Hero Surge S32 Electric Vehicle: అద్భుతం చేశారు.. రూపం మార్చుకొనే ఎలక్ట్రిక్ ఆటో.. ధర తెలిస్తే వెంటనే కొంటారు..!

Hero Surge S32 Electric Vehicle: హీరో మోటోకార్ప్ భారతీయ ద్విచక్ర వాహన మార్కెట్‌లో ఆధిపత్యం చెలాయిస్తోంది. పెట్రోల్ అయినా, ఎలక్ట్రిక్ అయినా సామాన్యులకు అందుబాటు ధరలో ద్విచక్ర వాహనాలను తయారు చేయడాన్ని కంపెనీ ఎప్పుడూ ఇష్టపడుతుంది. స్ప్లెండర్, విడా వి1 స్కూటర్లు దీనికి ఉదాహరణలుగా చెప్పచ్చు. ఇప్పుడు హీరో ప్రపంచంలోనే ఆటోమొబైల్ మార్కెట్‌ను మార్చే సత్తా ఉన్న మల్టీ పర్పస్ మోడల్‌తో మార్కెట్లోకి అడుగు పెట్టేందుకు సిద్ధమవుతోంది. ఎలక్ట్రిక్ స్కూటర్‌గా మార్చగల ఆటోరిక్షా మీలో ఎవరికైనా గుర్తుందా? ప్రపంచం మారుతున్న వేగంతో ఆటో మార్కెట్ స్వభావం ఎలా మారుతుందో చెప్పడానికి ఇది ఒక ప్రధాన ఉదాహరణ.

హీరో మోటోకార్ప్ యాజమాన్యంలోని సర్జ్ స్టార్టప్ ప్రవేశపెట్టిన S32 మోడల్ ఇది. ఇది ఒక విప్లవాత్మక ఎలక్ట్రిక్ స్కూటర్, కేవలం మూడు నిమిషాల్లో మూడు చక్రాల వాహనంగా రూపాంతరం చెందగల దాని ప్రత్యేక సామర్థ్యానికి ప్రత్యేకంగా నిలిచింది. డ్యూయల్ యూజ్ కాన్సెప్ట్ మోడల్ త్వరలో రియాలిటీ అవుతుంది.

ఇది కారు కాదు, సర్జ్ S32 ఎలక్ట్రిక్ స్కూటర్, ఎలక్ట్రిక్ ఆటోరిక్షాల కలయిక. ఈ వాహనాన్ని మూడు చక్రాల లేదా ద్విచక్ర వాహనంగా ఉపయోగించవచ్చు. అప్పటికి కాన్సెప్ట్ రూపంలో ప్రవేశపెట్టిన తర్వాత EVపై ఎటువంటి సమాచారం అందుబాటులో లేదు. కానీ ఇప్పుడు కంపెనీ S32 ఒక సంవత్సరంలోపు సిరీస్ ఉత్పత్తిలోకి ప్రవేశిస్తుందని ధృవీకరించింది.

సర్జ్ S32 EV అధికారిక లాంచ్ వచ్చే ఏడాది మధ్యలో జరుగుతుంది. విక్రయాల పరంగా కంపెనీ ఏటా కనీసం 10,000 యూనిట్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ద్విచక్ర వాహనం, మూడు చక్రాల వాహనం ప్రాక్టికాలిటీని కలిపి ఈ ప్రత్యేకమైన వాహనాన్ని ఇప్పుడు కొత్తగా సృష్టించిన L2/L5 కేటగిరీ కింద కూడా నమోదు చేసుకోవచ్చు.

హీరో, సర్జ్ కొత్త రిజిస్ట్రేషన్ విభాగాన్ని పరిచయం చేయడానికి రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH)తో భాగస్వామ్యం కలిగి ఉన్నాయి. ఒక ఆటోమేకర్ ఇలాంటి కాన్సెప్ట్‌ను అనుసరించడం, ప్రవేశపెట్టడం భారతదేశంలో ఇదే మొదటిసారి. సర్జ్ దీనిని “క్లాస్-షిఫ్టింగ్ వెహికల్” అని పిలుస్తుంది. 3W సెటప్ నుండి స్కూటర్‌ను విడదీయడానికి కేవలం 3 నిమిషాలు పడుతుందని సర్జ్ పేర్కొంది.

త్రీవీలర్, స్కూటర్ మధ్య మార్పిడి ఎక్కడైనా చేయొచ్చు. సర్జ్ S32 మోడల్‌లో అడాప్టివ్ కంట్రోల్స్, ఫంక్షన్‌లు ఉన్నాయి. ఇది సాఫీగా మారేలా చేస్తుంది. డిజైన్ విషయానికి వస్తే మొదటి చూపులో ఇది 3W ఎలక్ట్రిక్ కార్గో వాహనం లేదా ఆటోరిక్షా లాగా కనిపిస్తుంది.

ఇందులో ఫ్రంట్ ప్యాసింజర్ క్యాబిన్ కూడా ఉంది. ఆటోలో విండ్‌స్క్రీన్, హెడ్‌లైట్లు, టర్న్ ఇండికేటర్లు, వైపర్స్ ఇలా అన్నీ ఇచ్చారు. కానీ సర్జ్ S32 EVలో డోర్స్ చేర్చకపోవడం నిరాశ కలిగించవచ్చు. ప్రొడక్షన్ వెర్షన్‌కి వచ్చినప్పుడు కంపెనీ  డోర్స్ కూడా ఇచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఎలక్ట్రిక్ స్కూటర్ 6 కిలోవాట్ల మోటారుతో పనిచేస్తుంది. ఇది గంటకు 60 కిమీ వేగాన్ని అందుకోగలదు. వాహనానికి సపోర్ట్‌గా 3.87 kWh బ్యాటరీ ప్యాక్ కూడా అందించారు. అదే సమయంలో సర్జ్ S32 త్రీ-వీలర్ 10 kW మోటార్‌తో  45 kmph గరిష్ట వేగాన్ని అందుకుంటుంది. ఇది ఆటోమొబైల్ మార్కెట్లో విప్లవం అని చెప్పచ్చు.