Site icon Prime9

Discounts on Kia Carens: కియా కేరెన్స్‌పై బంపర్ డిస్కౌంట్.. 5 సంవత్సరాల వారంటీ.. కంప్లీట్ ఫ్యామిలీ కారు ఇది!

Kia Carens April 2025 Discounts

Kia Carens April 2025 Discounts

Huge Discounts Kia Carens from April 2025: కియా ఇండియా ఈ నెలలో తన పోర్ట్‌ఫోలియోలో అత్యధికంగా అమ్ముడైన 7-సీట్ల కారు అయిన కేరెన్స్‌పై డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ కారుపై కంపెనీ రూ.15,000 కార్పొరేట్ డిస్కౌంట్ ఇస్తోంది. దీనిపై మీకు క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్ బెనిఫిట్స్ లభించవు. దీనితో పాటు, కంపెనీ టర్బో ఇంజిన్, డీజిల్ వేరియంట్లపై వినియోగదారులకు 5 సంవత్సరాల వారంటీని కూడా అందిస్తోంది. కంపెనీ ఫ్రీ‌గా టూల్స్ కూడా అందిస్తోంది. మారుతి ఎర్టిగా తర్వాత, కేరెన్స్ దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన 7-సీట్ల ఎమ్‌పివిగా మారింది. అంతేకాకుండా ఇది కంపెనీకి కూడా స్థిరంగా మంచి పనితీరును కనబరుస్తోంది. మార్చిలో దీని 5,512 యూనిట్లు అమ్ముడయ్యాయి.

 

Kia Carens Features and Specifications
కేరెన్స్ క్యాబిన్ EV5 నుండి ప్రేరణ పొందింది. దీని ముఖ్యమైన ఫీచర్స్‌లో ఇన్ఫోటైన్‌మెంట్, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం డ్యూయల్ 10.25-అంగుళాల స్క్రీన్‌లు, 360-డిగ్రీల కెమెరా, పనోరమిక్ సన్‌రూఫ్ ఉండచ్చు. కియా కేరెన్స్ ఫేస్‌లిఫ్ట్‌లో అడాస్ ఉంటుంది. ఇప్పటికే ఉన్న మోడల్ నుండి అనేక ఫీచర్లు ముందుకు తీసుకువెళతారు. ఇందులో ప్రీమియం సౌండ్ సిస్టమ్, డ్యూయల్ కెమెరాలతో కూడిన డాష్‌క్యామ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్, ఓటీఏ అప్‌డేట్‌లు, స్పీడ్ లిమిటింగ్ ఆప్షన్‌తో ఆటో క్రూయిజ్ కంట్రోల్ ఉన్నాయి.

 

Kia Carens Facelift
కియా కేరెన్స్ ఫేస్‌లిఫ్ట్ ప్రస్తుత మోడల్ మాదిరిగానే ఇంజన్ ఎంపికలను ఉపయోగిస్తుందని భావిస్తున్నారు. ఇందులో 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ ఉంది. ఈ ఇంజన్ 115హెచ్‌పి పవర్, 144ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో మాత్రమే అందించారు 1.5-లీటర్ టర్బో పెట్రోల్ యూనిట్ 160పిఎస్ పవర్, 253ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ట్రాన్స్మిషన్ ఎంపికలలో 6iMT, 7DCT ఉన్నాయి. మూడవ ఎంపిక 1.5-లీటర్ VGT డీజిల్. ఇది 6MT, 6iMT, 6AT ట్రాన్స్మిషన్ ఎంపికలతో అందించారు.

 

Kia Carens EV Facelift
కేరెన్స్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ స్పై చిత్రాలు కూడా బయటపడ్డాయి. కొత్త కేరెన్స్ ఈవీ ఒక ఈవీ ఛార్జింగ్ స్టేషన్ వద్ద కనిపించింది. ఫాసియాపై ఛార్జింగ్ పోర్ట్, కొత్త డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్,ఫాసియా దిగువ భాగంలో అడాస్ సెన్సార్‌ను కూడా ఉంది. వీటి ప్రకారం.. భద్రత కోసం అడాస్ సేఫ్టీ ఫీచర్లు ఉన్నట్లు తెలుస్తుంది. కంపెనీ కేరెన్స్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను కూడా పరిచయం చేస్తుంది. కియా కేరెన్స్ ఈవీలో పూర్తిగా కొత్త ఫ్రంట్ డిజైన్, చాలా వరకు కొత్త వెనుక భాగం, సైడ్ ప్రొఫైల్, అప్‌గ్రేడ్ చేసిన సెంటర్ కన్సోల్, కొత్త అప్హోల్స్టరీ, స్టీరింగ్ వీల్, గేర్ లివర్‌ ఉంటాయని భావిస్తున్నారు.

 

Exit mobile version
Skip to toolbar