Site icon Prime9

December Car Sales: కార్ల సేల్స్ భూమ్.. కొత్తేడాది వేళ అమ్మకాల జోరు.. ఈ కంపెనీలకు లాభాలే లాభాలు..!

December Car Sales

December Car Sales

December Car Sales: గత నెల డిసెంబర్ 2024లో కార్ కంపెనీల విక్రయాల్లో విపరీతమైన వృద్ధి నమోదైంది. భారీ తగ్గింపులు, ఆఫర్లు అమ్మకాలను పెంచడంలో చాలా సహాయపడ్డాయి.  కంపెనీలు తమ స్టాక్‌లను క్రియర్ చేయడానికి ఆఫర్లు ప్రకటించాయి. అలానే జనవరి 1 నుంచి కార్ల ధరలు పెరుగుతాయని కూడా ప్రకటించాయి. గత నెలలో మారుతి సుజికి, మహీంద్రా, కియా, హ్యుందాయ్, ఎమ్‌జి అమ్మకాలు భారీగా పెరిగాయి.

Kia
గత నెలలో కంపెనీ 2,55,038 కార్లను విక్రయించగా, గత ఏడాది ఇదే కాలంలో ఈ సంఖ్య 2,40,919 యూనిట్లుగా ఉంది. కియా భారతదేశంలో తన వ్యాపారాన్ని ప్రారంభించినప్పటి నుండి, కంపెనీ అమ్మకాలు ఊపందుకోవడం ఇదే మొదటిసారి.

Hyundai
హ్యుందాయ్ మోటార్ ఇండియా గత నెల (డిసెంబర్ 2024) 55,078 యూనిట్లను విక్రయించింది. డిసెంబర్ 2023లో ఈ సంఖ్య 56450 యూనిట్లుగా ఉంది. ఈ సంవత్సరం జనవరి నుండి డిసెంబర్ వరకు కంపెనీ దేశీయ మార్కెట్‌లో 6,05,433 యూనిట్లను విక్రయించగా, గత ఏడాది ఇదే కాలంలో ఈ సంఖ్య 6,02,111 యూనిట్లుగా ఉంది. అందుకే కంపెనీ 0.6 శాతం వృద్ధిని సాధించింది. కంపెనీ విక్రయాలలో CNG పోర్ట్‌ఫోలియో సహకారం 13.1 శాతం ఉంది. 2024 సంవత్సరంలో క్రెటా SUV మాత్రమే 186919 యూనిట్లను విక్రయించింది.

MG 
ఎమ్‌జీ మోటార్స్ భారతదేశంలో వేగంగా ఊపందుకుంటోంది. గత నెలలో కంపెనీ దేశవ్యాప్తంగా మొత్తం 7516 యూనిట్లను విక్రయించింది. డిసెంబర్ 2024లో కంపెనీ అమ్మకాల పరంగా 55 శాతం వృద్ధిని సాధించింది. కంపెనీ విక్రయాల్లో ఎలక్ట్రిక్ వాహనాలు అత్యధికంగా దోహదపడ్డాయి. విక్రయాలకు అతిపెద్ద సహకారం విండ్సర్ EV నుండి అందింది. ప్రారంభించిన మూడు నెలల్లోనే 10 వేల యూనిట్లు అమ్ముడయ్యాయి. కంపెనీ మొత్తం అమ్మకాల్లో EV విభాగం 70 శాతం దోహదపడింది.

Mahindra
గత నెలలో దేశవ్యాప్తంగా 46222 యూనిట్లు విక్రయించగా, డిసెంబర్ (2023)లో ఈ సంఖ్య 39981 యూనిట్లుగా ఉంది. అమ్మకాల పరంగా కంపెనీ 16 శాతం వృద్ధిని సాధించింది. ఎగుమతుల పరంగా కూడా కంపెనీ 53 శాతం వృద్ధిని సాధించింది. డిసెంబర్ 2024లో మొత్తం 2776 యూనిట్లు ఎగుమతి కాగా, డిసెంబర్ 2023లో ఈ సంఖ్య 1816 యూనిట్లుగా ఉంది.

Maruti Suzuki
దేశంలోని అతిపెద్ద కార్ కంపెనీ మారుతీ సుజుకి గత నెలలో మొత్తం 178,248 యూనిట్లను విక్రయించింది. గత ఏడాది ఇదే కాలంలో 132,523 యూనిట్లను విక్రయించింది. ఆటో ఎక్స్‌పోలో కంపెనీ కొత్త కార్లను విడుదల చేయనుంది.

Exit mobile version