Site icon Prime9

Helen Hubless Bicycle: మోదీ మెచ్చిన సైకిల్.. స్పెసిఫికేషన్లు చూస్తే షాకవుతారు..!

Helen Hubless Bicycle

Helen Hubless Bicycle

Helen Hubless Bicycle: ‘భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025’ ఎవరి అంచనాలకు మించి జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఢిల్లీలో జరిగిన ఈ ఆటో షోలో ఆటో ఔత్సాహికులు పాల్గొన్నారు. జనవరి 17 నుండి జనవరి 22 వరకు భారతదేశంలో ఆటో ఎక్స్‌పో జరిగింది. దీన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. తరువాత ఆయన ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించిన కొన్ని ఫ్లాగ్‌షిప్ వాహనాలను చూశాడు. అలా చూసిన కొన్ని వాహనాలు మోదీ దృష్టిని ఆకర్షించాయి.

మరీ ముఖ్యంగా హెలెన్ బైక్స్ స్టాల్ వద్ద నిలబడి ఉన్న ఎర్రటి సైకిల్ ప్రధాని మోదీ దృష్టిని ఆకర్షించిందని చెప్పవచ్చు. కారణం బైక్  ప్రత్యేక రూపమే. కానీ ఈ సైకిల్‌లో ఈ ఫీచర్లేమి కనిపించవు. మరింత ఖచ్చితంగా చెప్పాలంటే, ఇది సాధారణ సైకిళ్ల నుండి పూర్తిగా భిన్నమైన శైలిని కలిగి ఉంటుంది. ఈ స్టైల్ ప్రధాని మోదీ బైక్‌ను చూసి ఆశ్చర్యపోయేలా చేసింది.

హెలెన్ కంపెనీ తయారు చేసిన ఈ-సైకిల్‌ను తొక్కడానికి పెడల్స్ ఉండవు. అలాగే, సైకిల్ చైన్, స్ప్రాకెట్ వంటి ఫీచర్లు ఇందులో మిస్ కావడం మనం చూడవచ్చు.సైకిల్ ఇంత డిఫరెంట్ స్టైల్‌లో ఉండడంతో ప్రధాని ఆశ్చర్యంగా చూశారు. ఆయనే కాదు.. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోకు హాజరైన చాలా మంది ఆ బైక్‌ని ఆశ్చర్యంగా చూశారు. ఇది ఎలక్ట్రిక్ సైకిల్, పూర్తిగా విద్యుత్తుతో నడిచేది.

ఈ ఈ-సైకిల్ పేరు హెలెక్స్. ఇది పూర్తిగా ఎలక్ట్రిక్ సైకిల్ కాబట్టి, పెడల్స్, స్ప్రాకెట్లు, చైన్లు ఉండవు. బదులుగా సైకిల్  చక్రాలను నడపడానికి మోటార్లు నేరుగా చక్రాలకు అనుసంధానించబడి ఉంటాయి. ఆ చక్రానికి కూడా సపోర్ట్ ఇచ్చేలా దీన్ని రూపొందించారు. అందువల్ల, ఆ చక్రాలలో స్పోక్ వైర్లను అందించాల్సిన అవసరం కూడా లేకుండా పోయిందొ. అదేవిధంగా, ముందు చక్రం ఉంది. అయితే దీనికి ఎలక్ట్రిక్ మోటార్ లేదు. ఇంకా, ఇ-బైక్‌పై ప్రత్యేక సస్పెన్షన్ కూడా అందించారు.

ఇది సైకిల్ రైడ్‌ను మరింత ఆసక్తికరంగా చేయడానికి సహాయపడుతుంది. యువకులు, పెద్దలు అనే తేడా లేకుండా ఎవరైనా ఈ బైక్‌ను నడపవచ్చు. అయితే, హెలెన్ బైక్స్ ఈ-సైకిల్ గురించి ఎటువంటి సమాచారాన్ని విడుదల చేయలేదు. ప్రొడక్షన్ పనులు ఇంకా పూర్తి కాలేదని అంటున్నారు. హెలిక్స్ త్వరలో అమ్మకానికి రానుందని, దీనికి సంబంధించిన అన్ని ముఖ్యమైన వివరాలను త్వరలో విడుదల చేయనున్నట్లు నివేదికలు ఉన్నాయి. అయితే, ప్రస్తుతం ఈ ఈ-బైక్ చాలా మంది దృష్టిని ఆకర్షించడం ప్రారంభించింది.

ముఖ్యంగా, భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025కి హాజరైన ఆటో ఔత్సాహికుల నుండి ఇది చాలా దృష్టిని ఆకర్షించింది. ప్రధానంగా ప్రధాని మోదీని ఈ వాహనం ఎంతగానో ఆకట్టుకుందని చెప్పొచ్చు. అందువల్ల ప్రధాని మోదీ త్వరలోనే ఈ సైకిల్ వినియోగదారుగా మారతారనడంలో సందేహం లేదు. హెలెన్ అనేది స్పోక్స్ లేకుండా పూర్తిగా ఎలక్ట్రిక్ సైకిల్ ప్రపంచంలోనే మొదటిది. తమ ఉత్పత్తులను మరింత అధునాతనంగా తీర్చిదిద్దేందుకు కంపెనీ కృషి చేస్తోంది. హెలిక్స్ ఈ-సైకిళ్లు త్వరలో మార్కెట్లో అందుబాటులోకి రానున్నాయి.

Exit mobile version
Skip to toolbar