New Honda Amaze: కొత్త హోండా అమేజ్‌.. ఇది మామూలు కారు కాదు బాబోయ్.. కొత్త డిజైర్‌‌తోనే పోటీ..!

New Honda Amaze: హోండా కార్స్ ఇండియా తన ఫోర్త్ జనరేషన్ సెడాన్ కారు అమేజ్‌ను వచ్చే నెల 4వ తేదీన విడుదల చేయనుంది. కొత్త అమేజ్ ఇప్పుడు నేరుగా డిజైర్‌తో పోటీపడుతుంది. ఈసారి హోండా కొత్త అమేజ్‌లో చాలా పెద్ద మార్పులు చేసింది. కారును అత్యాధునిక డిజైన్, సరికొత్త టెక్నాలజీ, లుక్‌లో చూడొచ్చు. అయితే లాంచ్ చేయడానికి ముందు కంపెనీ ఈ కారు స్కెచ్‌ను విడుదల చేసింది. దీనిలో కారు ఎక్స్‌టీరియర్ నుంచి ఇంటీరియర్ వరకు దాని  డిజైన్ గురించి తెలుసుకోవచ్చు. కొత్త అమేజ్ ఇప్పుడు డిజైర్‌తో సహా ఇతర కార్లకు గట్టి పోటీని ఇవ్వగలదు. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఫీచర్ల గురించి చెప్పాలంటే కొత్త హోండా అమేజ్‌లో అనేక అధునాతన ఫీచర్లను చూడచ్చు. ఈ కారులో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, టైప్-సి ఛార్జింగ్ పోర్ట్‌లు, వైర్‌లెస్ ఛార్జర్, క్రూయిజ్ కంట్రోల్, సెంటర్ కన్సోల్‌లో కప్ హోల్డర్లు, 12V పవర్ అవుట్‌లెట్, ADS ఫీచర్లకు సపోర్ట్ ఉంటుంది. పవర్ కోసం కొత్త అమేజ్ 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను పొందుతుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్, CVT గేర్‌బాక్స్ ఎంపికలతో వస్తుంది. లాంచ్ తర్వాత కొత్త అమేజ్ మారుతి సుజుకి డిజైర్, హ్యుందాయ్ ఆరా, టాటా టిగోర్ వంటి వాటితో పోటీపడుతుంది.

కొత్త తరం హోండా అమేజ్ డిసెంబర్ 4, 2024న భారతదేశంలో అధికారికంగా విడుదలవుతుంది. కొత్త అమేజ్ ధరకు సంబంధించి ఇంకా ఎలాంటి సమాచారం అందలేదు కానీ రూ. 7 లక్షల లోపు విడుదల చేయవచ్చని అంచనా వేస్తున్నారు.

హోండా అమేజ్ కంటే ముందు మారుతి సుజుకి తన కొత్త డిజైర్‌ను భారతదేశంలో విడుదల చేసింది. ఈ కారు ధర రూ.6.79 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇంజన్ గురించి మాట్లాడితే కొత్త మారుతి డిజైర్ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ని కలిగి ఉంది. ఈ ఇంజన్ 82 పీఎస్ హార్స్ పవర్, 112 ఎన్ఎమ్ పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-మాన్యువల్, 5-ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేసి ఉంటుంది.

అదే సమయంలో దాని CNG పవర్‌ట్రెయిన్‌తో ఆప్షనల్ హైబ్రిడ్ పెట్రోల్ 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో మాత్రమే అందుబాటులో ఉంటుంది. కొత్త డిజైర్ భద్రతలో 5 స్టార్ రేటింగ్ పొందిన కంపెనీ మొదటి కారు. భద్రత కోసం ఈ కారులో EBD, ఎయిర్ బ్యాగ్‌లు, రెక్ అసిస్ట్, 3 పాయింట్ సీట్ బెల్ట్‌తో పాటు యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. డిజైన్ పరంగా కొత్త డిజైర్ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.