Site icon Prime9

Upcoming Concept Cars 2025: చూస్తే గానీ నమ్మలేరు.. టెస్లా కార్లను తలదన్నేలా ఉన్నాయ్.. ఈ కాన్సెప్ట్ కార్ల కోసం పిచ్చ వెయిటింగ్..!

Upcoming Concept Cars 2025

Upcoming Concept Cars 2025: ఆటో ఎక్స్‌పో 2025 జనవరి 17 నుంచి 22 వరకు జరుగనుంది. ఇందులో తయారీదారులు తమ రాబోయే కార్లతో పాటు ఇప్పటికే ఉన్న వాహనాలను ప్రదర్శించనున్నాయి. వీటితో పాటు కంపెనీలు తమ అత్యుత్తమ కాన్సెప్ట్ కార్లను కూడా చూడచ్చు. ఇందులో ఫ్యూచరిస్ట్ డిజైన్‌తో పాటు అనేక గొప్ప ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. ఈ నేపథ్యంలో భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో ఏ కాన్సెప్ట్ కార్లను ప్రదర్శించనున్నాయో తెలుసుకుందాం.

Lexus LF-ZC Concept
దీన్ని ఇప్పటికే జపాన్ మొబిలిటీ షో 2023లో ప్రదర్శించారు. ఇది పూర్తిగా కొత్త స్ట్రక్చర్, ఫ్యూచరిస్టిక్ స్టైలిష్ డిజైన్ కలిగి ఉంటుంది. అలానే లెక్సస్ నుండి లగ్జరీ సెడాన్ కారు, ఇది ఆటో ఎక్స్‌పో 2025లో ప్రదర్శించనుంది. హై పర్ఫామెన్స్‌డ్  ప్రిస్మాటిక్ బ్యాటరీ టెక్నాలజీతో రానుంది,  ఇతర ఎలక్ట్రిక్ కార్లతో పోలిస్తే రెండింతలు రేంజ్ ఇస్తుంది. ఇది ప్రీమియం ఇంటీరియర్‌తో రానుంది.

Lexus ROV ​​Concept
లెక్సస్ LF-ZC కాన్సెప్ట్‌తో పాటు ROV కాన్సెప్ట్‌ను కూడా పరిచయం చేయవచ్చు. ఇది ఎంటర్టైనింగ్ ఆఫ్-హైవే వాహనం. దీనికి కాంపాక్ట్ రగ్గడ్ లుక్‌తో ఫంకీ డిజైన్ ఇచ్చారు. ఇది సొగసైన హెడ్‌లైట్లు, డార్క్ బ్రోంజ్ కలర్‌తో సిగ్నేచర్ లెక్సస్ ఫ్రంట్ ఎండ్‌ను కలిగి ఉంటుంది. ఇది వెనుక భాగంలో టెయిల్‌లైట్లు, మధ్యలో “లెక్సస్” అని చెబుతున్నారు.

Mercedes-Benz ​​Concept CLA Class
ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్-బెంజ్ CLA క్లాస్ కాన్సెప్ట్‌ను ఆటో ఎక్స్‌పో 2025లో ప్రదర్శించనుంది. ఇది ఎలక్ట్రిక్ కూపే కారు. దీని డిజైన్ చాలా మోడర్న్, షార్ప్. ఇది కనెక్ట్ చేసిన LED లైట్లు, హెడ్‌లైట్‌లలో మూడు-పాయింటెడ్ డిజైన్‌ను కలిగి ఉంది. వెనుక భాగం ICE-శక్తితో పనిచేసే CLA లాగా కనిపిస్తుంది, అయితే హెడ్‌లైట్ డిజైన్ పూర్తిగా కొత్తది, ఫ్యూచరిస్టిక్‌గా ఉంటుంది. దీని లోపలి భాగంలో పెద్ద స్క్రీన్ అందించారు. కాన్సెప్ట్ CLA పరిధి 750 కిలోమీటర్ల వరకు ఉంటుందని కంపెనీ పేర్కొంది.

VinFast Wild
విన్‌ఫాస్ట్ తన VF3, VF7, VF9 ఎలక్ట్రిక్ కార్లను ఆటో ఎక్స్‌పో 2025లో పరిచయం చేయబోతోంది. వీటితో పాటు విఎఫ్ వైల్డ్‌ను కూడా కంపెనీ ప్రదర్శించనుంది. ఇది ఎలక్ట్రిక్ పికప్ ట్రక్. వెనుకవైపు పెద్ద బెడ్ (పేలోడ్ బే)ని కలిగి ఉంది, దాని సహాయంతో ఆటోమేటిక్‌గా మడతపెట్టినప్పుడు వెనుక సీట్లను ఐదు నుండి ఎనిమిది అడుగుల వరకు పొడిగించవచ్చు. ఫిక్స్‌డ్ పనోరమిక్ గ్లాస్ రూఫ్, డిజిటల్ ORVMలను ఇందులో చూడవచ్చు.

Skoda Vision 7S
ఇది స్కోడా సెవెన్-సీటర్ SUV కాన్సెప్ట్, దీనిని కంపెనీ ఆటో ఎక్స్‌పో 2025లో ప్రదర్శించవచ్చు. ఇది అనేక ఆధునిక అంశాలతో కూడిన గొప్ప డిజైన్‌ను కలిగి ఉంది. అనేక హై-ఎండ్ ఫీచర్లతో పాటు ఇంటీరియర్ కోసం ఫ్యూచరిస్టిక్ డిజైన్ కూడా ఇందులో చూడవచ్చు. ఇందులో అమర్చిన బ్యాటరీ ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 600 కిమీ కంటే ఎక్కువ రేంజ్‌ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది. 89 kWh బ్యాటరీ ప్యాక్ ఇందులో చూడవచ్చు.

Mahindra BE Rall.e
మహీంద్రా BE Rall.eని ఆటో ఎక్స్‌పో 2025లో ప్రదర్శించవచ్చు. దీనిని INGLO ప్లాట్‌ఫారమ్‌లో అభివృద్ధి చేస్తున్నారు. కాన్సెప్ట్ SUV 2025 చివరి నాటికి ఉత్పత్తికి సిద్ధంగా ఉంటుంది. ఇది పెద్ద ఆఫ్-రోడ్ స్పెసిఫిక్ టైర్లు, చంకీ వీల్ ఆర్చ్‌లు,  మొత్తంగా కఠినమైన రూపాన్ని పొందవచ్చని భావిస్తున్నారు. BE 6 వలె, ఇది 59 kWh, 79 kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుందని అంచనా. ఇది దాదాపు 650 కి.మీ రేంజ్ అందించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

Tata Sierra ICE, EV
టాటా సియెర్రా EV ప్రొడక్షన్ రెడీ వెర్షన్‌తో పాటు, దాని ICE కాన్సెప్ట్ ఫారమ్‌ను కూడా ప్రదర్శించవచ్చు. దీని డిజైన్ ఎలిమెంట్స్ ఎలక్ట్రిక్ వెర్షన్ లాగా ఉండవచ్చు. కనెక్ట్ చేసిన హెడ్‌లైట్లు, టెయిల్ లైట్లు, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, పెద్ద అల్లాయ్ వీల్స్ ఇందులో చూడవచ్చు. టాటా సియెర్రా ICEకి 1.5-లీటర్ 4-సిలిండర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ ఇవ్వవచ్చని చెబుతున్నారు.

Tata AVINYA
టాటా అవిన్య అనేది కంపెనీ అందించే కాన్సెప్ట్ కారు. కంపెనీ ప్రకారం, దీన్ని ప్రత్యేకమైన Gen 3 EV ప్లాట్‌ఫారమ్‌లో అభివృద్ధి చేస్తున్నారు. ఇది పెద్ద బ్యాటరీ ప్యాక్‌ని పొందుతుందని, దీని సహాయంతో ఇది 500 కిమీ కంటే ఎక్కువ రేంజ్‌ని అందిస్తున్నారని భావిస్తున్నారు. కేవలం 30 నిమిషాల ఛార్జింగ్‌లో 500 కిలోమీటర్లు ప్రయాణించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

Exit mobile version