Honda Flex Fuel Bike: హోండా కొత్త ప్రయోగం.. దేశంలో మొదటి ఫ్లెక్స్ ఫ్యూయల్ బైక్ లాంచ్.. మైలేజ్ ఎంతంటే?

Honda Flex Fuel Bike: హోండా సిబి300ఎఫ్ ఫ్లెక్స్ ఫ్యూయల్ భారత్‌లోకి వచ్చింది. ఈ బైక్ గురించి ఆటో ఇండస్ట్రీలో నిరంతరం చర్చలు జరుగుతున్నాయి.ఈ బైక్‌ను స్పోర్ట్స్ రెడ్, మ్యాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్ కలర్‌లో తీసుకొచ్చారు. బైక్ ఎక్స్-షో రూమ్ ధర రూ.1.70 లక్షలు. ఇప్పుడు ఈ బైక్‌తో కస్టమర్‌లకు ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి? ఈ బైక్ ఎంత? దీని సేల్స్ ఎప్పుడు ప్రారంభమవుతాయి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఇప్పుడు తెలుసుకుందాం.

కొత్త హోండా CB 300Fలో ఒక వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ బైక్‌ను స్పోర్ట్స్ రెడ్, మ్యాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్ కలర్‌లో విడుదల చేశారు. ఈ బైక్ ఎక్స్-షోరూమ్ ధర రూ.1.70 లక్షలు. కంపెనీ ప్రకారం కొత్త హోండా CB 300F ఈ నెల చివరి వారం నుండి హోండా బిగ్ వింగ్ డీలర్‌షిప్‌లో అమ్మకానికి రానుంది.

Honda CB30F Bike Features
కొత్త హోండా CB300F బైక్ గురించిన ముఖ్యమైన విషయం ఏమిటంటే. దీన్ని ఫ్లెక్స్ ఫ్యూయల్‌తో నడపవచ్చు. ఈ బైక్‌ను 85 ఫ్లెక్స్ ఫ్యూయల్‌తో సులభంగా నడపవచ్చు. దీని కారణంగా 85 శాతం ఫ్లెక్స్ ఫ్యూయల్,  15 శాతం పెట్రోల్‌తో నడపగలిగే ేశంలోనే మొదటి బైక్‌గా నిలిచింది.

ఈ బైక్‌లో చాలా మంచి ఫీచర్లు ఉన్నాయి. ముందు, వెనుక డిస్క్ బ్రేక్‌లతో కూడిన డ్యూయల్ ఛానల్ ఏబీఎస్, 5 స్టెప్స్ అడ్జస్టబుల్ రియర్ మోనోషాక్ సస్పెన్షన్, ఎల్ఈడీ లైట్లు, ఫుల్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఇంటెలిజెంట్ ఇథనాల్ ఇండికేటర్ వంటి ఫీచర్లు అందించారు.

హోండా CB300F ఫ్లెక్స్ ఫ్యూయల్ 293.92cc ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది ఆయిల్ కూల్డ్ ఫోర్ స్ట్రోక్, సింగిల్ సిలిండర్ ఇంజన్‌తో వస్తుందది. దీని కారణంగా ఇది 18.3 kW పవర్, 25.9 Nm టార్క్ రిలీజ్ చేస్తుంది. ఇది ఆరు స్పీడ్ గేర్‌బాక్స్‌తో లింకై ఉంటుంది. దీనిలో స్లిప్పర్ క్లచ్ చూస్తారు.

కొత్త హోండా CB 300F ఫ్లెక్స్ ఫ్యూయల్ బైక్ 300 సీసీ బైక్‌లతో నేరుగా పోటీపడుతుంది. వీటిలో కవాసకి నింజా 300, కేటీఎమ్, టీవీఎస్ ఆర్‌టీఆర్ 310 వంటి బైక్‌లకు  స్ట్రాంగ్ కాంపిటీటర్‌గా నిలుస్తుంది.