Himalayan Recalled: ప్రముఖ ప్రీమియం బైక్స్ ఉత్పత్తి సంస్థ రాయల్ ఎన్ ఫీల్డ్ ట్రెండ్ కు తగ్గట్టు సరికొత్త బైక్స్ లాంచ్ చేస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటోంది. ఈ కంపెనీ అన్ని రకాల రోడ్ల కండిషన్స్ ను దృష్టిలో పెట్టుకుని వాహనాలను డిజైన్ చేస్తుంది. అలా వచ్చి అడ్వెంచర్ స్పెషల్ గా ‘హిమాలయన్’బాగా పాపులారిటీ తెచ్చుకుంది.
సుమారు 5000 యూనిట్లు(Himalayan Recalled)
అయితే ఇపుడా పాపులర్ హిమాలయన్ బైక్స్ ను రాయల్ ఎన్ ఫీల్డ్ (Royal Enfield) సంస్థ రీకాల్ చేసింది. సుమారు 5000 యూనిట్ల హియాలయన్ బైక్స్ కు రీకాల్ ప్రకటించింది సంస్థ.
యూఎస్ నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ ఇచ్చిన నివేదిక ప్రకారం ఈ నిర్ణయం తీసుకుంది రాయల్ కంపెనీ.
నివేదిక ప్రకారం.. వింటర్ లో రోడ్లను ట్రీట్ చేయడానికి ఉపయోగించే ఉప్పు.. బైక్ బ్రేక్ పనితీరును తగ్గిస్తుందని లేదా మొత్తం నష్టానికి కారణమవుతుందని తెలిపింది.
దీంతో 2017-2021 మధ్య రాయల్ ఎన్ ఫీల్డ్ తయారు చేసిన 4,891 యూనిట్ల హిమాలయన్ బైక్ లు ఎఫెక్ట్ అయ్యే అవకాశం కన్పిస్తోంది.
ఈ క్రమంలో కంపెనీ ముందుగానే రీకాల్ ప్రకటించింది. ఇందులో భాగంగా హిమాలయన్ వాహనాల ముందు, వెనుక బ్రేక్ కాలిపర్ లను రీ ప్లేస్ చేస్తారు.
అయితే, 2021 తర్వాత విడుదల అయిన బైక్ లకు ఎలాంటి ప్రభావం ఉండదు.
గతంలోనూ ఆ దేశాల్లో రీకాల్
కాగా, గతంలో కూడా హిమాలయన్‌కు(Himalayan) రీకాల్ ప్రకటించింది కంపెనీ. అప్పుడు యుకె, యూరప్, దక్షిణ కొరియా దేశాలలో ఈ రీకాల్ ఉంది. ఇప్పుడు అదే సమస్యకు గాను అమెరికాలో ఈ రీకాల్ ప్రకటించారు.
అయితే భారత్ లో ఈ మోడల్ బైకులకు రీకాల్ ప్రకటించడంపై కంపెనీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
ఇప్పటివరకు భారత్ లో ఈ బైకులకు ఎలాంటి సమస్య నమోదు కాకపోవడం గమనార్హం.