Site icon Prime9

Hero Vida V1 Discounts: బ్రహ్మాండమైన ఆఫర్లు.. విడా స్కూటర్లపై స్పెషల్ డిస్కౌంట్స్..!

Hero Vida V1 Discounts

Hero Vida V1 Discounts

Hero Vida V1 Discounts: దీపావళి సందర్భంగా దేశంలోని అతిపెద్ద ద్విచక్ర వాహన సంస్థ హీరో మోటోకార్ప్ తన ఎలక్ట్రిక్ స్కూటర్ బ్రాండ్ విడా V1 Plus, V1 Pro రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లపై చాలా మంచి ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. ఈ రెండు ఈవీలపై కంపెనీ ఇప్పుడు అతిపెద్ద డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ రెండు స్కూటర్లు రిమూవబుల్ బ్యాటరీలతో వస్తాయి. ఈ స్కూటర్లు డిజైన్, ఫీచర్ల పరంగా చాలా అట్రక్ట్ చేస్తాయి.

హీరో విడా వి1 ప్లస్ ధర రూ.1,02,700 కాగా, విడా వి1 ప్రో ధర రూ.1,30,200. ఈ రెండు స్కూటర్లపై కంపెనీ రూ.40,000 వరకు తగ్గింపును అందిస్తోంది. ఇది కాకుండా  అమెజాన్-ఫ్లిప్‌కార్ట్‌ నుంచి ఈ స్కూటర్లపై చాలా మంచి ప్రయోజనాలను పొందచ్చు. ఇక్కడ మీకు నో కాస్ట్ ఈఎమ్ఐ ఆఫర్ కూడా అందుబాటులో ఉంటుంది. అంతేకాకుడా ఈఎమ్ఐ  రూ. 5,813 నుండి ప్రారంభమవుతుంది. ఈ ఆఫర్ల గురించి మరింత సమచారం కోసం హీరో డీలర్‌షిప్‌ను సంప్రదించండి.

బ్యాటరీ,  రేంజ్ గురించి మాట్లాడితే హీరో విడా V1 ప్లస్ 3.44 kWh బ్యాటరీని కలిగి ఉంది. అయితే V1 ప్రోలో 3.94 kWh బ్యాటరీ ప్యాక్‌ ఉంది. రెండు వేరియంట్లలో 6 kW ఎలక్ట్రిక్ మోటారు ఉంది. విడా V1 ప్లస్ ఫుల్ ఛార్జ్‌తో 143 కిమీ, V1 ప్రో ఫుల్ ఛార్జ్‌పై 165 కిమీల వరకు నడుస్తాయి. రెండు స్కూటర్ల గరిష్ట వేగం గంటకు 80 కిమీ. రెండు స్కూటర్లు ఒక నిమిషం ఛార్జింగ్‌తో 1.2కిమీల దూరం ప్రయాణించగలవు.

హీరో విడా V1 స్కూటర్లు రిమూవబుల్ బ్యాటరీలతో వస్తాయి. బ్యాటరీని తీసివేయవచ్చు, ఛార్జ్ చేయచ్చు. ఇది మాత్రమే కాదు మీరు వాటిని ఇంట్లోనే ఛార్జ్ చేయవచ్చు. విశేషమేమిటంటే.. స్కూటర్ గరిష్ట వేగాన్ని కూడా పెంచవచ్చు, గరిష్టంగా 100 కిమీ. ఇది 7 అంగుళాల TFT స్క్రీన్‌ను కలిగి ఉంది.  స్మార్ట్ కనెక్ట్  ఫీచర్‌లతో వస్తుంది.

విడా స్కూటర్‌లో రివర్స్ అసిస్ట్, టూ-వే థొరెటల్, క్విక్ ఓవర్‌టేక్‌ల కోసం బూస్ట్ మోడ్‌ను కూడా ఉంది. మీరు వాటిని ఛార్జ్ చేయడానికి కంపెనీ పోర్టబుల్ ఛార్జర్ అందుబాటులో ఉంటుంది. బ్యాటరీ ప్యాక్ పోర్టబుల్, కాబట్టి దీన్ని బయటకు తీసి ఇంట్లోనే ఛార్జ్ చేసుకోవచ్చు. ఈ స్కూటర్ డిజైన్ పరంగా చాలా స్టైలిష్ గా ఉంది. ఇది యునిసెక్స్ స్కూటర్.

Exit mobile version
Skip to toolbar