High Mileage Bikes: మైలేజ్‌లో రారాజులు.. లీటర్‌పై 80 కిమీ మైలేజ్.. ఆ బైకులు ఎంటంటే?

High Mileage Bikes: భారతదేశంలో ప్రతిరోజూ వందల కిలోమీటర్లు ప్రయాణించే మధ్యతరగతి, పేద ప్రజలకు ద్విచక్ర వాహనాలే పనికి ఆధారం. పెరుగుతున్న పెట్రోల్ ధరలు, నిర్వహణ ఖర్చులను దృష్టిలో ఉంచుకొని వినియోగదారులు కూడా ఎక్కువ మైలేజీని ఇచ్చే బైక్‌లను ఇష్టపడతారు. అలాంటి కస్టమర్ల కోసమే ప్రముఖ కంపెనీలు అధిక మైలేజీనిచ్చే బైకులను ప్రవేశపెట్టాయి. ప్రస్తుతం దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న, అద్భుతమైన మైలేజీని అందిస్తున్న రెండు బైక్‌ల గురించి ఇక్కడ వివరించాము.

మైలేజ్ బైక్‌లు సాధారణంగా తేలికగా ఉంటాయి. సన్నని టైర్ల కారణంగా ఇంజిన్‌పై ఒత్తిడి తగ్గుతుంది. బైక్ ఎక్కువ మైలేజీని ఇస్తుంది. ఇతర బైక్‌లతో పోలిస్తే మీరు ప్రతి నెలా తక్కువ ఇంధన ధరను పొందుతారు. ఇది కస్టమర్ జేబుపై భారం పడదు. బజాజ్ ప్లాటినా, టీవీఎస్ స్పోర్ట్ ప్రస్తుతం భారతదేశంలో అత్యధిక మైలేజీనిచ్చే బైక్‌లుగా ఉన్నాయి. ఆయా కంపెనీలు పేర్కొంటున్న ధర, ఇంజన్ పవర్, మైలేజీతో సహా వాటి స్పెసిఫికన్‌ు ఇప్పుడు చూద్దాం.

బజాజ్ ప్లాటినా 100
బజాజ్ ప్లాటినా బైక్ ధర రూ.68,685. (ఎక్స్-షోరూమ్). ఇది 72 కెఎంపిఎల్ మైలేజ్ ఇస్తుంది. బైక్‌లో 11 లీటర్ల కెపాసిటీ గల ఇంధన ట్యాంక్ ఉంది. ఫుల్ ట్యాంక్‌పై మొత్తం 792 కి మీ మైలేజ్ ఇస్తుంది. ఇది 7.79 bhp పవర్, 8.34 Nm టార్క్‌ను ఉత్పత్తి చేసే 102 cc సింగిల్ సిలిండర్ DTS-I ఇంజన్‌తో పనిచేస్తుంది. బైక్‌లో 4 స్పీడ్ గేర్‌బాక్స్, ముందు, వెనుక డ్రమ్ బ్రేక్‌లు ఉన్నాయి.

టీవీఎస్ స్పోర్ట్
టీవీఎస్ కంపెనీకి భారీ లాభాలు తెచ్చిపెడుతున్న బైక్‌గా పాపులర్ అయిన ‘టీవీఎస్ స్పోర్ట్’ ఎక్స్-షోరూమ్ ధర రూ. 65,625 ప్రారంభ ధర వద్ద కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఇది లీటర్ పెట్రోల్‌కు దాదాపు 70-80 కి.మీ మైలేజీని ఇస్తుంది. ఇందులో 10 లీటర్ల కెపాసిటి గల ఇంధన ట్యాంక్ ఉంది. ఫుల్ ట్యాంక్‌పై సుమారు 700-750 కిమీ నడుస్తుంది. ఇది 109.7 cc సింగిల్ సిలిండర్, ఎయిర్-కూల్డ్ BS-6 ఇంజన్‌తో 4-స్పీడ్ గేర్‌బాక్స్‌‌ని కలిగి ఉంటుంది. దీని ఇంజన్ 8.07 PS పవర్, 8.4 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ముందు, వెనుక డ్రమ్ బ్రేక్‌లు ఉంటాయి.