Honda Elevate Black Edition: హోండా ఎలివేట్ బ్లాక్ ఎడిషన్లను లాంచ్ చేసింది. ఇది బ్లాక్ , సిగ్నేచర్ బ్లాక్ అనే రెండు వేరియంట్లలో వస్తుంది. ఈ రెండూ కొత్త క్రిస్టల్ బ్లాక్ పెర్ల్ ఎక్ట్సీరియర్ కలర్‌లో తీసుకొచ్చారు. బ్లాక్ ఎడిషన్ టాప్-స్పెక్ ZX వేరియంట్‌పై ఆధారపడి ఉంటుంది. దీనిలో మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లు ఉంటాయి. వాటి బుకింగ్ కూడా ఈరోజు నుంచే ప్రారంభమైంది. హోండా ఎలివేట్ బ్లాక్ ఎడిషన్స్ CVT వేరియంట్ డెలివరీ జనవరి నుండి ప్రారంభమవుతుంది. అయితే మాన్యువల్ వేరియంట్ డెలివరీ ఫిబ్రవరి నుండి ప్రారంభమవుతుంది.
Honda Elevate Black Edition
హోండా ఎలివేట్ బ్లాక్ ఎడిషన్ కొన్ని కాస్మోటిక్ మార్పులతో ఉంటుంది. ఇది బ్లాక్-అవుట్ అల్లాయ్ వీల్స్, టెయిల్‌గేట్‌పై ‘బ్లాక్ ఎడిషన్’ బ్యాడ్జ్‌ను పొందుతుంది. ఎగువ గ్రిల్‌పై క్రోమ్ గార్నిష్, సిల్వర్-ఫినిష్డ్ స్కిడ్ ప్లేట్, సిల్వర్ రూఫ్ రెయిల్స్, డోర్‌లపై సిల్వర్ గార్నిష్ మునుపటిలా అలాగే ఉంటాయి. ఇది బ్లాక్ లెథెరెట్ సీట్ అప్హోల్స్టరీతో పూర్తిగా నలుపు రంగు క్యాబిన్‌ను కలిగి ఉంది. అదే సమయంలో, డోర్ ప్యాడ్‌లు, ఆర్మ్‌రెస్ట్, ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ చుట్టూ బ్లాక్ యాక్సెంట్‌లు ఇచ్చారు.
Honda Elevate Signature Black Edition
హోండా ఎలివేట్ సాధారణ బ్లాక్ ఎడిషన్‌తో పోలిస్తే, సిగ్నేచర్ బ్లాక్‌లో ఆల్-బ్లాక్ గ్రిల్, స్కిడ్ ప్లేట్లు, డోర్‌లపై బ్లాక్ గార్నిష్, బ్లాక్ రూఫ్ ట్రాక్‌లు, ఫెండర్‌లపై ‘సిగ్నేచర్’ ఎడిషన్ బ్యాడ్జ్‌తో పాటు ‘బ్లాక్ ఎడిషన్’ ఉన్నాయి. ‘టెయిల్‌గేట్‌పై బ్యాడ్జ్ ఉంది. ఇంటీరియర్‌లో కూడా 7-కలర్ యాంబియంట్ లైటింగ్ అందించారు.
హోండా ఎలివేట్‌లో అందుబాటులో ఉన్న అదే ఫీచర్లు దాని బ్లాక్ ఎడిషన్‌లో కూడా అందుబాటులో ఉంటాయి. ఇందులో మీరు వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లేతో 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్, 7-అంగుళాల సెమీ-డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే ఫీచర్లు పొందుతారు. ఆటోమేటిక్ AC, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, సింగిల్-పేన్ సన్‌రూఫ్, పుష్-బటన్ స్టార్ట్/స్టాప్ వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.
ప్రయాణీకుల భద్రత కోసం, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), హిల్ స్టార్ట్ అసిస్ట్, లాన్‌వాచ్ కెమెరా, వెహికల్ స్టెబిలిటీ అసిస్ట్, రియర్ పార్కింగ్ కెమెరా, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్-కీపింగ్ అసిస్ట్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, ఆటోమేటిక్ హై-బీమ్ అసిస్ట్ వంటి ADAS ఫీచర్లు చూడచ్చు.
హోండా ఎలివేట్ బ్లాక్ ఎడిషన్ పెట్రోల్ వేరియంట్‌లో మాత్రమే ప్రవేశపెట్టారు. ఇందులో 1.5-లీటర్ N/A పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది 121 పిఎస్ పవర్, 145 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ మాన్యువల్, 7-స్పీడ్ CVT ట్రాన్స్‌మిషన్‌తో ఇంజన్ ఉంటుంది. మాన్యువల్ వేరియంట్ 15.31 kmpl , CVT వేరియంట్ 16.92 kmpl మైలేజీని ఇస్తుందని కంపెనీ పేర్కొంది.
Honda Elevate Black Edition Price
ZX MT – రూ. 15.51 లక్షలు (ఎక్స్-షోరూమ్)
ZX CVT – రూ. 16.73 లక్షలు (ఎక్స్-షోరూమ్)
Honda Elevate Signature Black Edition Price
ZX MT – రూ. 15.71 లక్షలు (ఎక్స్-షోరూమ్)
ZX CVT – రూ. 16.93 లక్షలు (ఎక్స్-షోరూమ్)
హోండా ఎలివేట్ బ్లాక్ ఎడిషన్ భారత మార్కెట్లో హ్యుందాయ్ క్రెటా నైట్ ఎడిషన్, కియా సెల్టోస్ ఎక్స్-లైన్‌తో పోటీపడుతుంది. అదే సమయంలో, ఇది వోక్స్‌వ్యాగన్ టైగన్, మారుతి గ్రాండ్ విటారా, స్కోడా కుషాక్‌లకు కూడా ఒక ఎంపికగా నిలిస్తుంది.