Site icon Prime9

Upcoming Hero Bikes: దూసుకొస్తున్న హీరో.. త్వరలో మూడు కొత్త బైకులు లాంచ్.. ఫీచర్లపై ఓ లుక్కేయండి!

Upcoming Hero Bikes

Upcoming Hero Bikes

Upcoming Hero Bikes: అంతర్జాతీయ మోటార్‌సైకిల్, యాక్సెసరీస్ ఎగ్జిబిషన్ EICMA 2024  మిలన్‌ ఇటలీలో ప్రారంభమైంది. దీనిలో ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ కంపెనీ హీరో మోటోకార్ప్ తన 3 కొత్త ICE ఉత్పత్తులను ఆవిష్కరించింది. ఇందులో కరిజ్మా XMR 250, Xtreme 250R, Xpulse 210 ఉన్నాయి. వీటిలో సరికొత్త హెడ్‌ల్యాంప్‌లు, డీఆర్ఎల్‌లు ఉంటాయి. ఈ నేపథ్యంలో ఈ మూడు బైక్స్ గురించి వివరంగా తెలుసుకుందాం.

Hero Karizma XMR 250
హీరో కరిజ్మా XMR 250ని ఇప్పటికే ఉన్న XMR 210కి అధునాతన వెర్షన్‌గా పరిచయం చేసింది. డిజైన్ గురించి మాట్లాడితే ఇంటిగ్రేటెడ్ వింగ్‌లెట్‌లు, స్ప్లిట్ LED హెడ్‌ల్యాంప్ యూనిట్, ఎయిర్ కర్టెన్‌లతో సొగసైన బాడీవర్క్‌తో కొత్త గ్రాఫిక్స్ ఉంటాయి.

ఇది కాకుండా కొత్త కరిజ్మా ఇప్పుడు మరింత శక్తివంతమైన ఇంజన్‌ని పొందింది. కరిజ్మా XMR 250కి 250 cc సింగిల్-సిలిండర్ లిక్విడ్-కూల్డ్ ఫ్యూయల్-ఇంజెక్ట్ పవర్‌ట్రెయిన్ చూడొచ్చు. ఈ ఇంజన్ గరిష్టంగా 30 బీహెచ్‌పీ హార్స్ పవర్, 25 ఎన్ఎమ్ పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఇది 6 స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌తో ఉంటుంది.

Hero Xtreme 250R
హీరో తన స్ట్రీట్‌ఫైటర్ మోటార్‌సైకిల్‌ను కొత్త వేరియంట్‌లో పరిచయం చేసింది. దీన్ని Xtunt 2.5R కాన్సెప్ట్ ఆధారంగా రూపొందారు. హీరో  మొదటి 250cc బైక్‌లో LED DRL, సొగసైన కట్‌లు, స్టైలిష్ స్వింగ్ ఆర్మ్‌లతో కూడిన యాంగిల్ LED హెడ్‌ల్యాంప్‌లు ఉన్నాయి.

Xpulse 210
ఎక్స్‌ట్రీమ్ 250Rకి శక్తినిచ్చే కొత్త 250cc సింగిల్-సిలిండర్ లిక్విడ్-కూల్డ్ పెట్రోల్ ఇంజన్ ఇన్‌స్టాల్ చేశారు. ఈ పవర్‌ట్రెయిన్ గరిష్టంగా 30 బీహెచ్‌పీ పవర్, 25 ఎమ్ఎమ్ పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఇది 6-స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌తో పరిచయం చేశారు.

హీరో ఇది స్టాండర్డ్ మోడల్ వలె అదే ట్యూబులర్ హ్యాండిల్‌బార్, సింగిల్-పీస్ సీటును పొందుతుంది. ర్యాలీ కిట్‌తో దీన్ని మార్కెట్లోకి విడుదల చేయాలని భావిస్తున్నారు. దీనిలో కరిజ్మా XMR 210cc సింగిల్-సిలిండర్ లిక్విడ్-కూల్డ్ ఇంజన్‌ అందించారు. అయితే ఈ పవర్‌ట్రెయిన్ రీట్యూన్ చేయనుంది. ఈ మోటార్ ఇప్పుడు 24.6 బిహెచ్‌పి పవర్, 20.7 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగలదు. ఇది 6-స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌తో ఉంటుంది.

Exit mobile version