయింది. కంపెనీ తన ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ కోసం జనవరి 17, 2025 నుండి బుకింగ్ ప్రారంభించింది. కానీ ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. Kia EV6 రీకాల్ చేసింది. ఇప్పుడు ఈ వాహనంలో తప్పు ఏమిటి? ఎన్ని యూనిట్లను రీకాల్ చేస్తున్నారు? తదితర వివరాలు తెలుసుకుందాం.

లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం.. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఇంటిగ్రేటెడ్ ఛార్జింగ్ కంట్రోల్ యూనిట్ (ICCU)లో లోపం ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ కారణంగానే కంపెనీ ఇది రీకాల్ చేసింది. ఇప్పుడు సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేయనున్నట్లు తెలిపింది. సమాచారం ప్రకారం కియా 1380 యూనిట్లకు రీకాల్ జారీ చేసింది. ఈ యూనిట్లు మార్చి 3, 2022 , ఏప్రిల్ 14, 2023 మధ్య తయారు చేశారు. ఈ సమాచారాన్ని కంపెనీ కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH)కి కూడా అందించింది. ఈ రీకాల్ దాని ఫేస్‌లిఫ్ట్ మోడల్ కోసం కాదు, పాత మోడల్ కోసం అని గమనించాలి.

కియా EV6 రీకాల్ జారీ చేసిన తర్వాత, కంపెనీ తన కస్టమర్‌లను ఈ-మెయిల్, మెసేజెస్, ఫోన్ ద్వారా సంప్రదిస్తోంది. కాల్ చేసిన కస్టమర్లు తమ వాహనాన్ని సమీపంలోని సర్వీస్ సెంటర్‌కు తీసుకెళ్లి చెక్ చేసుకోవచ్చు. తద్వారా సాఫ్ట్‌వేర్‌ను అప్‌గ్రేడ్ చేయచ్చు. ఏదైనా ఇతర సమస్య ఏర్పడితే దాన్ని కూడా కంపెనీ పరిష్కరిస్తుంది.

సాధారణంగా కారుని రీకాల్ చేసినప్పుడల్లా, దానిని రిపేర్ చేయడానికి ఎలాంటి ఛార్జీ ఉండదు. అందువల్ల కంపెనీ Kia EV6ని రిపేర్ చేయడానికి ఎటువంటి డబ్బు వసూలు చేయదు, ఉచితంగా రిపేర్ చేస్తుంది. కంపెనీ వాహనాన్ని రిపేర్ చేసి కస్టమర్‌ను సంప్రదిస్తుంది. ఇటీవలే కియా సిరోస్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ ఎస్‌యూవీ ఫీచర్లు, స్పేస్ పరంగా ఓకే అయినప్పటికీ డిజైన్ పరంగా చాలా నిరాశపరిచింది. దీనిని కియా చెత్తగా రూపొందించిన ఎస్‌యూవీ అని పిలవవచ్చు.

Exit mobile version
Skip to toolbar