Honda Elevate New Milestone: హోండా కార్స్ ఇండియా ప్రముఖ కార్ల తయారీ సంస్థ. దేశీయ విపణిలో కంపెనీ విక్రయిస్తున్న కార్లలో ‘Elevate SUV’ టాప్ పొజిషన్లో ఉంటుంది. ఈ కారుకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉండడంతో కార్ ప్రియులు ఎక్కువగా కొంటున్నారు. ప్రస్తుతం ఈ కారు విక్రయాల్లో హోండా కంపెనీ పెద్ద రికార్డు సృష్టించింది. రండి.. దాని గురించి మరింత సమాచారం తెలుసుకుందాం.
Hond Elevate Highlights
ఈ కారులో 5 సీట్లు, 6 ఎయిర్‌బ్యాగ్స్ ఉన్నాయి. నాలుగు వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. ఎక్స్‌టీరియర్ బాక్సీ షేప్‌లో ఉంటుంది. ఎలివేట్ ఎస్‌యూవీలో 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంది. కారు లీటర్‌పై 15.31 నుండి 16.92 kmpl వరకు మైలేజీని కూడా అందిస్తుంది.
Hond Elevate Sales
ప్రపంచవ్యాప్తంగా హోండా కార్స్ ఇండియా మిడ్-సైజ్ ఎస్‌యూవీ ఎలివేట్‌ను 1 లక్ష యూనిట్లకు పైగా విక్రయించింది. దేశీయంగా 53,326 యూనిట్లు విక్రయించగా, విదేశాలకు 47,653 యూనిట్లు ఎగుమతి అయ్యాయి. ఈ కారు దేశంలోనే కాకుండా జపాన్, దక్షిణాఫ్రికా, భూటాన్ , నేపాల్‌లో కూడా అమ్ముడవుతోంది.
Hond Elevate Features
హోండా ఎలివేట్ ఎస్‌యూవీ సరసమైన ధరలో కొనడానికి అందుబాటులో ఉంది. దీని ధర కనిష్టంగా రూ.11.91 లక్షల నుంచి గరిష్టంగా రూ.16.73 లక్షల ఎక్స్-షోరూమ్ వరకు ఉంటుంది. SV, V, VX, ZX అనే ఆకర్షణీయమైన వేరియంట్స్ ఎలివేట్‌లో ఉన్నాయి.
ఈ కారు బయట భాగం బాక్సీ ఆకారంలో ఉంటుంది. కారు పొడవు 4312 మిమీ, వెడల్పు 1790 మిమీ, ఎత్తు 1650 మిమీ, వీల్‌బేస్ 2650 మిమీ. ఫీనిక్స్ ఆరెంజ్ పెర్ల్, రేడియంట్ రెడ్ మెటాలిక్, ప్లాటినం వైట్ పెర్ల్‌తో సహా అనేక రకాల కలర్ ఎంపికలలో కూడా అందుబాటులో ఉంది.
కొత్త ఎలివేట్ ఎస్‌యూవీలో 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంది. ఈ ఇంజన్ 121 పిఎస్ హార్స్ పవర్, 145 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 6-స్పీడ్ మ్యాన్యువల్/ CVT ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఉంది. ఎలివేట్ లీటర్‌పై 15.31 నుండి 16.92 kmpl మైలేజీని కూడా అందిస్తుంది.
ఈ కొత్త కారులో 5 సీట్లు, ఎక్కువ లగేజీని తీసుకువెళ్లడానికి 458 లీటర్ల బూట్ స్పేస్ ఉంది. ఇందులో 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 7-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, సన్‌రూఫ్ వంటి వివిధ ఫీచర్లు ఉన్నాయి.
కొత్త హోండా ఎలివేట్ ఎస్‌యూవీలో ప్రయాణీకుల భద్రత కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు,ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ చూడచ్చు. ఈ కారుకు బలమైన పోటీ కియా సెల్టోస్, మారుతి సుజుకి గ్రాండ్ విటారా, టయోటా ఫార్చ్యూనర్, సిట్రస్ సి3 ఎయిర్‌క్రాస్, స్కోడా కుషాక్ ఎస్‌యూవీతో ఉంటుంది.