Site icon Prime9

Hero MotoCorp Offers: ట్రెంట్ సెట్టర్ ఆఫర్స్.. హీరో బైకులపై కళ్లుచెదిరే డీల్స్!

Hero MotoCorp

Hero MotoCorp

Hero MotoCorp Offers: భారతీయ టూవీలర్ మార్కెట్‌లో హీరో మోటోకార్ప్ ట్రెంట్ సెట్టర్. కంపెనీ ఆకర్షణీయమైన డిజైన్‌లు, ఫీచర్లతో అనేక బైక్‌లు, స్కూటర్లను విక్రయిస్తోంది. వినియోగదారులు కూడా వీటిని పెద్దఎత్తున ఇష్టపడి కొనుగోలు చేస్తున్నారు. ఈ అక్టోబర్ నెలలో కొన్ని డీలర్షిప్‌లు, కొత్త బైకులు, స్కూటర్ల కొనుగోలుపై భారీ ఆఫర్లు, డిస్కౌట్లు అందిస్తున్నాయి. హీరో నుండి కొత్త బైక్ లేదా స్కూటర్‌ని తీసుకోవాలనుకునే ఉపాధ్యాయులకు గొప్ప తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. హెచ్‌ఎఫ్ డీలక్స్, స్ప్లెండర్, ప్యాషన్ బైక్ కొనుగోలుపై రూ.2,500 క్యాష్ డిస్కౌంట్, డెస్టినీ ప్రైమ్ స్కూటర్ రూ.3,000, అన్ని రకాల 125 సీసీ బైక్‌లు రూ.2,500, ప్రీమియం మోటార్‌సైకిళ్లు రూ.4000 అందిస్తోంది.

ఉపాధ్యాయులకు ప్రకటించిన ఈ క్యాష్ బెనిఫిట్ సెప్టెంబర్ 31తో ముగిసింది. అయితే అక్టోబర్ 15 వరకు పొడిగించినందున హెచ్‌ఎఫ్ 100 బైక్‌లను తీసుకునే ఉపాధ్యాయులకు ఎటువంటి రాయితీ సౌకర్యాలు లభించవు. ఇతర కస్టమర్లకు రూ.1000 క కార్పొరేట్ ఆఫర్, రూ.2500 వరకు డెలివరీ సెగ్మెంట్ ఆఫర్ అందుబాటులో ఉన్నాయి.

హీరో మోటోకార్ప్ అన్నదాతలకు ఆర్థిక ప్రయోజనాలను కూడా అందిస్తుంది. డెయిరీలకు పాలు సరఫరా చేసే రైతులకు KMF ప్రతి బైక్ లేదా స్కూటర్ కొనుగోలుపై రూ.2,500 ఆఫర్ చేస్తోంది. ఈ తగ్గింపు అనేది జనవరి 31, 2025 వరకు అందుబాటులో ఉంటుంది. అయితే, HF100 మోటార్‌సైకిల్, డెస్టినీ ప్రైమ్ స్కూటర్‌పై ఎలాంటి ఆఫర్‌లు లేవు.

ఇటీవల హీరో స్ప్లెండర్ ప్లస్ XTEC కొత్త ఫీచర్‌తో దేశీయ మార్కెట్లోకి విడుదలైంది. ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ఆప్షన్‌తో దీని ధర రూ.83,461 ఎక్స్-షోరూమ్. హీరో స్ప్లెండర్ ప్లస్ ఎక్స్‌టెక్ (డిస్క్ బ్రేక్) బైక్‌లో 97.2 సిసి పెట్రోల్ ఇంజన్, 4 స్పీడ్ గేర్‌బాక్స్ ఉన్నాయి. డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, I3S స్టార్ట్/స్టాప్ సిస్టమ్. బైక్ సైడ్ స్టాండ్ కట్-ఆఫ్‌తో సహా డజన్ల కొద్దీ ఫీచర్లను కలిగి ఉంది.

స్ప్లెండర్ ప్లస్ ఎక్స్‌టెక్ బైక్‌కు ముందు, హీరో గ్లామర్ కొత్త ‘బ్లాక్ మెటాలిక్ సిల్వర్’ కలర్ ఆప్షన్‌లో కూడా విడుదల చేసింది. దీని డ్రమ్ బ్రేక్ వేరియంట్ (వేరియంట్) రూ.83,598, డిస్క్ బ్రేక్ వేరియంట్ రూ.87,598 ఎక్స్-షోరూమ్. కొత్త హీరో గ్లామర్‌లో 124.7 సిసి పెట్రోల్ ఇంజన్. 5 స్పీడ్ గేర్‌బాక్స్ ఉన్నాయి. ఎల్‌ఈడీ హెడ్‌లైట్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంటేషన్ స్క్రీన్, స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్ పోర్ట్, ఐడిల్ స్టార్ట్-స్టాప్ సిస్టమ్ వంటి అనేక ఫీచర్లు ఇందులో ఉన్నాయి. భద్రత కోసం డ్రమ్/డిస్క్ బ్రేక్‌లు కూడా ఉన్నాయి.

Exit mobile version