Site icon Prime9

Jeep Compass Discount: మాంచి కిక్కిచ్చే ఆఫర్.. కారు కొంటే రూ. 4.75 లక్షల డిస్కౌంట్.. ఇదే లాస్ట్ ఛాన్స్..!

Jeep Compass

Jeep Compass

Jeep Compass Discount: జీప్ ఇండియా తన ప్రీమియం, అత్యధికంగా అమ్ముడైన SUV జీప్ కంపాస్‌పై సంవత్సరం చివరి నెలలో అంటే డిసెంబర్‌లో భారీ తగ్గింపులను అందిస్తోంది. ఈ మోడల్‌పై వినియోగదారుల ఆఫర్‌లు, కార్పొరేట్ ఆఫర్‌లతో పాటు కంపెనీ ప్రత్యేక ఆఫర్‌లను అందిస్తోంది. కంపాస్‌పై లభించే తగ్గింపు గురించి మాట్లాడితే ఇది రూ. 3.20 లక్షల వినియోగదారుల ఆఫర్‌ను, రూ. 1.40 లక్షల కార్పొరేట్ ఆఫర్‌ను అందిస్తోంది. వీటన్నింటితో పాటు కంపెనీ దీనిపై రూ.15,000 ప్రత్యేక ఆఫర్ కూడా ఇస్తోంది. ఈ విధంగా మీరు ఈ SUVపై రూ. 4.75 లక్షల వరకు తగ్గింపును పొందచ్చు. ఈ కారు ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 18.99 లక్షలు.

Jeep Compass Engine
జీప్ కంపాస్ ఇంజన్ గురించి చెప్పాలంటే.. ఇందులో 2.0-లీటర్ డీజిల్ ఇంజన్ ఉంది. ఇది 170పీఎస్ పవర్, 350Nm టార్క్ ఉత్పత్తి చేయగలదు. ట్రాన్స్‌మిషన్ కోసం, ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ లేదా 9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో ఉంటుంది. కంపాస్‌ను ఫ్రంట్-వీల్, ఆల్-వీల్ డ్రైవ్ (AWD) ఎంపికలలో కొనుగోలు చేయవచ్చు. మైలేజీ విషయానికి వస్తే ఇది 15 నుండి 17 కిమీ/లీ మైలేజీని ఇస్తుంది.

Jeep Compass Features
ఇప్పుడు కంపాస్ ఫీచర్ల గురించి మాట్లాడుకుంటే ఇందులో 10.1-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీతో 10.25-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే ఉంది. ఇది వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 8-వే అడ్జస్టబుల్ పవర్డ్ డ్రైవర్ సీటు, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, క్రూయిజ్ కంట్రోల్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, సన్‌రూఫ్ వంటి ఫీచర్లను కూడా కలిగి ఉంది. కంపెనీ తన ఫేస్‌లిఫ్ట్ మోడల్‌పై కూడా పని చేస్తోంది.

Jeep Compass Safety
కంపాస్ సేఫ్టీ విషయానికి వస్తే.. ఇందులో ప్రయాణీకులకు ఎయిర్‌బ్యాగ్‌లు కూడా ఉన్నాయి. SUVలో మొత్తం 6 ఎయిర్‌బ్యాగ్‌లు అందించారు. దీనితో పాటు, ఇది 360-డిగ్రీ కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), హిల్ స్టార్ట్ అసిస్ట్ వంటి ఫీచర్లను కూడా ఉన్నాయి. అడాస్ ఫీచర్లు కూడా ఇందులో అందుబాటులో ఉన్నాయి. భారతీయ మార్కెట్లో ఈ SUV హ్యుందాయ్ టక్సన్, టాటా హారియర్, ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్, సిట్రోయెన్ C5 ఎయిర్‌క్రాస్ వంటి మోడళ్లతో పోటీపడుతుంది.

Exit mobile version