Site icon Prime9

2025 Honda Shine 125 Launched: పేద-మధ్యతరగతి వారికి పండగే.. కొత్త హోండా షైన్.. మైలేజ్ బాగా పెంచేశారు గురూ!

2025 Honda Shine 125 Launched

2025 Honda Shine 125 Launched: హోండా స్కూటర్ అండ్ మోటార్‌సైకిల్ ఇండియా ఒక విశ్వసనీయ ద్విచక్ర వాహన తయారీ కంపెనీ.  గ్రామం నుండి ఢిల్లీ వరకు ఉన్న మాట ఇదే. ప్రస్తుతం 2025 షైన్ 125 బైకును గ్రాండ్‌గా విడుదల చేశారు. ఈ కొత్త మోటార్‌సైకిల్ అనేక ఆవిష్కరణలకు సాక్ష్యంగా ఉంది. ఆకర్షణీయమైన డిజైన్, ఫీచర్లు ఉన్నాయి. రండి.. దీని గురించి మరింత సమాచారం తెలుసుకుందాం.

కొత్త హోండా షైన్ 125 మోటార్‌సైకిల్ చాలా సరసమైన ధరలో అందుబాటులో ఉంది. దీని ధర రూ.84,493 ఎక్స్-షోరూమ్. డ్రమ్ బ్రేక్, డిస్క్ బ్రేక్ అనే రెండు అధునాతన వేరియంట్‌ల ఆప్షన్స్‌లో కూడా అందుబాటులో ఉంది. ఈ బైక్ 123.94 సిసి సింగిల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది. బైక్‌ను OBD2B స్టాండర్డ్స్‌కు అనుగుణంగా అప్‌గ్రేడ్ చేశారు. ఇది 10.63 బిహెచ్‌పి హార్స్ పవర్, 11 ఎన్ఎమ్ టార్క్‌ను రిలీజ్ చేస్తుంది. 5-స్పీడ్ గేర్‌బాక్స్‌ బైక్‌లో ఉంది. 55 kmpl వరకు మైలేజీని అందిస్తుంది.

కొత్త 2025 హోండా షైన్ 125 మోటార్‌సైకిల్ పాత షైన్ బైక్ మాదిరిగానే ఉంది. ఇది పెర్ల్ ఇగ్నియస్ బ్లాక్, జెనీ గ్రే మెటాలిక్, మ్యాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్, రెబెల్ రెడ్ మెటాలిక్, డీసెంట్ బ్లూ మెటాలిక్, పెరల్ సైరన్ బ్లూ అనే 6 ఆకర్షణీయమైన రంగులలో కూడా అందుబాటులో ఉంది. కొత్త హోండా షైన్ 125 బైక్ చాలా మంచి డిజైన్‌లో కనిపిస్తుంది. దీనిలో ఫుల్-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంది. ఇది రియల్ టైమ్ మైలేజీతో సహా వివిధ సమాచారాన్ని అందిస్తుంది. దీనికి USB టైప్-C ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంది.

మోటార్‌సైకిల్‌లో ఫ్రంట్, టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుక డ్యూయల్ రేర్ స్ప్రింగ్స్ సస్పెన్షన్ సెటప్ ఆప్షన్ ఉంది. ఇది భద్రత కోసం ముందు భాగంలో డ్రమ్/డిస్క్ బ్రేక్‌లు, వెనుక భాగంలో డ్రమ్ బ్రేక్‌లు ఉన్నాయి. రైడర్‌కు రోడ్డుపై గట్టి పట్టును అందించడానికి 90 mm వెడల్పు గల బ్యాక్ టైర్‌ ఉంది. అలాగే, హోండా షైన్ 125 బజాజ్ పల్సర్ 125, టీవీఎస్ రైడర్ 125, హీరో సూపర్ స్ప్లెండర్ 125 మోడళ్ల నుండి బలమైన పోటీనిస్తుంది. ఈ కొత్త షైన్ 125 మోటార్‌సైకిల్ దాని ఆకర్షణీయమైన డిజైన్, ఫీచర్ల కారణంగా రాబోయే రోజుల్లో మంచి సంఖ్యలో అమ్ముడవుతుందని భావిస్తున్నారు.

Exit mobile version
Skip to toolbar