Site icon Prime9

Hyundai Offers: ఇదే మంచి అవకాశం.. హ్యుందాయ్ కార్లపై రూ.81 వేలు డిస్కౌంట్.. ధరకు తగ్గట్టే ఫీచర్లు!

Hyundai Offers

Hyundai Offers

Hyundai Offers: భారతదేశంలో ధన్‌ త్రయోదశి విశేషమైన ప్రాముఖ్యత ఉంది. రోజున షాపింగ్ చేయడం మంచిదని భావిస్తారు. కొత్త వాహనం కొనడం కూడా చాలా శుభప్రదం. కస్టమర్లను ఆకర్షించేందుకు కార్ కంపెనీలు కొత్త ఆఫర్లు, డిస్కౌంట్లను కూడా అందజేస్తున్నాయి. హ్యుందాయ్ మోటార్ ఇండియా కూడా ఈ ధన్‌ త్రయోదశి సందర్భంగా తన వాహనాలపై చాలా మంచి ఆఫర్లను అందిస్తోంది. 81 వేల వరకు ఆదా చేసుకోవచ్చు. ఏ మోడల్‌పై ఎంత తగ్గింపు లభిస్తుందో తెలుసుకుందాం.

Hyundai Venue
హ్యుందాయ్ మోటార్ ఇండియా తన కాంపాక్ట్ ఎస్‌యూవీ వెన్యూపై చాలా మంచి ఆఫర్‌ను అందించింది. అక్టోబర్ 31, 2024లోపు వెన్యూ ఎస్‌యూవీని కొనుగోలు చేస్తే, రూ. 80,629 వరకు ఆదా చేయవచ్చు. ఈ వాహనం ధర రూ.7.94 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. దీనిలో 1.2L  MPi పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది 83 పీఎస్ పవర్,  114 ఎన్ఎమ్ టార్క్‌ రిలీజ్ చేస్తుంది. ఈ వేరియంట్ 5 స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే అందుబాటులో ఉంది. ఇంజన్ మంచి మైలేజీని కూడా అందిస్తుంది.

Hyundai Exter
హ్యుందాయ్ కాంపాక్ట్ ఎక్స్‌టర్‌పై పండుగ సీజన్‌లో రూ.42,972 తగ్గింపు లభిస్తుంది. ఈ కారుపై మీకు ప్రత్యేక ఆఫర్ అందుబాటులో ఉంది. హ్యుందాయ్ ఎక్సెటర్ 1.2 లీటర్ 4 సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలిగి ఉంది. ఇది 83 పీఎస్ పవర్, 114ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 5 స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఉంటుంది. ఎక్స్‌టర్ ధర రూ.6.13 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

Hyundai i20
ప్రస్తుతం హ్యుందాయ్ ఐ20పై రూ. 55,000 వరకు ఆదా చేసుకోవచ్చు. ఈ కారు ధర రూ.7.04 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఈ కారులో 1.2L పెట్రోల్ ఇంజన్ ఉంది, ఇది 83పీఎపస్ పవర్, 115 ఎన్‌ఎమ్ టార్క్ ఇస్తుంది. ఈ ఇంజన్ 5 స్పీడ్ మ్యాన్యువల్,  ఐవీటీ గేర్‌బాక్స్‌తో అమర్చబడి ఉంటుంది. భద్రత కోసం ఇందులో యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎయిర్‌బ్యాగ్‌లు, డిస్క్ బ్రేక్‌లు, బ్రేక్ అసిస్ట్, హిల్ హోల్డ్, 37 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్, 16 అంగుళాల టైర్లు ఉన్నాయి.

Hyundai Grand i10 Nios
హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 ఒక అద్భుతమైన హ్యాచ్‌బ్యాక్ కారు. దీనిపై రూ.58,000 తగ్గింపు ఇస్తోంది. ఇది అక్టోబర్ 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ కారులో 1.2 ఎల్ ఇంజన్ ఉంది. ఇది 69పీఎస్ పవర్, 95.2 ఎనమ్ఎమ్ టార్క్ ఇస్తుంది. ఈ కారులో అమర్చిన ఈ ఇంజన్ శక్తివంతంగా ఉండటమే కాకుండా ప్రతి సీజన్‌లో మెరుగైన పనితీరును కనబరుస్తుంది. ఈ ఇంజన్ 5 స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో అమర్చబడి ఉంటుంది.

Exit mobile version