Site icon Prime9

March Car Offers: సరికొత్త ఆఫర్లను తెచ్చిన మార్చ్.. ఈ మూడు కార్లపై వేలల్లో డిస్కౌంట్స్..!

March Car Offers

March Car Offers

March Car Offers: కొత్త కారు కొనుగోలు చేసే వారికి మార్చి నెల చాలా పెద్ద ఆఫర్లను తెచ్చిపెట్టింది. ఈ నెలలో కార్ల కంపెనీలు తమ అమ్మకాలను పెంచుకునేందుకు సరికొత్త ఆఫర్లతో ముందుకు వస్తున్నాయి. మీరు మారుతి సుజుకి, హోండా కార్లు, నిస్సాన్ కార్లపై చాలా మంచి ఆఫర్లను చూడచ్చు. మీరు మార్చి 31 లోపు కొత్త కారును కొనాలని చూస్తే, ఏ మోడల్‌పై ఎంత డిస్కౌంట్ లభిస్తుందో? వాటి ధర ఎంత? తదితర వివరాలు తెలుసుకుందాం.

Maruti Suzuki Fronx
ఈ నెలలో మారుతి సుజుకి తన కాంపాక్ట్ ఎస్‌యూవీ Fronx పై మంచి తగ్గింపును అందిస్తోంది. ఈ కారులో పెట్రోల్, సిఎన్‌జి ఇంజన్స్ ఉంటాయి. ప్రస్తుతం మీరు ఈ కారుపై రూ.98,000 వరకు తగ్గింపు లభిస్తుంది. ఈ తగ్గింపులో ఎక్స్ఛేంజ్ ఆఫర్‌కు నగదు తగ్గింపు ఉంటుంది. ముందు పొడవు 3995 మిమీ, వెడల్పు 1765 మిమీ, ఎత్తు 1550 మిమీ. ఇందులో 308 లీటర్ల బూట్ స్పేస్ ఉంది. భద్రత కోసం యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, 6 ఎయిర్ బ్యాగ్స్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఫ్యాం ఎక్స్-షోరూమ్ ధర రూ.7.52 లక్షల నుండి రూ.9.43 లక్షల వరకు ఉంది

Nissan Magnite
మీరు మార్చి నెలలో మాగ్నైట్ ఎస్‌యూవీ SUVని కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే మీకు రూ. 90,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ వాహనం కొత్త, పాత మోడళ్లపై ఈ తగ్గింపు అందుబాటులో ఉంది. తగ్గింపు గురించి మరింత సమాచారం కోసం, మీరు మీ సమీప నిస్సాన్ డీలర్‌షిప్‌ను సంప్రదించవచ్చు. ప్రస్తుతం ఈ ఎస్‌యూవీ ఎక్స్-షోరూమ్ ధర రూ.6.12 లక్షల నుండి ప్రారంభమవుతుంది.

నిస్సాన్ మాగ్నైట్‌లో రెండు ఇంజన్లు ఉంటాయి. ఇందులో 1.0L టర్బో పెట్రోల్ ఇంజన్, 1.0L నాచురరల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ ఉన్నాయి. భద్రత కోసం, ఈ మాగ్నైట్‌లో 6 ఎయిర్‌బ్యాగ్స్, హై స్పీడ్ అలర్ట్ సిస్టమ్, చైల్డ్ సీట్ మౌంట్, ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ విత్ EBD, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Honda Elevate
ఈ నెల హోండా ఎలివేట్‌పై రూ.86,000 వరకు తగ్గింపును అందిస్తోంది. ఈ ఆఫర్ ఎలివేట్ SV, V, VX వేరియంట్‌లపై అందుబాటులో ఉంది. ఎలివేట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 11.91 లక్షల నుండి రూ. 16.73 లక్షల వరకు ఉంది. స్పేస్ పరంగా ఇది మంచి ఎస్‌యూవీ. అయితే ఎలివేట్ అపెక్స్ ఎడిషన్‌ను కొనుగోలు చేయడం ద్వారా గరిష్టంగా రూ. 46,000 వరకు ఆదా చేసుకోవచ్చు. భద్రత కోసం యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, EBD, 6 ఎయిర్‌బ్యాగ్స్ ఉన్నాయి.

Exit mobile version
Skip to toolbar