Site icon Prime9

New Honda Activa 7G: మార్కెట్లోకి యాక్టివా 7జీ.. 55కిమీ మైలేజ్.. స్మార్ట్ ‌ఫీచర్లతో స్మార్ట్‌గా వస్తుంది..!

New Honda Activa 7G

New Honda Activa 7G

New Honda Activa 7G: ఆటో ఎక్స్‌పో 2025లో ఒకటి కంటే ఎక్కువ వాహనాలు విడుదల కాబోతున్నందు కొత్త సంవత్సరంలో ఆటో రంగం మెరుగ్గా ఉండబోతుంది. ద్విచక్ర వాహన సెగ్మెంట్ గురించి మాట్లాడితే కొత్త Activa 7Gని ఈ నెల ఆటో ఎక్స్‌పోలో పరిచయం చేయచ్చు. ఈ స్కూటర్ గతేడాదే వచ్చే అవకాశం ఉండేది కానీ, కంపెనీ హోండా ఎలక్ట్రిక్ యాక్టివాను విడుదల చేసి అందరిని ఆశ్చర్యపరచింది. కొత్త యాక్టివాలో ఎటువంటి ఫీచర్లు ఉంటాయి? తదితర వివరాలు తెలుసుకుందాం.

New Honda Activa 7G
మీడియా నివేదికల ప్రకారం ఈసారి కొత్త హోండా యాక్టివా 7G డిజైన్‌లో చాలా పెద్ద మార్పులు చూడచ్చు. ముందు నుండి వెనుకకు, కొత్త హెడ్‌లైట్లు, డీఆర్ఎల్, రిఫ్లెక్ట్ లైట్‌ని దాని ముందు భాగంలో ఇవ్వచ్చు. వెనుక కూర్చున్న వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా దీని సీటు పొడవుగా ఉంటుంది. ఇప్పుడు కొత్త Activa 7G సీటు కింద ఎక్కువ స్పేస్ ఉంటుంది, తద్వారా రెండు పెద్ద హెల్మెట్‌లను ఉంచచ్చు. ఇదే ఫీచర్ ప్రస్తుత టీవీఎస్ జూపిటర్‌లో కూడా అందుబాటులో ఉంది.

New Honda Activa 7G Engine
ఇంజన్ గురించి మాట్లాడితే యాక్టివా 7జీ అప్‌డేట్ చేసిన 109cc సింగిల్-సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజన్‌తో రావచ్చు. ఇది 7.6బిహెచ్‌పి పవర్, 8.8Nm టార్క్‌ రిలీజ్ చేస్తుంది. ఈ స్కూటర్‌లో ఇంజిన్ స్టార్ట్-స్టాప్ స్విచ్ బటన్ ఉంటుంది. ఇది సైలెంట్ స్టార్టర్, డ్యూయల్-ఫంక్షన్ స్విచ్ సౌకర్యాన్ని కలిగి ఉంటుంది, తద్వారా తక్కువ శబ్దం ఉంటుంది. స్కూటర్‌లో 5.3 లీటర్ ఇంధన ట్యాంక్‌ను చూడచ్చు. ఈసారి యాక్టివా కూడా మంచి మైలేజీని క్లెయిమ్ చేసింది. ఈ స్కూటర్ లీటరుకు 50-55 కి.మీ పొందగలదు, అయితే ప్రస్తుతం ఉన్న యాక్టివా ప్రస్తుతం 45 నుండి 50 కి.మీ మైలేజీని పొందుతుంది. కొత్త Activa 7G లాంచ్‌కు సంబంధించి కంపెనీ నుండి ఇంకా ఎటువంటి ప్రకటన రాలేదు.

కొత్త హోండా యాక్టివా 7G మరోసారి జూపిటర్ 110తో పోటీ పడనుంది. ఈ స్కూటర్ ధర రూ.73,700 నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో ఫ్యూయల్ ఇంజెక్షన్ టెక్నాలజీతో కూడిన కొత్త 113.3సీసీ సింగిల్ సిలిండర్ ఇంజన్ ఉంది. ఈ ఇంజన్ 5.9కేజీ పవర్, 9.8 ఎన్ఎమ్ టార్క్ ఇస్తుంది. ఇందులో సివిటి గేర్‌బాక్స్ ఉంది. ఈ స్కూటర్ మైలేజీని ఇంకా వెల్లడించలేదు. దాని సీటు కింద రెండు హెల్మెట్‌లను ఉంచుకోవడానికి స్థలం ఉంది.

ఇది కాకుండా కొత్త Activa 7G కూడా హీరో ప్లెజర్ ప్లస్‌తో పోటీపడుతుంది. ఈ స్కూటర్ ధర రూ.68,098 నుంచి ప్రారంభమవుతుంది. ఇది 110 cc ఇంజిన్‌ను కలిగి ఉంది. దీని ధర రూ. 62,220 నుండి ప్రారంభమవుతుంది. ఇది మాత్రమే కాదు, కొత్త యాక్టివా సుజుకి యాక్సెస్‌కి కూడా గట్టి పోటీని ఇస్తుంది, దీని ధర రూ.79,400 నుండి ప్రారంభమవుతుంది. ఇందులో 125సీసీ ఇంజన్ కలదు.

Exit mobile version