Honda Recall: హోండా మోటార్‌సైకిల్, స్కూటర్ ఇండియా (HMSI) అడ్వెంచర్ టూరర్ మోటార్‌సైకిల్ ఆఫ్రికా ట్విన్‌లో కొంత లోపం ఏర్పడింది. దీని కారణంగా కంపెనీ ఈ బైక్‌ను రీకాల్ చేసింది. జపనీస్ టూ-వీలర్ తయారీదారు తప్పుగా ఉన్న ECU ప్రోగ్రామింగ్ కారణంగా ప్రభావితమైన మోటార్‌సైకిళ్లను రీకాల్ చేసింది. దీని వలన లాంచ్ కంట్రోల్ సిస్టమ్ పనిచేయకపోవచ్చు. ప్రభావిత బైక్‌లు ఫిబ్రవరి 2022, అక్టోబర్ 2022 మధ్య ఉత్పత్తయ్యాయి. హోండా ఆఫ్రికా ట్విన్ కోసం ఈ రీకాల్ కేవలం భారత మార్కెట్‌కే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉంది.
ప్రస్తుతానికి ద్విచక్ర వాహన తయారీదారు ప్రభావితమైన మోటార్‌సైకిళ్ల సంఖ్యను ఖచ్చితంగా వెల్లడించలేదు. అయితే ప్రభావితమైన హోండా ఆఫ్రికా ట్విన్ మోటార్‌సైకిల్స్‌లో ప్రోగ్రామింగ్ గ్లిచ్ ఉందని, అది థొరెటల్ చర్యకు అంతరాయం కలిగించవచ్చని చెప్తున్నారు. ఈ లోపం వల్ల యాక్సిలరేషన్ సమయంలో వీలీ కంట్రోల్‌ని అకస్మాత్తుగా యాక్టివేట్ చేయవచ్చు. ఇది బైక్ నియంత్రణ కోల్పోయి పెద్ద ప్రమాదానికి దారి తీస్తుంది.
ఆటో కంపెనీ సరైన ప్రోగ్రామింగ్‌తో ప్రభావితమైన మోటార్‌సైకిళ్ల ECUని అప్‌డేట్ చేస్తుంది. BigWing Topline డీలర్‌షిప్‌ల వద్ద వారంటీ లేకుండా కూడా కంపెనీ ప్రభావితమైన మోటార్‌సైకిళ్లను ఉచితంగా రిపేర్ చేస్తుంది. హోండా ఆఫ్రికా ట్విన్ యజమానులు అధికారిక BigWing వెబ్‌సైట్‌లో వారి వాహన గుర్తింపు సంఖ్య (VIN)ని సడ్మిట్ చేయడం ద్వారా ఈ రీకాల్‌లో తమ మోటార్‌సైకిళ్లు ఉన్నాయో లేదో తనిఖీ చేయవచ్చు.
ఇటీవలి కాలంలో HMSI అనేక మోటార్‌సైకిల్ మోడల్‌లతో కూడిన అనేక రీకాల్ ప్రచారాలను విడుదల చేసింది. ఈ నెల ప్రారంభంలో టూ-వీలర్ మేజర్ భారతదేశంలో GL1800 గోల్డ్ వింగ్ టూరర్ కోసం రీకాల్ జారీ చేసింది. కొన్ని ఇంజిన్ల డ్రైవ్ గేర్ ఫాస్టెనింగ్ బోల్ట్‌లో సమస్య కారణంగా హోండా గోల్డ్ వింగ్‌ను రీకాల్ చేస్తున్నట్లు బైక్ తయారీదారు తెలిపారు. మార్చి 2018, మే 2021 మధ్య తయారు చేసిన కొన్ని హోండా గోల్డ్ వింగ్ మోటార్‌సైకిళ్లను రీకాల్ కవర్ చేసింది.
ఇది కాకుండా ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో HMSI తన CB350, H’ness CB350 మోటార్‌సైకిళ్లలో కొన్నింటిని రీకాల్ చేసింది. వీల్ స్పీడ్ సెన్సార్‌లకు సంబంధించిన సమస్యల కారణంగా ఇది అక్టోబర్ 2020, ఏప్రిల్ 2024 మధ్య రీకాల్ చేసింది. వీల్ స్పీడ్ సెన్సార్ సమస్యల కారణంగా అక్టోబర్ 2020, ఏప్రిల్ 2024 తయారు చేసిన CB300F, CB300R, CB350, H’ness CB350, CB350RS మోటార్‌సైకిళ్లను కంపెనీ రీకాల్ చేసినట్లు తెలిపారు.
అంతకుముందు 2022లో, HMSI భారతదేశంలోని మూడు మోటార్‌సైకిళ్లకు రీకాల్ జారీ చేసింది. ఇందులో CRF1100 ఆఫ్రికా ట్విన్, CBR1000RR-R ఫైర్‌బ్లేడ్, GL1800 గోల్డ్ వింగ్ టూర్ మోటార్‌సైకిళ్లు ఉన్నాయి. PGM-FI యూనిట్ లేదా ఫ్యూయల్ ఇంజెక్షన్ యూనిట్‌లో సమస్య ఉందని హోండా గుర్తించింది. దీని కారణంగా ఇంజిన్ నడుస్తున్నప్పుడు ఆగిపోవచ్చు.