Site icon Prime9

Hyundai Venue Adventure Edition: హ్యుందాయ్ వెన్యూ అడ్వెంచర్ ఎడిషన్.. హైలెట్‌గా నిలిస్తున్న ఈ కొత్త ఫీచర్లు!

Hyundai Venue Adventure Edition

Hyundai Venue Adventure Edition

Hyundai Venue Adventure Edition: దేశీయ ఆటోమార్కెట్‌లో ఎస్‌యూవీ వాహనాలకు భారీ డిమాండ్ ఉంది. 2024 క్యూ వన్ సేల్స్‌లో ఈ సెగ్మెంట్ మాత్రమే 52 శాతం వాటాను కలిగి ఉంది. ఈ క్రమంలో ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ ఇటీవల తన పాపులర్ ఎస్‌యూవీ వెన్యూ స్పెషల్ ఎడిషన్‌ను విడుదల చేసింది. ఇది వెన్యూ అడ్వెంచర్ ఎడిషన్‌గా మార్కెట్‌లోకి వచ్చింది.

ఇంటర్నెట్‌లోని సమాచారం ప్రకారం హ్యుందాయ్ వెన్యూ స్పెషల్ ఎడిషన్ అనేక ప్రత్యేకమైన స్టైల్, లుక్‌ను కలిగి ఉంది. ఇది దాని స్టాండర్డ్ నుంచి వేరియంట్ నుంచి కాస్త భిన్నంగా ఉంటుంది. ఇది కాకుండా కారులో అనేక కాస్మెటిక్ అప్‌డేట్‌లు కూడా కనిపిస్తాయి. కంపెనీ దీనిని రూ. 10.15 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో విడుదల చేసింది. హ్యుందాయ్ వెన్యూ అడ్వెంచర్ ఎడిషన్ కొన్ని ప్రత్యేకతల గురించి వివరంగా తెలుసుకుందాం.

హ్యుందాయ్ వెన్యూ అడ్వెంచర్ ఎడిషన్ ఎక్ట్సీరియర్ గురించి మాట్లాడితే.. ఇది రగ్డ్ డోర్ క్లాడింగ్, స్కిడ్ ప్లేట్లు వంటి ఫీచర్లతో వస్తుంది. అలానే స్టాండర్డ్ వేరియంట్‌తో పోలిస్తే భిన్నంగా ఉంటుంది.

హ్యుందాయ్ వెన్యూ అడ్వెంచర్ ఎడిషన్ ఇంటీరియర్ విషయానికి వస్తే స్పర్్స బ్లా థీమ్, బ్లాక్ రేడియేటర్ గ్రిల్‌తో పాటు, కారు బ్రాండ్ లోగో, రూఫ్ రైల్స్, ఓఆర్‌వీఎమ్‌లు, షార్క్ ఫిన్ యాంటెన్నాను బ్లాక్ ట్రీట్‌మెంట్‌ ఉంటుంది. అదే సమయంలో ఎస్‌యూవీ అల్లాయ్ వీల్ మొత్తం బ్లాక్ పెయింట్‌లో కూడా కనిపిస్తుంది.

హ్యుందాయ్ వెన్యూ అడ్వెంచర్ ఎడిషన్ క్యాబిన్‌లో బ్లాక్,గ్రీన్ థీమ్‌ను కూడా చూస్తారు. ఎస్‌యూవీ సీటు గ్రీన్ హైలెట్‌లతో ఉంటుంది. ఇది కాకుండా అనేక పార్ట్స్ బ్లాక్, గ్రీన్ కలర్ థీమ్‌ని పొందుతాయి.

హ్యుందాయ్ వెన్యూ అడ్వెంచర్ ఎడిషన్‌లో డ్యూయల్ కెమెరా సెటప్‌తో కూడిన డాష్‌క్యామ్‌ను దానికి కొత్త ఫీచర్‌గా తీసుకొచ్చారు. కస్టమర్‌లు స్టాండర్డ్ వేరియంట్‌లో పొందని అడ్వెంచర్ ఎడిషన్‌లో డాష్‌క్యామ్ స్టాండర్డ్ ఫీచర్‌గా అందించారు.

పవర్‌ట్రెయిన్ గురించి మాట్లాడినట్లయితే హ్యుందాయ్ వెన్యూ అడ్వెంచర్ ఎడిషన్‌లో 2 ఇంజిన్‌లు ఉంటాయి. మొదటిది 1.0 నాచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్. ఇది గరిష్టంగా 82bhp పవర్ రిలీజ్ చేయగలదు. రెండవది 1.0 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్. ఇది గరిష్టంగా 118bhp పవర్ ఉత్పత్తి చేస్తుంది.

Exit mobile version