Hero Motocorp: హీరో లవర్స్‌కు షాకింగ్ న్యూస్.. ఆ మూడు బైక్స్ కొనలేరు.. అవేంటో తెలుసా..?

Hero Motocorp: హీరో మోటోకార్ప్‌లో ఎంట్రీ లెవల్ బైక్‌ల నుండి ప్రీమియం సెగ్మెంట్ వరకు బైకులు ఉన్నాయి. వీటిలో కొన్ని బైకులు అమ్మకాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. అలానే కొన్ని బైకుల అమ్మకాలు చాలా దారుణంగా పడిపోయాయి. ఈ నేపథ్యంలోనే హీరోకార్ప్ తన కస్టమర్లకు పెద్ద షాక్ ఇచ్చింది. ఇండియన్ మార్కెట్లో కంపెనీ మూడు బైక్‌లను పూర్తిగా నిలిపివేసింది. ఇప్పుడు మీరు Hero Xpulse 200T 4V, Xtreme 200S 4V, Passion Xtecలను కొనుగోలు చేయలేరు. కంపెనీ తన వెబ్‌సైట్ నుండి కూడా తొలగించింది. ఈ మూడు బైక్‌ల ధర, ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.

Hero Fashion Xtec
హీరో ప్యాషన్ ఎక్స్-టెక్ స్టైలిష్ ఎంట్రీ లెవల్ బైక్. కానీ రైడింగ్ సమయంలో ఈ బైక్ బ్యాలెన్స్ అంత సరిగా ఉండదు. ఇంజన్ గురించి మాట్లాడితే బైక్‌కు 113.2cc, సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్, ఫ్యూయల్-ఇంజెక్ట్ ఇంజిన్ ఉంది. ఇది 9.15 పిఎస్ పవర్, 9.79 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని ఇంజన్ 4-స్పీడ్ గేర్‌బాక్స్‌తో అటాచ్ చేసి ఉంటుంది. ఈ బైక్ డ్రమ్ బ్రేక్, డిస్క్ బ్రేక్‌తో సహా రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. బైక్‌లో బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన డిజిటల్ స్పీడోమీటర్ ఉంది. బైక్‌లో USB ఛార్జింగ్ పోర్ట్ కూడా అందించారు. బైక్ సీటు బాగా లేదు. దీని మెయింట్నెస్, రైడ్ క్వాలిటీ నిరాశపరిచింది.

Xtreme 200S 4V
హీరో మోటోకార్ప్ ఈ ఫుల్-ఫెయిర్డ్ స్పోర్ట్స్ బైక్ డిజైన్ బాగుంది. అయితే దీని రైడ్, హ్యాండ్లింగ్ కస్టమర్‌లను ఆకర్షించలేకపోయాయి. ఈ బైక్‌లో 199.6 సీసీ ఇంజన్ ఉంది, ఇది 18.08 పీఎస్ పవర్, 16.15 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. బైక్‌లో 17-అంగుళాల వీల్స్, డైమండ్-టైప్ ఫ్రేమ్, టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుకవైపు మోనోషాక్ ఉన్నాయి. ఇందులో ఫుల్-ఫెయిర్డ్ డిజైన్, స్లీప్ LED హెడ్‌ల్యాంప్ మోటార్‌సైకిల్‌కు స్పోర్టీ అప్పీల్ ఇచ్చింది. ఇది క్లిప్-ఆన్ హ్యాండిల్‌బార్లు, వెనుక-సెట్ ఫుట్‌పెగ్‌లను కలిగి ఉంది. ఇది బైక్‌కు స్పోర్టి, సౌకర్యవంతమైన రైడింగ్ ఫీల్ ఇస్తుంది. ఇందులో ఫుల్-ఫెయిర్డ్ డిజైన్, స్లీప్ LED హెడ్‌ల్యాంప్ మోటార్‌సైకిల్‌కు స్పోర్టీ అప్పీల్ ఇచ్చింది.

Hero Xpulse 200T 4V
Xpulse 200T 4V ఒక స్ట్రీట్ బైక్‌గా వచ్చింది. ఈ బైక్‌ను ఆఫ్-రోడింగ్ కోసం ఎక్కువగా ఉపయోగించారు. ఇంజిన్ గురించి మాట్లాడితే బైక్‌లో 200cc సింగిల్-సిలిండర్, ఎయిర్/ఆయిల్-కూల్డ్, ఫోర్-వాల్వ్ ఇంజన్ అందించారు. ఇది 19 పీఎస్ పవర్‌ని, 17.35 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో ఉంటుంది.ః

ఈ బైక్‌లో ముందువైపు LED DRLలతో రౌండ్ LED హెడ్‌ల్యాంప్, LED టెయిల్ ల్యాంప్,  ఫుల్-LCD ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ ఉన్నాయి. రైడర్ల సౌలభ్యం కోసం, ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌లో స్పీడోమీటర్, టాకోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్, రియల్ టైమ్ రైడింగ్ డేటా డిస్‌ప్లే అందించారు. ఇది ఇన్‌కమింగ్ కాల్,ఎస్ఎమ్ఎస్ అలర్ట్స్, టర్న్-బై-టర్న్ నావిగేషన్ కోసం బ్లూటూత్ కనెక్టివిటీని కూడా అందించారు. ఇది మంచి బైక్‌గా తన స్థానాన్ని సంపాదించుకోవడంలో కూడా విజయం సాధించింది, కానీ తరువాత దాని అమ్మకాలు తగ్గడం ప్రారంభించాయి.