Enfield Hunter 350: ఈ బైక్ క్రేజ్ మామూలుగా లేదుగా.. 6 నెలల్లో రికార్డు అమ్మకాలు

ఎన్నో రకాల బైక్ లు మార్కెట్ లోకి వస్తుంటాయి. కానీ కొన్ని మాత్రమే కస్టమర్ల క్రేజ్ ను సంపాదించుకుంటాయి. అలాంటి వాటిల్లో ‘రాయల్ ఎన్ ఫీల్డ్’ ముందుంటుంది. వింటేజ్ లుక్ తో పేరుకు తగ్గట్టే రాయల్ గా ఉంటాయి ఎన్ ఫీల్డ్ బైక్ లు.

Enfield Hunter 350: ఎన్నో రకాల బైక్ లు మార్కెట్ లోకి వస్తుంటాయి. కానీ కొన్ని మాత్రమే కస్టమర్ల క్రేజ్ ను సంపాదించుకుంటాయి. అలాంటి వాటిల్లో ‘రాయల్ ఎన్ ఫీల్డ్’ ముందుంటుంది. వింటేజ్ లుక్ తో పేరుకు తగ్గట్టే రాయల్ గా ఉంటాయి ఎన్ ఫీల్డ్ బైక్ లు. ఎంతో మంది యువకుల డ్రీమ్ బైక్ కూడా.

అందుకే కొంచెం రేటు ఎక్కువైనా ఈ బైక్ నే కొనాలి అని అనుకునే వాళ్లు చాలామంది ఉన్నారు. గత ఏడాది మార్కెట్ లో లాంచ్ అయిన ‘రాయల్ ఎన్ ఫీల్డ్ హంటర్’ బైక్ కి వచ్చిన రెస్పాన్స్ చూస్తే ఎన్ ఫీల్డ్ బైక్ లకు ఉన్న క్రేజ్ అర్థమవుతుంది. దేశీయ మార్కెట్లో ‘హంటర్ 350’ రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పటికి వరకు లక్షకు పైగా బైకులను కంపెనీ విక్రయించినట్టు ప్రకటించింది.

 

క్లాసిక్ 350 తర్వాత..(Enfield Hunter 350)

రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ ల సెగ్మెంట్ లో హంటర్ 350 చవకైంది. గత ఆగష్టులో రూ. 1.5 లక్షల ప్రారంభ ధరలో విడుదల అయి,

అత్యధికంగా అమ్ముడవుతున్న బైక్ లలో రాయల్ ఎన్ ఫీల్డ్ ఒకటిగా నిలిచింది.

హంటర్ 350 రెండు వేరియంట్లో లభిస్తోంది. ఒకటి హంటర్ 350 రెట్రో కాగా, మరొకటి హంటర్ మెట్రో. రెండు వేరు వేరు రంగులు, ఎక్విప్ మెంట్ ఆప్షన్లతో వస్తున్నాయి.

తక్కువ బడ్జెట్ తో హంటర్ రెట్రో వినియోగదారులను ఆకర్షిస్తుండగా.. మెట్రో వేరియంట్ లో మరిన్ని ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి.

రెట్రో ధర రూ. 1.50 లక్షలగా ఉండగా.. మెట్రో ధర 1.64 లక్షలు (ఎక్స్ షోరూమ్) గా ఉంది. కంపెనీ గత 6 నెలల్లోనే ఒక లక్ష యూనిట్లను అమ్మి రికార్డు సృష్టించింది.

క్లాసిక్ 350 తర్వాత రాయల్ ఎన్ ఫీల్డ్ తర్వాత ఎక్కువగా సేల్ అయిన మోడల్ హంటర్ 350.

 

విభిన్న రంగుల్లో..

రాయల్ ఎన్ ఫీల్డ్ హంటర్ 350 పలు రంగుల్లో లభిస్తోంది. రెబెల్ బ్లూ, రెబెల్ రెడ్ , డాపర్ వైట్, డాపర్ గ్రే, రెబల్ బ్లాక్, డాపర్ యాష్ వంటి ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఈ బైక్ 2,055 మీమీ పొడవు, 800 మిమీ వెడల్పు, 1055 మిమీ ఎత్తు, 1,370 మిమీ వీల్ బేస్ లతో 13 లీటర్ల ఫ్యూయెల్ ట్యాంక్ పొంది ఉంది.

ఈ బైక్ లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది బరువు. ఇది 181 కేజీలు మాత్రమే ఉంటుంది. ఈ సెగ్మెంట్‌లో మిగతా టూవీలర్లతో పోలిస్తే 10 నుంచి 14 కేజీల బరువు తక్కువ.

ఈ బైక్ గరిష్ట వేగం గంటకు 114 కిలోమీటర్లు కాగా మైలేజ్ 36.2 కిమీ/లీ వరకు ఉంటుంది. ఇది 41 mm టెలిస్కోపిక్ సస్పెన్షన్, 102 mm రేర్ సస్పెన్షన్ ఈ బైక్ లో ఉంది.

 

మరెన్నో ఫీచర్లతో..(Enfield Hunter 350)

రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350లో క్లాసిక్ 350లో అందించిన సింగిల్ సిలిండర్, 4 స్ట్రోక్, SOHC ఇంజిన్‌నే ఇచ్చారు.

ఈ ఇంజన్ ఫైవ్ స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తోంది. ఈ బైక్ లుక్ లో మాత్రం చూడటానికి స్పోర్ట్స్ మోడల్ తరహాలో ఉంటుంది.

దీని మ్యాక్స్ పవర్ 20.2 బీహెచ్‌పీ కాగా.. పీక్ టార్క్ 27 ఎన్ఎంగా ఉంది. 349 సీసీ ఇంజిన్‌ను ఇందులో అందించారు.

రౌండ్ టర్న్ ఇండికేటర్స్, రౌండ్ టెయిల్ లైట్ కూడా ఇందులో ఉంది. దీని లుక్ రెట్రో తరహాలో ఉండటం మరో ప్లస్ పాయింట్.

తక్కువ ధరలో రెట్రో లుక్ ఉన్న రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ అందరినీ ఆకర్షిస్తుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 ఇండోనేషియా, జపాన్, కొరియా, థాయ్‌లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, యునైటెడ్ కింగ్‌డమ్, అర్జెంటీనా,

కొలంబియా, మెక్సికో, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి అంతర్జాతీయ మార్కెట్‌లలో అందుబాటులో ఉంది.

ఈ బైక్ మోటార్‌సైకిల్ ఆఫ్ ది ఇయర్ 2023 అవార్డు కూడా సొంతం చేసుకుంది. కంపెనీ అమ్మకాలలో ఇప్పటికే మొదటి స్థానాన్ని సొంతం చేసుకుంది.