Site icon Prime9

Best SUV Under 10 Lakhs: రూ.10 లక్షల్లో తీపు ఎస్‌యూవీ కార్లు.. సేఫ్టీలో తిరుగులేదు.. మైలేజ్ కూడా ఎక్కువే..!

Best SUV Under 10 Lakhs

Best SUV Under 10 Lakhs: భారతీయ కార్ మార్కెట్‌లో ఎస్‌యూవీలు అత్యధికంగా ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. పట్టణ ప్రాంతాల్లో నివసించే చాలా మంది వ్యక్తులు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వచ్చే చిన్న ఎస్‌యూవీల కోసం చూస్తారు. అయితే రద్దీగా ఉండే ఆఫీస్ లైఫ్ లీడ్ చేసే వారికి డ్రైవ్‌‌లో ఆటోమేటిక్ ఎస్‌యూవీలు బెటర్‌గా ఉంటాయి. ఇందులో నిస్సాన్ మాగ్నైట్, టాటా పంచ్, హ్యుందాయ్ ఎక్స్‌టర్ వంటి కార్లు ఉన్నాయి. ఈ కార్ల ధరలు, ఫీచర్లు, ఇంజన్ తదితర వివరాలు తెలుసుకుందాం.

Nissan Magnite
నిస్సాన్ మాగ్నైట్ ఎస్‌యూవీలలో మొదటి స్థానంలో ఉంది. కస్టమర్లు దీని ఆటోమేటిక్ వేరియంట్‌ను రూ. 6,59,900 ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. ఇందులో అందించిన 1.0L నాచురల్ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ 71 బిహెచ్‌పి పవర్, 96 ఎన్ఎమ్ పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని క్లెయిమ్ మైలేజ్ 19.7 కెఎమ్‌పిఎల్.

నిస్సాన్ మాగ్నైట్ వైర్‌లెస్ ఛార్జింగ్, వాక్-అవే లాక్‌తో కూడిన 7-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, కూల్డ్ గ్లోవ్‌బాక్స్, స్టోరేజ్, క్లైమేట్ కంట్రోల్‌తో ఫ్రంట్ ఆర్మ్‌రెస్ట్, 360 డిగ్రీ కెమెరా, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, హై స్పీడ్ అలర్ట్ సిస్టమ్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్‌లు, ఎమర్జెన్సీ స్టాప్, EBDతో పాటు సిగ్నల్, ESC, TPMS, ABS వంటి అన్ని భద్రతా ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.

Tata Punch
టాటా మోటార్స్ గేమ్ ఛేంజర్ 5-స్టార్ సేఫ్టీ రేటెడ్ ఎస్‌యూవీ జాబితాలో రెండవ స్థానంలో ఉంది. మీరు టాటా పంచ్‌ని ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో కేవలం రూ.7,76,990 ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరతో కొనుగోలు చేయవచ్చు. ఇందులో అందించిన 1.2-లీటర్, 3-సిలిండర్ NA పెట్రోల్ ఇంజన్ 87 బిహెచ్‌పి పవర్, 115 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని మైలేజ్ 18.8 కెఎమ్‌పిఎల్.

ఫీచర్ల గురించి మాట్లాడితే ఈ ఎస్‌యూవీ యూఎస్‌బి టైప్-సి ఛార్జింగ్ పోర్ట్, వైర్‌లెస్ ఛార్జర్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, వెనుక AC వెంట్‌లు, సెంటర్ కన్సోల్‌లో వైర్‌లెస్ ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన కొత్త 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, స్టాండర్డ్ డ్యూయల్-తో వస్తుంది. ఎయిర్‌బ్యాగ్‌లు సెంట్రల్ లాకింగ్, ABS టెక్నాలజీ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉంటాయి.

Hyundai Exter
హ్యుందాయ్ అత్యంత పొదుపుగా ఉండే కార్ ఎక్స్‌టర్ జాబితాలో మూడవ స్థానంలో ఉంది. మీరు ఈ సరసమైన SUVని ఆటోమేటిక్ ఆప్షన్స్‌‌లో రూ. 8,30,400 ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరతో కొనుగోలు చేయవచ్చు. ఎక్స్‌టర్‌లో ఉన్న 1.2-లీటర్, 4-సిలిండర్ NA పెట్రోల్ ఇంజన్ 82 బిహెచ్‌పి పవర్,  113.8 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని మైలేజ్ 19.2 కెఎమ్‌పిఎల్.

ఫీచర్ల గురించి మాట్లాడితే ఈ ఎస్‌యూవీ డ్యుయల్ కెమెరా, స్మార్ట్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, యాంబియంట్ నేచర్ సౌండ్, మల్టీ లాంగ్వేజ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్,6 ఎయిర్‌బ్యాగ్‌లతో కూడిన డ్యాష్‌క్యామ్‌తో వస్తుంది. అన్ని సీట్లకు 3 పాయింట్ సీట్‌బెల్ట్, ఆటో డిమ్మింగ్ IRVM, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Exit mobile version