Site icon Prime9

Bajaj Pulsar N125: సరికొత్తగా పల్సర్.. రూ.90 వేలకే డిస్క్ బ్రేక్, పిచ్చెక్కించే ఫీచర్లు!

Bajaj Pulsar N125

Bajaj Pulsar N125

Bajaj Pulsar N125: బజాజ్ ఆటో తన బెస్ట్ సెల్లింగ్ పల్సర్ పల్సర్ N125 కొత్త మోడల్‌ను విడుదల చేయడానికి సిద్ధం చేసింది. ఇందుకోసం అక్టోబర్ 16వ తేదీకి కంపెనీ ఆహ్వానం పంపింది. దానిలో ‘ఆల్-న్యూ పల్సర్’ అని రాశారు. కంపెనీ ఆహ్వానంలో మోడల్‌ను పేర్కొనలేదు, అయితే ఇది పల్సర్ N125 కావచ్చు. ఈ బైక్ టెస్టింగ్ సమయంలో చాలా సార్లు కనిపించింది

రాబోయే పల్సర్ ‘ఫన్, ఎజైల్, అర్బన్’గా ఉంటుందని కంపెనీ లాంచ్ ఇన్వైట్ వెల్లడించింది. ‘అర్బన్’ అనే పదం అంటే కొత్త పల్సర్ N125 స్పోర్టీ, యూత్‌ఫుల్ స్టైలింగ్‌తో ప్రీమియం కమ్యూటర్ కావచ్చు. మోటార్‌సైకిల్‌లో ఫ్యూయల్ ట్యాంక్, స్ప్లిట్ సీట్, టూ-పీస్ గ్రాబ్ రైల్ ఉంటుంది. ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్ కూడా ఇందులో అందుబాటులో ఉంటుంది.

కొత్త పల్సర్ N125 కూడా ప్రస్తుతం ఉన్న పల్సర్ 125 వలె అదే 125cc, సింగిల్ సిలిండర్ మోటార్‌ను పొందుతుంది. అయితే బైక్‌కు స్పోర్టీ క్యారెక్టర్‌ని అందించడానికి ఇంజిన్‌లో మార్పులు చేయవచ్చు. ఇంజిన్ 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో లింకై ఉంటుంది. ్ పల్సర్ N125 TVS రైడర్ 125, Hero Xtreme 125R లకు పోటీగా ఉంటుంది. ఈ మోటార్‌సైకిల్ ఎక్స్-షోరూమ్ ధర దాదాపు రూ.90,000 నుండి రూ.1 లక్ష వరకు ఉండవచ్చు.

దీని బ్రేకింగ్ హార్డ్‌వేర్‌లో ముందు భాగంలో డిస్క్ బ్రేక్, వెనుక భాగంలో డ్రమ్ బ్రేక్ ఉండవచ్చు. బజాజ్ సింగిల్-ఛానల్ ABSతో వెనుక డిస్క్ బ్రేక్ వేరియంట్‌ను తీసుకురావచ్చు. సస్పెన్షన్ కోసం టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, వెనుక మోనోషాక్ అందుబాటులో ఉంటాయి. ఫీచర్ల గురించి మాట్లాడితే స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో డిజిటల్ కన్సోల్‌ను ఇందులో చూడవచ్చు.

Exit mobile version