Upcoming Electric Scooters: ఇవి మామూలు బండ్లు కాదయ్యా.. ఎక్స్ఎల్‌ ఈవీతో పాటు అదిరిపోయే స్కూటర్లు వస్తున్నాయ్..!

Upcoming Electric Scooters: దేశంలో కార్లకంటే ఎలక్ట్రిక్ వాహనాలను ఎక్కువగా వాడుతుంటారు. అందుబాటులో ధరకు రావడమే కాకుండా మంచి రేంజ్, స్టైలిష్ లుక్, డిజైన్‌లో ఉంటాయి. ముఖ్యంగా చిన్నచిన్న గమ్యాలను చేరుకోవడం కోసం ఈవీలు ప్రయాణ సాధనాలుగా మారిపోయాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని కంపెనీలు మార్కె‌ట్లో రోజుకో మోడల్‌ను విడుదల చేస్తున్నాయి. అయితే గత రెండేళ్ల క్రితం విద్యుత్ వాహనాలను జనాలు పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఈ మధ్య కాలంలో వాటి డిమాండ్ వేగంగా పెరిగింది. రానున్న రోజుల్లో హోండా, టీవీఎస్, సుజుకీ  ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాయి.

Suzuki Burgman EV
సుజుకి దేశంలో తన ప్రసిద్ధ స్కూటర్ బర్గ్‌మ్యాన్ ఎలక్ట్రిక్ వేరియంట్‌ను తీసుకొస్తుంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ని ప్రతి సంవత్సరం 25,000 యూనిట్లు విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతానికి దాని బ్యాటరీ, రేంజ్ బయటకు రాలేదు. దీని రేంజ్ సుమారు 90 కి.మీ-110 కిమీ ఉంటుంది. దీని ధర దాదాపు రూ. 1 లక్ష వరకు ఉండచ్చు.

TVS Jupiter EV
టీవీఎస్ మోటార్ ఇప్పుడు తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ జూపిటర్‌ను త్వరలో విడుదల చేయనుంది. వచ్చే ఏడాది ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో జూపిటర్ EVని ప్రవేశపెట్టవచ్చు. ఈ ఎక్స్‌పో జనవరి 17-22 వరకు ఢిల్లీలో జరగనుంది. వచ్చే నెలలో TVS మోటార్ తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ జూపిటర్‌ను ఆవిష్కరించనుంది. అయితే దీని ధర మార్చి 2025లో వెల్లడికానుంది.

ప్రస్తుతం ఉన్న జూపిటర్‌తో పోలిస్తే, కొత్త EV జూపిటర్ డిజైన్‌లో కొత్తదనం కనిపిస్తుంది. రోజువారీ వినియోగానికి అనుగుణంగా టీవీఎస్ ఈ కొత్త స్కూటర్‌ను సిద్ధం చేస్తుంది. ప్రస్తుతానికి ఈ స్కూటర్ ధర, దాని బ్యాటరీ, రేంజ్ గురించి ఎటువంటి సమాచారం అందలేదు. అయితే ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ, రేంజ్ కంపెనీ ప్రస్తుతం ఉన్న iqube ఎలక్ట్రిక్ స్కూటర్ కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

TVS XL EV
టీవీఎస్ XL ఎలక్ట్రిక్ మోడల్‌ను కూడా మార్కెట్లో విడుదల చేయడానికి కంపెనీ సన్నాహాలు చేస్తోంది. సమాచారం ప్రకారం కంపెనీ దాని కోసం రెండు పేర్లను ట్రేడ్‌మార్క్ చేసింది. ఇందులో XL EV, E-XL ఉన్నాయి. కంపెనీ ఈ కొత్త స్కూటర్లను రాబోయే 2025 ఇండియా ఎక్స్‌పోలో ప్రవేశపెడుతుందని భావిస్తున్నారు. దాని అధికారిక లాంచ్ కొత్త సంవత్సరం మొదటి త్రైమాసికంలో అంటే మార్చి 2025లో ఉండొచ్చు.

Honda Activa EV
ఈ స్కూటర్ పూర్తిగా ప్రస్తుతం ఉన్న యాక్టివాపై ఆధారపడి ఉంటుంది. ఈ స్కూటర్ ద్వారా కంపెనీ మాస్ సెగ్మెంట్లో తన పట్టును బలోపేతం చేసుకోనుంది. వచ్చే ఏడాది జరిగే ఆటో ఎక్స్‌పోలో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ప్రదర్శించిన తర్వాత దానిని మధ్యలో విడుదల చేయవచ్చు.

ఇది వివిధ బ్యాటరీ ప్యాక్‌లతో అందించనుంది. హోండా యాక్టివా EVలో కంపెనీ రెండు బ్యాటరీ ప్యాక్‌లతో వస్తుంది.  ఒక్కసారి ఛార్జింగ్‌పై 100 నుండి 150 కిలోమీటర్ల రేంజ్ అందించగలదు. కర్నాటక, గుజరాత్‌లలో యాక్టివా EV ఉత్పత్తి కోసం హోండా ప్రత్యేక సెటప్‌లను ఏర్పాటు చేసింది. హోండా తన ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రూ. 1 లక్షకు విడుదల చేయవచ్చు.