Site icon Prime9

All New 2025 Jeep Meridian: మార్కెట్‌లోకి జీప్ మెరిడియన్.. అదిరిపోయిన ఫీచర్లు!

All New 2025 Jeep Meridian

All New 2025 Jeep Meridian

All New 2025 Jeep Meridian: పండుగ సీజన్ దృష్టిలో ఉంచుకుని జీప్ ఇండియా తన ఆల్ న్యూ 2025 మెరిడియన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఈ కొత్త మోడల్ టయోటా ఫార్చునర్‌కు గట్టీ పోటీని ఇస్తుంది. ఇది కాకుండా ఈ జీప్ SUV కూడా MG గ్లోస్టర్‌తో పోటీపడనుంది. కొత్త జీప్ మెరిడియన్ ప్రీమియం సి-సెగ్మెంట్ కస్టమర్లకు చాలా ఫీచర్లను ఆఫర్ చేస్తుంది. ఇది మాత్రమే ఇందులో 5 ,7 సీట్ల వేరియంట్లు ఉన్నాయి. దీనిలో ప్రీమయం ఇంటీరియర్‌ను చూస్తారు. అందులో 70 కంటే ఎక్కువ యాక్టివ్ ఫీచర్లు, 10 కంటే ఎక్కువ అడాస్ ఫీచర్లు, 30 కంటే ఎక్కువ కనెక్ట్ ఫీచర్లు ఉన్నాయి. కొత్త జీప్ మెరిడియన్ బుకింగ్‌లు కూడా ప్రారంభమయ్యాయి. ఇప్పుడు దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

2025 జీప్ మెరిడియన్ లాంగిట్యూడ్, లాంగిట్యూడ్ ప్లస్, లిమిటెడ్ ఆప్ట్, ఓవర్‌ల్యాండ్ వేరియంట్‌లలో అందుబాటులో  ఉంది. వాటి ధరలు వరుసగా..
జీప్ మెరిడియన్ లాంగిట్యూడ్- రూ 24.99 లక్షలు
జీప్ మెరిడియన్ లాంగిట్యూడ్ ప్లస్- రూ. 27.50 లక్షలు
జీప్ మెరిడియన్ లిమిటెడ్  ఆప్షన్- రూ. 30.49 లక్షలు
జీప్ మెరిడియన్ ఓవర్‌ల్యాండ్- రూ. 36.49 లక్షలు

2025 Jeep Meridian Features
కొత్త జీప్ మెరిడియన్ డిజైన్ గురించి మాట్లాడితే దాని సిగ్నేచర్ 7 స్లాట్ గ్రిల్, అటాచ్డ్ హెడ్‌ల్యాంప్‌లు దీనికి ప్రీమియం లుక్ అందిస్తాయి. ఇది కాకుండా ఫుల్ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, ఎల్‌ఈడీ టెయిల్‌లైట్లు, శాటిన్ క్రోమ్ యాక్సెంట్, వేగన్ లెదర్‌తో డెకరేట్ చేసిన క్యాబిన్, కాపర్ స్టిచింగ్, సీటు ఫోల్డ్ చేసినప్పుడు 824 లీటర్ల వరకు బూట్ స్పేస్ పొందుతుంది. మీరు ఇక్కడ చాలా వస్తువులను ఉంచవచ్చు.  లక్షణాలను కలిగి ఉంది.

కొత్త జీప్ మెరిడియన్‌లో 2.0 లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్ ఉంది. ఇది 170 హెచ్‌పి పవర్, 350ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఎంపికలలో అందుబాటులో ఉన్న ఈ ఫుల్ సైజ్ ఎస్‌యూవీ దాని విభాగంలో అత్యధిక 16.25 kmpl మైలేజీని ఇస్తుంది. జీప్‌లో ఇన్‌స్టాల్ చేయబడిన ఈ ఇంజన్ చాలా శక్తివంతమైనది. ఇది ప్రతి సీజన్‌లో బాగా పని చేస్తుంది.

కొత్త జీప్ మెరిడియన్‌లో స్పేస్ అందుబాటులో ఉంది. ఇందులో 10.25 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 10.1 అంగుళాల ఫుల్ హెచ్‌డీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. ఇది కాకుండా వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే, నావిగేషన్‌, వైర్‌లెస్ ఛార్జర్, వివిధ ప్రదేశాలలో ఛార్జింగ్ పోర్ట్‌లు ఉన్నాయి.

ఇందులో 30కి పైగా కనెక్ట్ చేయబడిన కార్ ఫీచర్లు, డ్యూయల్ జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్, పనోరమిక్ సన్‌రూఫ్, రిమోట్ ఇంజన్ స్టార్ట్/స్టాప్, మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్‌లు, 360 డిగ్రీ కెమెరా, అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

టయోటా ఫార్చ్యూనర్ ధర రూ. 33.43 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. కారులోని 2.8 లీటర్ డీజిల్ ఇంజన్ 4×4 సెటప్‌తో లీటరుకు 12.65 కిలోమీటర్ల మైలేజీని ఇవ్వగలదు. మైల్డ్ హైబ్రిడ్ ఇంజన్ 13.15 kmpl మైలేజీని ఇస్తుంది. మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్ కారణంగా ఇది 16bhp పవర్, 42Nm టార్క్ అవుట్‌పుట్‌ను పెంచింది. వచ్చే ఏడాది నాటికి కొత్త ఫార్చ్యూనర్‌ను విడుదల చేసేందుకు టయోటా సన్నాహాలు చేస్తోంది.

Exit mobile version